S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

03/17/2017 - 21:13

ఏనుగుల్లో ఐరావతం, గుర్రాల్లో ఉశ్ఛైశ్రవం, వృక్షాల్లో కల్పవృక్షం, ధేనువుల్లో కామధేనువు, పక్షుల్లో కోకిల, వానరుల్లో హనుమంతుడు, పురుషుల్లో పురుషోత్తముడనే కృష్ణ భగవానుడు ఉత్తమ వర్గానికి చెందుతారు.

03/16/2017 - 21:02

జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయ. ఎవరైనా ఆనందంగా తమ జీవితం గడిచిపోవాలనే చూస్తారు. మన రామాయణాది కావ్యాలు భారతం, భాగవతం లాంటిఇతిహాసాలు, గ్రంథాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనిషి ఎట్లా ఆనందం పొందడానికి మార్గాలు చూపుతాయ. ప్రతి కావ్యంలోను, గ్రంథంలోను- ఏ పుస్తకంలోనైనా కనీసం సామాజికాంశాలు చెప్పే పుస్తకమైనా మంచి చేస్తే పుణ్యం వస్తుందని చెడు చేస్తే పాపం వస్తుందని చెప్తాయ.

03/15/2017 - 21:57

‘జంతునాం నరజన్మ దుర్లభం’ అని గీతావాక్యం. జంతువుల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనదని చెబుతారు. మనిషి ఉదయం నుంచి రాత్రివరకు పనిచేస్తాడు, రాత్రికాగానే నిద్రపోతాడు. ఈ రెంటిమధ్య ఏదో విశ్రాంతి, శాంతి కలిగించే అద్భుతమైన శక్తి ఉన్నదని భగవంతునిపై నమ్మకం లేని వారు గ్రహించరు. అటువంటివారికి శాంతికి, విశ్రాంతికి నోచుకోరు. కారణం- తన శక్తికంటే మరో శక్తి సృష్టిలో లేదని అనుకుంటారు.

03/14/2017 - 21:14

ఆశాపాశము దా గడున్నిడువు లేదంతంబు రాజేంద్ర! వా
రావి ప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసింబొందిరిగాక భూకాంతాదులు న్నర్థకా
మాశన్ బాయగ నేర్చెరే మును నిజాశాంతంబులం జూచిరే

03/14/2017 - 21:13

నారాయణాయ, నమశ్శివాయ అనే మహా మంత్రాలలోని వర్ణాలు రామనామంగా ఏర్పడ్డాయి. శ్రీరామనామం తారకనామం. దుఃఖాలను, దురితాలనుదూరంచేసేది. అతిసులభంగా ఏకష్టంలేకుండా కష్టాలను దూరం చేసుకోవడానికి వర్ణాశ్రమ భేదాలకతీతంగా ఎల్లరు ఉచ్చరింపగలిగిన మంత్రం రామమంత్రమే. ఈ పదం ఉపాయమూ ఉపేయవ ఋ కూడా అవుతుందని శ్రీ శంకర భగవత్పాదులవారు భాష్యగ్రంథాల్లో వివరించారు.

03/12/2017 - 21:19

తేత్రాయుగంలో దశరథుడు ఎన్నో యజ్ఞాలుచేసి, యాగాలు నిర్వహించి చివరకు ఋష్యశృంగుని దయతో పుత్రకామేష్ఠినిర్వహించి వరాల పంటగా, మహావిష్ణువు ప్రసాదంగా, యజ్ఞ్ఫలంగా శ్రీరాముని పొందాడు. కౌసల్యాదేవి నిరంతరం మహావిష్ణువు ప్రార్థించి ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితంగా రామునికి తల్లి అయంది. విశ్వామిత్రుడు, వశిష్ఠాది గురువులనుంచి అపార విద్యను గడించారు రామలక్ష్మణభరతశత్రుఘు్నలు.

03/11/2017 - 21:39

మానవ జీవితం సుఖ దుఃఖాల సమాహారం. అదే జీవిత సారం. ఈ రెండింటికి దైవం వహిస్తాడు భారం. శాంతం ప్రశాంతం చేస్తాయి సుఖాంతం. కానీ దుఃఖాన్ని అధిగమించే శక్తి ఒక్క సమయస్ఫూర్తికే ఉంది. ఎందుకంటే అది మేధావులలో నిక్షిప్తమై ఉండే అతీంద్రియ శక్తికీ, చైతన్యశక్తికీ ఆలవాలం.

03/10/2017 - 21:07

ఈ భరతదేశంలో జన్మించిన పెద్దలనుండి మానవులందరూ తమ తమ సంస్కారాలు నేర్చుకోవాలి అని మనువు స్పష్టంగా చెప్పాడు. భారతదేశం విశ్వవిజేత కావాలని కోరలేదు. అయితే విజ్ఞానం, సంస్కారాల కారణంగా ఈ దేశం విశ్వగురువు స్థానాన్ని అధిష్ఠించింది. భగవంతుడు పుట్టుకతోనే ప్రతిమనిషికీ కొన్ని దివ్య సంపదలను బహుమతిగా ప్రసాదించాడు. వాటినే మనం సంస్కారాలు అంటున్నాం.

03/09/2017 - 21:11

ప్రస్థానత్రయంలో ఒకటైన ఉపనిషత్తులలో యజుర్వేదాంతరమైన తైత్తరీయ ఉపనిషత్తు ఒక గొప్ప జ్ఞానకణిక. అంతిమ సత్యాలను అందచేయునవే ఉపనిషత్తులు. మూడు భాగములుగా లభించే ఈ జ్ఞాన నిధిలో రెండవ భాగమైన ఆనందవల్లిలో మనిషిని గూర్చి చాలా కూలంకషంగా వర్ణించబడింది. మనిషంటే ఎవరు? మనిషి కర్తవ్యం ఏమిటి? మానవ జన్మకు పరమార్థం ఏమిటి? అనే ప్రశ్నలకు చక్కటి వివరణను మనకందించింది.

03/09/2017 - 05:31

శివుడు నిత్యశుభకరుడు. సర్వమంగళాకారుడు. శివుడే శుభం, శుభమే శివుడు. శివుడే జయం, జయమే శివుడు. శివ అను శబ్దములో శ అనగా నిత్యమైన సుఖము ఇ- సాధకుడగు పురుషుడు. వ అనగా అమృతశక్తి అని అర్థం. అనగా పురుషునకు నిత్యమైన ఆనందమును ప్రసాదించు అమృత శక్తి అని అర్థము. శివుని దృష్టిలో బ్రహ్మాది దేవతలు పశుపక్ష్యాదులు ప్రాణకోటి మొత్తం పశువులే. జీవకోటికి మోక్షమును ప్రసాదించు శివుడు పశుపతి.

Pages