S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/13/2017 - 03:13

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భారత్‌లో రాజకీయాలు మొదలుకొని, వ్యాపారాల వరకు అన్ని రంగాల్లోనూ వారసత్వాలు సర్వ సాధారణమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అయితే పూర్వీకులనుంచి సంక్రమించిన దానికన్నా ఒక వ్యక్తి సామర్థ్యం ముఖ్యమని స్పష్టం చేశారు.

09/13/2017 - 02:56

చిత్రాలు.. ఇర్మా హరికేన్ తీవ్రతకు ఫ్లోరిడాలోని మియామి తీరంలో రోడ్డు మీదికి కొట్టుకు వచ్చిన పడవలు. నేలకొరిగిన వృక్షాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది

09/12/2017 - 02:26

న్యూయార్క్, సెప్టెంబర్ 11: ఓ పక్క ప్రకృతి విలయాలతో అల్లాడిపోతున్న అమెరికా 9/11 మృతులకు ఘన నివాళుల్పించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 16 ఏళ్ల క్రితం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన ఆప్తులు, బంధువులకు అంజలి ఘటించేందుకు వేలాది మంది పౌరులు సోమవారం గ్రౌండ్ జీరోకు చేరుకున్నారు. ప్రపంచానే్న గడగడలాడించిన 9/11 ఉగ్రదాడిని తలచుకుని మళ్లీ అలాంటి దారుణ ఘటన పునరావృతం కాకూడదని కోరుతూ పౌరులు ప్రార్థనలు చేశారు.

09/12/2017 - 02:31

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: ఇర్మా హరికేన్ కారణంగా తలెత్తిన బీభత్సాన్ని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సంసిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భయానక గాలులు, వానతో ఫ్లోరిడా తీరాలను ఇర్మా హరికేన్ చుట్టేయడంతో తీవ్రస్థాయిలోనే నష్టం వాటిల్లింది.

09/12/2017 - 02:18

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు వారాల పాటు అమెరికాలో పర్యటన నిమిత్తం ఇక్కడకు చేరుకున్నారు. అమెరికాలో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులతో రాహుల్ భేటీ కానున్నారు.

09/12/2017 - 02:18

పారిస్, సెప్టెంబర్ 11: ధ్వంసమైన కరేబియా దీవుల్లో సహాయక చర్యలు ముమ్మర ప్రాతిపదికన మొదలయ్యాయి. ఇక్కడి వ్యాహ్యాళి కేంద్రాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఫ్రాన్స్, నెదర్‌లాండ్స్ రంగంలోకి దిగాయి. ఇప్పటికే దాదాపు 400 మందిని ఈ ప్రాంతాల నుంచి తరలించారు.

09/12/2017 - 02:13

కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్), సెప్టెంబర్ 11: రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పించేందుకు బంగ్లాదేశ్ ముందుకొచ్చింది. మైన్మార్‌లో హింస భరించలేక వేలాది మంది రోహింగ్యా బాధితులు బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. వారికోసం శిబిరం ఏర్పాటు చేయడానికి ఉచితంగా స్థలం ఇస్తామని బంగ్లాదేశ్ ప్రకటించింది.

09/12/2017 - 01:01

మియామీ, సెప్టెంబర్ 11: భయానక ప్రకృతి విలయం ఇర్మా హరికేన్ ఫ్లోరిడాను గడగడలాడించింది. తీరాలను ఛిద్రం చేసింది. భయానక వేగంతో కూడిన పెనుగాలుల తాకిడికి చెట్లు కొట్టుకు పోయాయి. క్షణాల్లో ఓ బీభత్స దృశ్యం తాండవించింది. ప్రపంచ గాలులతో పాటు ప్రళయాన్ని తలపించే రీతిలో తలెత్తిన వరదల తాకిడికి ఇళ్లు, రోడ్లు మునిగిపోయాయి.మియామీలో అయితే భారీ క్రేనే్ల నేలకొరిగాయి.

09/11/2017 - 01:23

వాషింగ్టన్, సెప్టెంబర్ 10: కరేబియన్ దీవుల్లో అల్లకల్లోలం సృష్టించిన ‘ఇర్మా’ హరికేన్ ఆదివారం ఉదయానికి మరింత బలపడి అమెరికాలోని ఫ్లోరిడా తీరాన్ని తాకింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హరికేన్ ఇర్మా ఫ్లోరిడాలోని కీ వెస్ట్ ప్రాంతాన్ని తాకినట్లు యుఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది.

09/10/2017 - 02:22

కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), సెప్టెంబర్ 9: హింసాకాండతో అట్టుడుకుతున్న మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి గత 15 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఐక్యరాజ్య సమితి శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.

Pages