S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/18/2017 - 02:05

బీరూట్, మార్చి 17:ఉత్తర సిరియాలోని అలెప్పో రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో జరిగిన వైమానిక దాడుల్లో 42మంది దుర్మరణం చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మంది పౌరులేనని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. గుర్తు తెలియని కొన్ని యుద్ధ విమానాలే ఈ దాడులకు పాల్పడ్డాయని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ అధినేత రామి అబ్దెల్ రహ్‌మాన్ స్పష్టం చేశారు.

03/18/2017 - 00:19

ఐక్యరాజ్య సమితి, మార్చి 17: ఐక్యరాజ్య సమితికి అమెరికా ఇచ్చే నిధుల్లో అర్ధంతరంగా కోత పెట్టవద్దని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ, ఐరాసకు అత్యధికంగా నిధులిచ్చే అమెరికా నిధులను తగ్గించినట్లయితే అది ఐరాస దీర్ఘకాలిక సంస్కరణ కృషిపై ప్రభావం చూపిస్తుందన్నారు.

03/18/2017 - 00:18

సియోల్, మార్చి 17: ఉత్తర కొరియానుంచి ముప్పుగనుక పెరిగినట్లయితే ఆ దేశంపై సైనిక చర్యకు సైతం వెనకాడబోమని అమెరికా నూతన విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆసియాలో పర్యటస్తున్న టిల్లర్‌సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉత్తర కొరియా పట్ల అమెరికా విధానంలో సమూల మార్పుకు ఒక సంకేతంగా భావిస్తున్నారు.

03/17/2017 - 02:55

లండన్, మార్చి 16: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉద్దేశించిన (బ్రెగ్జిట్) బిల్లును బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం ఆమోదించారు.

03/17/2017 - 02:32

వాషింగ్టన్, మార్చి 16: భారత ఐటి నిపుణులు, కంపెనీలు ఎదురు చూస్తు న్న హెచ్1బి వర్క్ వీసా కార్యక్రమం 2018 ఆర్థిక సంవత్సరానికి తిరిగి ప్రారంభం కాబోతోంది. ఏప్రిల్ 3నుంచి వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం(యుఎస్‌సిఐఎస్) ప్రకటించింది. ఈ దరఖాస్తులు ఎన్ని రోజుల పాటు స్వీకరిస్తారనేది మాత్రం ఈ ప్రకటనలో వెల్లడి చేయలేదు.

03/17/2017 - 01:22

వాషింగ్టన్, మార్చి 16: ఆరు ముస్లిం దేశాలకు చెందిన ప్రజలు, శరణార్థులు అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా జారీ చేసిన సరికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులకు అమెరికా కోర్టులో మళ్లీ చుక్కెదురైంది.

03/16/2017 - 08:39

న్యూయార్క్, మార్చి 15: ‘స్టెల్లా’ మంచుతుపాను తాకిడికి అమెరికా ఈశాన్య ప్రాంతం అతలాకుతలమయింది. మంచు తుపాను ధాటికి వేలాది విమాన సర్వీసులు రద్దు కాగా, స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. అయితే ముందు భయపడినట్లుగా న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలపై ఈ తుపాను తీవ్రత పెద్దగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కనెక్టికట్, మసాచుసెట్స్ రాష్ట్రాల్లో మాత్రం ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

03/14/2017 - 23:45

వాషింగ్టన్, మార్చి 14: టెర్రరిస్టు సంస్థలపై డ్రోన్‌ల సాయంతో దాడులు చేసేందుకు అవసరమైన అధికారాలను అమెరికా నిఘా సంస్థ సిఐఏకు అధ్యక్షుడు ట్రంప్ కట్టబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మాజీ అధ్యక్షుడు ఒబామా విధానాల్లో ట్రంప్ చేస్తున్న మార్పుల్లో ఇది కూడా ఒకటి. ఒబామా యంత్రాంగం డ్రోన్‌ల సాయంతో దాడులు చేసే అధికారాన్ని రక్షణ శాఖకు అప్పగించింది.

03/14/2017 - 02:37

లాహోర్, మార్చి 13: గృహ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్, మరో నలుగురు చేసుకున్న పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు సోమవారం విచారించింది. అయతే హైకోర్టు కొత్త బెంచ్ ఈ నెల 20న హఫీజ్ పిటిషన్‌ను విచారిస్తుందని కోర్టు వెల్లడించింది. ఇద్దరు న్యాయమూర్తులతో ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటు చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సయ్యన్ మన్సూర్ ఆలీషా నిర్ణయం తీసుకున్నారు.

03/14/2017 - 02:31

మోసుల్, మార్చి 13: ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌పై విజయం దిశగా ఇరాక్ సైన్యాలు నిర్ణాయక దశకు చేరుకున్నాయి. పశ్చిమ మోసుల్‌లో జిహాదిస్టులను అన్నివైపుల నుంచి చుట్టుముట్టాయి. ఇంతకాలం ఐఎస్ ప్రాబల్యం ఉన్న అన్ని కీలక ప్రాంతాల్లోకి దూసుకుపోయి పట్టు బిగించాయి. ఐఎస్‌చీఫ్ మహమ్మద్ అబూ బకర్ బాగ్దాదీ మోసుల్ వదిలి పారిపోవటంతో జిహాదిస్టుల ఆత్మస్థైర్యం దెబ్బతింది.

Pages