S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

04/20/2017 - 01:58

భారతదేశం కర్మభూమి. ఇక్కడ ఎందరో మహనీయులు అవతరించారు. మానవులుగా పుట్టిన వారందరూ వివేకవిచక్షణాలు కలవారే. సృష్టిలో ప్రాణులంతా సమానమే అయనా మానవులు బుద్ధి జ్ఞానాల రీత్యా ఇతర మృగ జాతి కన్నా మెరుగైన ప్రాణిగా చెప్పుకోవచ్చు. సృష్టికి మూలమైన శక్తి అన్ని ప్రాణుల రూపంలోను తన్ను తాను సృజియంచుకుని ధర్మాన్ని కాపాడుతూ వచ్చింది.

04/19/2017 - 00:20

రామాయణం రసరమ్యకావ్యం. క్షితిజపై తరులు, గిరులు, నదులు ఉన్నంతకాలం రామాయణం, రామనామం నిరంతరం జపించడబడుతూనే ఉంటుంది. ప్రతి ఆధ్యాత్మ హృదయాన్ని పులకింపచేస్తుంది. సమస్త మానవాళికి ఆచరణీయమై నిలుస్తుంది. ఆదర్శ జీవితానికి దిశానిర్దేశం చేయదగిన మహిమకల మహాకావ్యం ఒక్క రామాయణమే!

04/16/2017 - 23:16

భగవంతుణ్ణి చేరడానికి నవవిధవర్గాలు ఉన్నాయని పెద్దలు అంటారు. వాటిల్లో ఏ ఒక్కటి ఆచరించినా భగవంతుడు ప్రత్యక్షమవుతాడని భగవంతుని సాన్నిధ్యం దొరుకుతుందనేది పెద్దల మాట. భగవంతుడికి భక్తుడికి మధ్యనుండాల్సింది నమ్మకం, ప్రేమ, విశ్వాసం. భగవం తుడు సకల సృష్టికర్త. చీమ నుండి బ్రహ్మాండంవరకు ఆయనచే సృష్టించబడినవే. అణువునుండి ఆకాశంవరకు అన్నిటా అంతటా ఆయన వ్యాపించి వుంటాడు కనుక సర్వాంతర్యామి అన్నాం.

04/15/2017 - 21:14

‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత మాటఎంత ముఖ్యమైనదో ఎంత పదునైనదో చెబుతుంది. మంచిమాటలు మాట్లాడిన వారికి పూలబాట ఏర్పడితే నోటి దురుసు వారికి ముళ్లబాటలే అగు పడుతాయ. శత్రువులనైనా మాటలతో రజింపచేయవచ్చు అని పురాణాలు చెబుతున్నాయ.

04/14/2017 - 22:46

శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాల్లో కెల్లా అందరినీ ఆకట్టుకునేది కృష్ణావతారమే. కృష్ణుడు చేసిన చేష్టలు కాని ఆయన చూపిన లీలలు కాని సర్వులు మోహింపచేస్తాయ. ఈ అవతారంలోని కృష్ణయ్యను లీలామానుషవేషధారి అని కూడా కీర్తిస్తుంటారు. ఈ అవతారంలో స్వామి దుష్టశిక్షణ శిష్ట రక్షణతోపాటు శృంగార, వైరాగ్య, భక్తి, స్నేహ, రౌద్ర, అద్భుతాది అనేక రసాలు ప్రదర్శించాడు.

04/13/2017 - 21:19

సత్త్వరజస్తమో గుణములు మానవుడిని ఉన్నతస్థానంలోనో, లేక నీచస్థానంలోను నిలబెట్టుతాయ. ఈ మూడింటిలో సత్త్వగుణము నిర్మలమైనది. ప్రకాశమైనది, వికార రహితమైనది. సజ్జనసాంగత్యం వల్ల సత్వగుణం పెంపొందించుకోవచ్చు. దీనివల్లకూడా బంధము ఏర్పడుతుంది. దీనివల్లనే జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కాని ఆ జ్ఞానం వల్ల అంతా నాకు తెలుసునన్న గర్వం ఏర్పడి దానినుండి అహంకారం జనిస్తుంది. అహంకారం అధోగతికి దారితీస్తుంది.

04/13/2017 - 06:17

మానవులకు వుండాల్సిన అత్యుత్తమ గుణం క్షమ. సర్వం ఈశ్వరమయం అని తెలుసుకొన్న మానవులు ఏది జరిగినా దానికి కారణం భగవంతుడని నమ్ముతారు. ఒకవేళ చెడుఫలితాలు వస్తే అది పూర్వజన్మ పాపఫలితంగా కూడా భావిస్తుంటారు. ఆ చెడు ఫలితానికి కారకులు తెలుసుకొని వారిని శిక్షించకపోవడమనేది మాత్రం సజ్జనుల లక్షణం.

04/11/2017 - 21:28

సుదూరంనుంచే వచ్చే వారెవరో చూచి వారి దగ్గరకు వెళ్లి సుగ్రీవుని భయం తీర్చడానికి ఆవచ్చే వారి వివరాలను కనుగొని రావడమే కాదు, హనుమంతుడు రామునికి, సుగ్రీవునికి స్నేహము కలిపాడు. ఇక అప్పటినుంచి రామా యణంలోనే రామునికే అత్యంత ప్రియబాంధవుడయ్యా డు. రామాయణం చదివినవారందరికీ అభయమిచ్చే ఆరాధ్యదైవమయ్యాడు.

04/09/2017 - 21:05

వ్యావహారిక జీవితంలో కూడా భగవన్నామ స్మరణ, ప్రార్ధనలవల్ల దీర్ఘకాల వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు, నయమవడం, క్లిష్టమైన శస్తచ్రికిత్సల తరువాత అనూహ్యంగా కోలుకోవడం..

04/08/2017 - 21:03

రంగదరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరో
త్తుంగ తమః పతంగ పరితోషి తరంగ, దయాంతరంగ, స
త్సంగ, ధరాత్మజా హృదయసారస భృంగ, నిశాచరాబ్జమా
తంగ శుభాంగ భద్రగిరి దాశరధీ కరుణా పయోనిధీ!

Pages