S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

11/18/2016 - 21:17

చాలాకాలం క్రితం శ్రీశైలంలో కౌండిన్యుడు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన జీవితం పూర్తిగా భగవత్సేవకే అంకితం చేశాడు. రోజూ భగవంతుని గూర్చి, ఆయన లీలలను గురించి ప్రజలకు చెప్పేవాడు. ఒక రోజు ఆయనకు భగవంతుడు కలలో కనిపించి, ఈ మానవ జీవితం తరువాత నీవు స్వర్గంలో నా ప్రక్కనే ఉంటావు అని చెప్పాడు. దానితో కౌండిన్యుడిలో ఒకింత గర్వం పొంగింది. తను భగవంతునికి అత్యంత ప్రియమైనవాడినని గర్వపడుతుండేవాడు.

11/17/2016 - 21:07

ఇక ఈ గుణనిధి ఒనరించిన పుణ్య కర్మని తెలుపుతున్నాం. వినవలసిందే.

11/17/2016 - 21:07

పైకి కనబడకపోయినను భూమిని త్రవ్వి మానవుడు జలమును పొందుచున్నాడు. ఒక చోట దగ్గరలో లభించును, మరొకచోట ఎక్కువ ప్రయాసపై లభించను. కాని త్రవ్వినచో మాత్రము జలము లభించుట తథ్యముగదా! అలాగుననే ఈశ్వరుడున్నాడని నమ్మికతో ధ్యానించి, సేవించి, పూజించి భగవంతుని పొందవచ్చును. అన్నిటిని అందరిని అనుమానించువాడు ఏమీ చేయలేడు. దేనిని నమ్మలేడు. ఏదీ పొందలేడు. అసలు అన్ని జీవులో ఆత్మరూపియై భగవానుడున్నాడు.

11/17/2016 - 21:05

శా నిప్పై పాతక తూల శైల మడచున్ నీ నామమే మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకి భుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహా పండితుల్
చెప్పంగా దమకింక శంక వలెనా శ్రీకాళహస్తీశ్వరా!

11/17/2016 - 05:00

సర్వ జగత్తు ఈశ్వరమయం అనేది ఉపనిషత్తు వాక్యం. పరమాత్మ ఈ ప్రాపంచిక వస్తువులన్నింటిలోనూ జీవులన్నింటిలనూ వ్యాపించి ఉన్నాడు. దాన్ని నిరూపించ డానికే చెట్లు స్వచ్ఛమైన గాలినిస్తున్నాయ. నీరు సర్వప్రాణికోటికి దాహార్తిని తీరు స్తున్నాయ. ప్రకృతి మనిషేకాక ప్రాణికోటి యావత్తు జీవించడానికి ఉపయుక్తమై ఉంది. కనుక బుద్ధిజీవులైన మనుష్యలందరూ కూడా త్యాగధనులై ఉండాలనేది పెద్దల భావన.

11/15/2016 - 21:07

ప్రపంచములో మనిషికి అత్యంత ఇష్టమైనది తన కోరికలు, అత్యంత బరువైనవి బాధ్యతలు. కోరికలు ఎవరివి వారివే. అందులో వంతులు, వాటాలు ఉండవు. కాని బాధ్యతలనే తనవిగాను, పరులవిగాను విభాగిస్తారు. ఇది మనిషిగా నేను చేయవలసిన కర్తవ్యమని అందరూ అనుకోరు. ఇందులో ఇంత వరకే నా కర్తవ్యము అని అంటారు.

11/12/2016 - 22:20

పాలతో కలిసిన నీళ్లు పాలుగానే పరిగణించబడతాయి. పుత్తడితో కలిసిన ఇత్తడి కూడా పుత్తడిగానే పరిగణింపబడుతుంది. పువ్వులో చేరిన పురుగు కూడా పరమాత్మ చరణాలను చేరుకుంటుంది. వినాయకుని పాదాలనాశ్రయించుకొని వున్న చిట్టెలుక కూడా వినాయకునితో సమానంగా పూజలందుకుంటుంది. ఇదంతా వారి గొప్పతనం కాదు, సాంగత్య మహిమ.

11/12/2016 - 07:20

గోపికలను ధన్యజీవులంటారు. ఎందుకంటే వారు భక్తాగ్రేసరులు. కేవలం శ్రీకృష్ణుని మీద ఉన్న ప్రేమతోనే భక్తి సామ్రాజ్యంలో ఉన్నత స్థానంలోకి వెళ్లారు. గోవింద చరణ లగ్న మానసలయిన గోపికలు జీవిత పరమార్థమును సాధించారు. శ్రీకృష్ణుని పట్టమహిషుల భక్తి చింతామణితో సమానమయితే గోపికల భక్తి అంతకుమించిన కౌస్త్భుమణితో సమానమంటారు పెద్దలు.

11/11/2016 - 00:08

కార్తిక ఏకాదశినాడు మేల్కాంచిన మహావిష్ణువు ద్వాదశినాడు బృందావనానికి విహారానికి వస్తాడు. తన భక్తితో మహావిష్ణువే మెప్పించిన తులసి ఆరోజు విష్ణుమూర్తిని చూచి సంతోషతరంగిణి అవుతుంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తులసి. తులసితో చేసే పూజ మహావిష్ణువును సంపీత్రిని చేయడమేకాక కోరిన కోరికలను ఈడేర్చట్టు చేస్తుంది. తులసిలో సర్వదేవతలు కూడి ఉంటారంటారు

11/10/2016 - 07:42

కార్తిక శుద్ధ ఏకాదశి ప్రబోధనైకాదశిగా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అసలు ఏకాదశి అంటే మనసుతోపాటుగా కర్మజ్ఞానేంద్రియాలను ఏకం చేసి భగవంతునికి అర్పించి మానవజన్మను పునీతం చేసుకోవటానికి పనికివచ్చే మహత్తర దిశామార్గం చూపే తిథిగా ఏకాదశి ప్రశస్తినొందింది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిప్రాతమైంది. ఓసారి మహాభక్తుడైన అంబరీషుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు.

Pages