S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

04/08/2017 - 21:01

‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ,
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి’(్భ.గీత 16-24)
కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్తమ్రే ప్రమాణం. కావున శాస్త్రోక్త కర్మలను గూర్చి పూర్తిగా తెలుసుకొని వాటిని ఆచరించాలని శ్రీకృష్ణుని ప్రబోధం.

04/08/2017 - 05:47

కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో ఆత్మజ్ఞానం ద్వాపర యుగంలో యజ్ఞయాగాలు, కలియుగంలో దానధర్మాలు గొప్పవని పరాశర స్మృతి తెలియజేస్తుంది. దాన ధర్మాలు చేస్తే స్వర్గం సిద్ధిస్తుందని భవిష్యత్ పురాణం చెప్పుతోంది. కలియుగంలో ధర్మవర్తనమే ఉత్తమమని పెద్దలు చెప్తారు. ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుందంటారు. ధర్మానికి హాని చేస్తే ఆ ధర్మమే హాని చేసినవారిని నాశనం చేస్తుందని మనుస్మృతి చెప్పుతుంది.

04/07/2017 - 06:20

మనిషి తనలోని అజ్ఞానాన్ని తొలగించుకొని మానసిక వికాసంతో మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే అడ్డంకులు వాతటంటవే తొలగిపోతాయి. మంచి చెడులను గుర్తించి సుఖ దుఃఖాలను సమానంగా చూసే వాడికి జ్ఞానబోధ అవసరం రాదు. ఆలోచించి పనిచేసేవారు గొప్పవారిగా అందరి ప్రశంసలు పొందుతారు. సహనం కోల్పోయిన మనిషి ప్రవర్తన నిరాశ నిస్పృహలతో విచిత్రంగా ఉంటుంది.

04/06/2017 - 05:03

శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. అతడి పుట్టినరోజే శ్రీరామనవమి. అవతార పురుషుల జన్మదినాల్లో కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైనవి. ఏటా చైత్రశుక్ల నవమినాడు మనమంతా శ్రీరామనవమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. వసంత నవరాత్రుల పేరిట రామదినోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ పండుగను గురించి వ్రత చూడామణియందు అగస్త్య సంహితలో ఇలా వ్రాయబడింది.
చైత్రమాసే, నవమ్యాంతు జాతో రామస్స్వయంహరిః

04/04/2017 - 21:04

ఎడ్డెమనుష్యుడే మెఱుంగు వెన్ని దినంబుల గూడియుండినన్
దొడ్డ గుణాఢ్యునందుగల తోరపు వర్తనలెల్ల ప్రజ్ఞనే
ర్పడ్డ వివేకి రీతి రుచిపాకము నాలుకగా కెఱంగునే
తెడ్డది కూరలో కలయు ద్రిమ్మరు చుండినైన భాస్కరా!

04/04/2017 - 21:01

దుష్టశిక్షణ శిష్ట రక్షణార్ధమై చైత్రశుద్ధ దశమినాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యా పుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
‘రామ’యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయ కమలమందు వెలుగొందుచున్న ‘ఆ శ్రీరాముని’ కనుగొనుచుండవలెను.

04/02/2017 - 21:42

శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. అతడి పుట్టినరోజే శ్రీరామనవమి. అవతార పురుషుల జన్మదినాల్లో కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైనవి. ఏటా చైత్రశుక్ల నవమినాడు మనమంతా శ్రీరామనవమి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఆరోజు రామాలయాలన్నింటా పూజలు జరుగుతాయి. ఈ పండుగను గురించి వ్రత చూడామణియందు అగస్త్య సంహితలో ఇలా వ్రాయబడింది.
చైత్రమాసే, నవమ్యాంతు జాతో రామస్స్వయంహరిః

04/02/2017 - 07:00

మంచి చెడు పడుగు పేకలా కలగలసిన నేతలాగా ఈ సమాజం మనకు కనబడుతుంది. ధర్మరాజును ఒక్క చెడుగుణాలున్న వారిని తీసుకొని రమ్మని పంపిస్తే ఆయనకు మంచిగుణాలతో ఒప్పారుతున్న వారే కనిపించారట. అట్లానే దుర్యోధనుడిని ఒక్క మంచి గుణాలున్న వానిని తీసుకొని రమ్మని పంపితే అందరూ చెడుగుణాలున్న వారే తారస పడ్డారని వెనక్కు వచ్చాడట.

03/31/2017 - 22:41

శుద్ధ సత్వరూపంలో శ్రీహరి ఇల్లాలుగా ఉన్న అమ్మనే మహాలక్ష్మిగా కీర్తింపబడుతుంది. ఈ తల్లి కూడా అధర్మపంచన చేరితే తన పదునెనిమిది చేతులలో అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం కమలము, ధనస్సు, కలశము, దండం, శక్తి, ఖడ్గము, డాలు, శంఖము ఘంట, మద్య పాత్రము, శూలం, పాశం, సుదఠ్శనచక్రము, ధరించి ప్రవాళమణివర్ణంతో తామరపూవుపై చిరునవ్వుతూ పలకరిస్తూ దర్శనమిచ్చినా ఆ అధర్మపరులను శిక్షిస్తుంది.

03/30/2017 - 22:29

పూజలు కాని వ్రతాలు కాని చేసేవారికి, చూచేవారికి మానసికానందాన్ని కలిగిస్తాయ. కాని, రాక్షసులు చేసిన తపస్సులు, వారుకోరుకున్న వరాలు అన్నీ వారి నాశనానికే దారితీశాయ. ఎందరో భక్తులు తమకున్నదానిలో భగవం తుణ్ణి మెప్పించి సర్వలోకాల్లో పూజించబడే పుణ్యాత్ములుగా వాసిగాంచారు. ఈ పూజించే విధానాన్ని బట్టి పూజలు మూడు రకాలని అంటారు. అవి సాత్త్విక, రాజస, తామస పూజలు.

Pages