S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

03/07/2017 - 21:24

తల్లి అన్న పదం తనపర భేదాల్లేకుండా పిల్లలందరినీ సమానంగా చూడడానికి ఇచ్చిన నిర్వచనం. ఈర్ష్యాసూయలు లేకుండా గురుపత్ని వారి ఆశ్రమంలో ఉన్న శిష్యులందరికీ తన సొంత బిడ్డలతో సమానంగా చూసేది. ఈ గురపత్నిని తల్లిగా భావించేవారు శిష్యులు. ఇట్లాంటి స్ర్తీల గురించిన ఎన్నో సత్యాలు మనకు వేదంలోను, పురాణాల్లోను కనబడుతాయ. తల్లిని పూజించిన వారికి ఇహపరసుఖాలు రెండు లభ్యమవుతాయని మన శాస్త్రాలు చెప్తాయ.

03/05/2017 - 22:22

నవ వసంతానికి ఆహ్వానం పలకడానికి వచ్చేది ఫల్గుణం అంటారు. ఈ మాసాన్ని ‘నవపల్లవ’ మాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఫల్గుణంలోని రెండవ భాగంలో నే చెట్లు అన్నీ చిగిరించడం మొదలుపెట్తాయ.

03/05/2017 - 03:47

భగవంతుని గురించిన సర్వాన్ని తెలిపే మహా గ్రంథం మహాభాగవతం. వ్యాసుడు సర్వధర్మాలను వివరించే మహాభారతాన్ని రచించినప్పటికీ, మనశ్శాంతి లేదని వ్యధచెందేటపుడు నారదుడు నారాయణుని కథలను రచించిమని ప్రోత్సహించాడట. మహావిష్ణువు గుణ గణాలను, శ్రీహరి నామాన్ని స్తుతిస్తే ఎంతటి వారికైనా మనస్తాపం దూరం అవుతుందని మహానుభావుడైన నారదుడు చెప్పే మాటలను విని భాగవతరచనకు వ్యాసుడు ఉపక్రమించాడని అంటారు.

03/03/2017 - 21:11

కలరున్ దాతలు, నిత్తురుం ధనములుం, గామ్యార్థిముల్ గొంచు వి
ప్రులు నేతెంతురు, గానిరుూవిని బతం బోలన్ వదాన్యుండులే
డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే
బలివేడం బడయంగ వచ్చు బహు సంపల్లాభవుల్ వామనా!

03/03/2017 - 21:09

ఆహారం సాత్వికంగా ఉండాలని పెద్దలంటారు. ఇందులోని మర్మం ఏమిటంటే సాత్వికమైన ఆహారం వల్ల మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆ మంచి ఆలోచనల వల్ల సజ్జన స్నేహం లభ్యమవుతుంది. సజ్జన స్నేహం వల్ల పొరుగువారికి సాయం అందించాలన్న ఆలోచనలు రేకెత్తుతాయి.

03/02/2017 - 22:09

వత్తురె విప్రులు? వేడగ
నిత్తురె దాతలును వేడ్క నిష్ఠార్థములం?
దెత్తురె మేరును సంపద
లిత్తెఱగున దానవీరుడెవ్వడొ చెపుడా?

03/02/2017 - 22:07

సృష్టిలో మనిషికే కాదు ప్రతి ప్రాణికి కోరిక ఉంటుంది వ్యక్తపరచగల శక్తి మాత్రం మనిషికే ఉంటుంది. కోరిక ఉండడం సహజం. మనిషి బతికి బట్టకట్టడానికి పురోగమించడానికి కోరిక అవసరం కూడా. కోరిక లేని మనిషి మట్టిముద్ద. మనసులో పుట్టిన కోరిక ఆ మనసునే కోరికల పుట్టగా మారుస్తుంది. అన్నింటికీ మంచి, చెడు ఉన్నట్టే కోరికలకు గతులు ఉన్నాయి...పురోగతికి దోహదపడేవి, అథోగతికి అణగదొక్కేవి.

03/02/2017 - 04:16

విద్య, బుద్ధి, జ్ఞానములకు అధిష్ఠాన దేవతగా పరాశక్తి సరస్వతీ రూపాన్ని ధ్యానించడం జరుగుతుంది. సరస్వతీ దేవిని ఆరాధించడమెలాగో దేవీభాగవతం, బ్రహ్మ వైవర్త పురాణాలు చెపుతున్నాయి. చదువుల తల్లియే సరస్వతి.

02/28/2017 - 21:05

భగవద్గీత తృతీయాధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణ్భగవానుడు అర్జునునికీవిధంగా బోధించాడు. ‘‘శ్రేష్టులగు వ్యక్తులు ఏ కర్మను చేయుదురో సామాన్య జనులు దానినే చేయుదురు. వారు లౌకిక వైదిక వ్యవహారములందు దేనిని ప్రమాణముగా గ్రహింతురో లోకులు కూడా దానినే అనుసరింతురు’’. మహాత్ములు ఏది ఆచరించి చూపించారో ఆ అడుగుజాడల్ని అనుసరించే మహోన్నత సంతతికి చెందినవారు హిందువులు.

02/26/2017 - 21:07

ఈ మహానుభావుడెట్లింత కాలంబు
నుదరమందు నిలిచి యుండె ననుచు
నదితి వెఱగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె
భావము: వామనుని జనన సమయంలో దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. తరువాత అదితి వామనుని చూసి ‘‘ఈ మహానుభావుడు ఇంతకాలమూ నా కడుపులో ఎలా వున్నాడా?’’ అని ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన ‘జయ జయ’ శబ్దాలతో కశ్యపుడు స్వామిని సంస్తుతించాడు.

Pages