S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

03/30/2017 - 08:41

రామాయణంలో ప్రతి సంఘటన హృద్యంగమమే! సీతమ్మవారి జాడ తెలుసుకున్న హనుమను చూసిన తక్షణం మధ్యాహ్నకాల అభిజిత్ లగ్న ముహూర్తంలో యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టామన్నాడు శ్రీరాముడు. యుద్ధ సన్నాహాలను కూడా అత్యంత సుందరంగా సృజించిన వాల్మీకి మహర్షి సదా శ్లాఘనీయుడు.

03/28/2017 - 21:18

సృష్టి స్థితిలయాదులకు కారణమైన శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమిపైన జన్మించాడని అంటారు. కాని ఆ రాముడు ఎక్కడా తాను శ్రీహరి నని చెప్పలేదు. బ్రహ్మాదిదేవతలు వచ్చి నీవు శ్రీహరి అవతారుడివని చెప్పినా తాను మాత్రము దశరథుని పుత్రుడినని, దాశరథి అని కోదండరాముడనని చెప్పాడు.

03/26/2017 - 21:20

కలియుగంలో నామస్మరణ చేయడం, దానం చేయడమే పాపనాశనానకి కారణాలు అవుతాయని శాస్త్రం చెప్తోంది. దానం అనేది ఒక సద్గుణము, త్యాగానికి మరో రూపం. అడిగితే ఇచ్చేది దానం అని చెప్పుకున్నా అడగకున్నా ఎదుటివారి అవసరాన్ని గుర్తించి వారు అడగకుండా దానంచేసేది నిజమైన దానం. అందుకే పాత్ర యెరిగి దానం చేయమన్నారు. ఈ దానం కూడా కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు.

03/25/2017 - 21:30

క్రమశిక్షణ వ్యక్తిని మానసికంగాను, భౌతికంగాను అదుపులో వుంచి ప్రయోజనకరమైన పనులను సాధించేందుకు తోడ్పడుతుంది. మనసును కట్టడి చేస్తుంది. సద్గుణాలకు క్రమశిక్షణ తోడైతే సాధ్యం కాని పని ఏదీ ఉండదు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని క్రమశిక్షణను బట్టి అంచనా వేసే వీలుకలుగుతుంది.

03/24/2017 - 20:41

వినయానికి, భక్త్భివనకు సంకేతం వందనం. పరిచయస్తులు తారసపడినప్పుడు వాళ్లకి మనం రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం. అది మన సంప్రదాయం. అంతమాత్రాన వారికంటే మనం తక్కువ అన్న భావన కాదు. అందుకు ఆస్కారం ఉండకూడదనే అవతల వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేస్తాడు. అలా చేయడం సభ్యత అనిపించుకుంటుంది. ఇక్కడ నమస్కారమన్నది ఆత్మీయతతో కూడిన పలకరింపు మాత్రమే.

03/23/2017 - 21:47

శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ కొరకు దాల్చిన అవతారాల్లో సంపూర్ణావతారంలేక పరిపూర్ణావతారం కృష్ణావతారం.ఈ అవతారంలో దుష్టశిక్షణ శిష్ట రక్షణతోపాటు శృంగార, వైరాగ్య, భక్తి, స్నేహ, రౌద్ర, అద్భుతాది అనేక రసాలు ప్రదర్శించాడు.రాముడు అవతారం దాల్చినపుడు కేవలం ధర్మానికి ప్రతిరూపంగా భాసిల్లాడు. శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. అసురులను మట్టుపెట్టాడు. ఏకపత్నీవ్రతుడై విరాజిల్లాడు.

03/23/2017 - 05:35

ప్రతి మనిషిలోను మంచిచెడు ఉంటాయ. మానవుడు త్రిగుణుడు కనుక మంచి చెడు అనే సంస్కారాలు రెండూ ఉంటాయ. సత్వగుణం ఎక్కువగా ఉంటే వారు సత్వగుణులుగాను, మంచివారిగాను కీర్తింపబడుతారు. రాజస, తమోగుణాలు వల లలోభాది దుష్టచింతనలు కలుగుతాయ. స్వార్థం పెచ్చుమీరుతుంది. దానితో పరుల సొమ్మును తీసుకోవాలనే బుద్ధి ఏర్పడుతుంది. మరికొంతమందికి పరులు సంతోషిస్తుంటే ఓర్వలేకపోవడం అన్న నీచబుద్ధి ఏర్పడుతుంది.

03/21/2017 - 21:05

ఒక సాయభక్తుడు తనకు కళ్లకలక వచ్చిందని దానిని పోగొట్టమని సాయిబాబా దగ్గరకు వెళ్లాడుట. సాయబాబా రెండు జీడిగింజల్ని నూరి ముద్దగా చేసి కంటిపై పెట్టికట్టుకట్టి వెళ్లి రేపు వచ్చి కనిపించమన్నారు అతణ్ణి. ఆ భక్తుడు ఆనందంగా వెళ్లాడట. యథావిధిగా మరునాడు ఆ భక్తుడు వచ్చాడు. ఆ కంటి ఉన్న కట్టును విప్పి ధారాపాతంగా నీళ్లను పోశారు. అంతే కలక అంతా పోయింది. కళ్లు నిర్మలంగా కనిపించాయి. ఇది బాబాకంటి వైద్యం.

03/19/2017 - 23:06

ప్రేమ భావమే భక్తి అని నారదమహర్షి అన్నారు. సమబుద్ధి తో సర్వప్రాణులను చూసినపుడు సర్వాంతర్యామి అయన భగవంతుని ఆరాధించినట్లే అవుతుందనేది పెద్దల ఉవాచ. మన ఆత్మస్వరూపమును సదా చింతన చేస్తూ పరమాత్మతో ఐక్యమొనర్చుటే భక్తి అని శంకరాచార్య చెప్పారు. సర్వం ఈశ్వరమయం అని తెలుసుకొని భగవంతునికి తత్వాన్ని ఎరుకపర్చుకుని జీవించడమే భగవంతుని పూజించినట్టు అవుతుందనేది భక్తుల నమ్మకం.

03/19/2017 - 07:24

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్థనముత్తమమ్

Pages