S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/05/2017 - 23:06

యువకుల్లో మొటిమలు వస్తే అంత ఎబ్బెట్టుగా వుండదు. కాని యువతులకు అవి వస్తే వారు పరువంలో ప్రవేశించినట్లే! ఇది సైంటిఫిక్‌గా ఆలోచిస్తే సెక్స్ హార్మోన్‌లవల్ల ఇవి వస్తాయి. మగ పిల్లలకంటే ఆడపిల్లలు తమ ముఖ సౌందర్యం చందమామకు మచ్చలు వచ్చినట్లే భావిస్తారు. మనసులో బాధపడుతూ ఉంటారు. ఎన్నో స్నోలు, ఆయింట్‌మెంట్లు, సౌందర్య సాధనాలు, ఆయిల్స్, ఫెయిర్ అండ్ లలీ క్రీమ్సు, ప్రస్తుతం మార్కెట్లో దొరికే లేపనాలు వాడతారు.

01/05/2017 - 08:57

పదకొండేళ్ల మందిరా చటర్జీ రుపాయి విలువ తెలుసుకుంది. అందుకే తల్లిదండ్రులు తనకిచ్చిన పాకెట్ మనీతో టాయిలెట్స్ కట్టించి అందరి ప్రశంసలు అందుకుంది. జెమ్‌షెడ్‌పుర్‌లోని హిల్ టాప్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న మందిరా చటర్జీ ఇంటి వద్ద చుట్టుపక్కల పిల్లలతో ప్రతిరోజూ ఆడుకుంటుంది. ఆ పిల్లలు సడన్‌గా స్కూలు ఎందుకు మానేస్తున్నారో అర్థంకాలేదు. కారణం వారిని అడిగింది.

01/03/2017 - 22:05

మన కుటుంబాల్లో నెలసరి సరుకులు తెప్పించుకునేటప్పుడు ధనియాలు, శొంఠి, వాము మన జాబితాలో వుండవు. నిత్య జీవన విధానంలో వాటి అమూల్యమైన విలువలు మనకు తెలియవు. ఆరోగ్యరీత్యా ప్రత్యేకించి పిల్లలకు అవి ఎంతో ఉపయోగపడతాయి. అసలు ధనియాలు కూరల్లో, మసాలా కోసం కాకుండా ఔషధంగా కూడా వాడవచ్చు. రోజూ స్ర్తిలు తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడంవల్ల ముఖ్యంగా ప్రసవించిన స్ర్తిలలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.

12/29/2016 - 08:57

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై, భార్యా, భర్త ఇద్దరూ ఉద్యోగస్థులైతే పిల్లలను క్రష్‌లలో వేయడం నేడు సర్వసాధారణం. తల్లిదండ్రులు, అయిన వాళ్ళకు ఉన్న ప్రేమాభిమానాలు, పిల్లలపట్ల శ్రద్ధ పరులకు ఉండవు అని ఇటీవల టీవీలో చూపిస్తున్న క్రెష్‌లలోని చిన్న పిల్లలమీద దౌర్జన్యంగా కొందరు ప్రవర్తిస్తున్న తీరు నిరూపిస్తోంది.

12/27/2016 - 23:08

బాదం పప్పు: బరువు తగ్గుటకు సహకరిస్తుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
వాల్‌నట్: బ్రెస్ట్ కాన్సర్ రిస్క్‌లను తగ్గిస్తుంది. శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ లెవెల్స్‌ను పెంచుతుంది. టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

12/24/2016 - 21:19

ఓసారి నోరు తెరుచుకోని బాధితుడు దాని చికిత్స కోసం వచ్చాడు. ‘‘గుట్కా తింటారా’’’ అని అడిగా. ‘‘తినేవాడ్ని. వారం అయింది, మానేశా. ఇప్పుడు తినట్లే’’ అని చెప్పాడు. ‘‘‘అవునా! సరే పదండి పరీక్షిస్తా’’ అని తీసుకెళ్లి కూర్చోబెట్టి నోరు తెరవమన్నా. తన కింది ఎడమ వైపు దవడ పళ్లమధ్య గుట్కా ముక్కలు ఉన్నాయి. ‘‘మీరు పళ్లు తోమరా’’ అని అడిగా. ‘‘లేదు డాక్టర్, రోజూ పది నిమిషాలు తోముతా, అలా అడిగేరేంటి’’ అన్నాడు.

12/23/2016 - 22:30

మెదడు సమర్థంగా పనిచెయ్యటానికి కొన్ని పోషకాలు చాలా అవసరం. ఇందుకోసం మన ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మెదడును చురుకుగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకు వ్యాయామం దగ్గరనుంచి కొత్త హాబీలను అలవరచుకోవటం వరకూ రకరకాల పద్ధతులు తోడ్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.

12/22/2016 - 22:06

సమాజంలో పిల్లలు గురించి.. తల్లిదండ్రులు ప్రతిక్షణం ఆలోచన చేస్తూనే వుంటారు. తప్పదు మరి. ఎందుకంటే.. అది వారి బాధ్యత. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే నష్టపోయేది చిన్నారులే. పిల్లలకు స్వేచ్ఛ అనేది కొంత పరిమితి వుండాలి. మితిమీరిన స్వేచ్ఛ అనర్థదాయకం. ఒక వయస్సు వచ్చేవరకు మాత్రమే అది సాధ్యం. కొందరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తగినవా? కావా?

12/22/2016 - 22:02

మనసులో సేవ చేయాలనే సంకల్పం కలిగితే సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతాం. ఈ దంపతులది కూడా ఇదే ఆలోచన. టీనేజ్ వయసు నుంచి ఇద్దరూ పరులకు ఏదోరకంగా చేయాలనే తాపత్రయపడేవారు. విచిత్రంగా ఒకే ఆలోచన ఉన్న ఈ ఇద్దరినీ పెళ్లి అనే బంధం కలిపింది. ఎక్కడో ఎవరికో సేవ చేయటం ఎందుకు జన్మభూమికే సేవచేస్తే జీవితానికి సార్థకం ఉంటుందని భావించి లక్షల్లో వచ్చే ఆదాయాన్ని సైతం వదులుకొని స్వదేశానికి వచ్చారు.

12/20/2016 - 21:56

నా స్నేహితురాలింట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా ఆమె కోడలి బంధువు వచ్చింది. పరిచయాలూ, కాఫీలూ అయ్యాక బంధువు ‘‘రోజూ పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను. విశ్రాంతి అంటే ఏమిటో తెలియదు. నాకై నేను సమయం కేటాయించుకునే అవకాశమే లేదు’’ అంటూ అరగంటసేపు వాపోయింది. ‘‘ఇంతసేపు నీ కష్టాలు నువ్వు మా అందరికీ చెప్తూనే ఉన్నావు. ఈ సమయమెవరి ఖాతాలో వెయ్యాలి’’ అని అడగాలనిపించలేదు.

Pages