S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/11/2016 - 21:38

మన సంస్కృతి విశ్వంలోనే ఘనతగాంచింది. మన భారతీయ సంస్కృతి భవ్యమైంది, దివ్యమైంది. ఇందులో నైతిక విలువలు, నాగరికత విశిష్టతని ఎత్తిచూపిస్తాయి. మన సంస్కృతి సాహిత్య సంప్రదాయలలో మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి. అవి జాతి ఔన్నత్యానికి ఆసరాయై అద్దంపడతాయి.

12/11/2016 - 04:57

భగవద్గీతను అవగాహన చేసుకొంటే సులభంగా ఈ భవసాగరాన్ని ఈదవచ్చు. భగవద్గీతను పఠిస్తే చాలు సగుణాకార పూజనుంచి నిర్గుణపూజ విధానానికి మారుతారు. ప్రతి రోజు అతిశ్రద్ధతో పూలుపరిమళాలద్ది పూజించే పరమాత్మను నిస్సంగునిగా తెలుసుకొంటారు. వారు సంసారజీవితంలో ఉంటూనే నిస్సంగత్వాన్ని అలవర్చుకుంటారు.

12/09/2016 - 21:26

సర్వమంగళకారిణి, సర్వసంశయ నివారిణి, సర్వార్ధ ప్రదాయిని అయిన భగవద్గీత మనిషికి తోడునీడఅంటే అతిశయోక్తికాదు. జీవన సంగ్రామంలో విజయాన్ని చేకూర్చడానికి భగవద్గీతనే ఉత్తమోత్తమైన అహింసాయుధం. ఉపనిషద్గోవుల దుగ్దము భగవద్గీతఅని పండితులు అంటారు. వేదాంగవేత్తలు భగవద్గీతను వేదాంత సారమని, బ్రహ్మవిద్య అనీ చెప్తారు. అర్జునునిఉపాధిగా చేసుకొన్న కృష్ణుడు జీవులయందు సమత్వమును, కర్మకౌశలమును మానవాళికి నేర్పించాడు.

12/08/2016 - 21:32

భగవంతుని సృష్టిలో మనకు అన్నీ అద్భుత రహస్యాలే. ఆదికాలం నుండి మానవుడు చేసే ప్రతి చర్య భగవత్ సంకల్పబలమే. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణం మరెవరికీ తెలియని మర్మం. అదే దేవరహస్యం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. పంచభూతాలు మనల్ని నడిపించే ప్రత్యక్ష దైవాలు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే లోకకళ్యాణం, లేదంటే ప్రళయం.

12/08/2016 - 08:28

భగవంతుడి నిర్ణయాలు, మనుషుల కర్మ ఫలాలు కలిసి మానవ జీవితం నిర్మించబడి లోకంలో మనుగడ సాగిస్తుంది. సృష్టించిన కర్త, కర్మలకు బాధ్యతను ఆయా జీవులకే వదిలివేస్తాడు. మంచి చెడ్డలు, పాప పుణ్యాలు ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే ప్రాప్తానికి కట్టుబడి ఉంటుంటాయి. కష్టసుఖాలు, కలిమిలేములు భూమిపై జన్మించినవారికి దాదాపు అన్ని వర్గాలవారికి వర్తిస్తాయి. ఏదీ మన చేతిలో ఉండదన్న విషయం విదితమే.

12/06/2016 - 21:21

ఈ సృష్టి చాలా విచిత్రమైనది. భగవంతునిచే సృష్టించబడిన మనిషికి భగవంతుడు ‘ఒంటరితనం’ అనే రక్కసి కోరల్లో నుండి తప్పించుకొనుటకు ‘సమాజం’ అనే మిత్రుడ్ని ప్రసాదించుట భగవంతుని సృష్టి వైచిత్రానికి ప్రధాన తార్కాణం. ఈ సమాజంతోపాటు మానవుడికి దైవం/మతం అనేవి ప్రసాదించి అతడి దృష్టిని అంతర్ముఖం గావించి మానవుడ్ని ఇలపై (్భగవంతుని) తన ప్రతిరూపంగా మలచుటయే ఆ ఆద్యంతరహితుని అపర సృష్టి ప్రత్యేకత.

12/04/2016 - 21:28

పవిత్ర భారతావనిలో గంగ మహా పవిత్రంగా భావించబడుతున్న పుణ్యనది. గంగకు పురాణ కాలం నుండి ప్రాశస్త్యం వుంది. అసలు దివినుండి భూమీదకు దిగి వచ్చిన గంగావతరణ దృశ్యమే వర్ణించనలవికాని అపూర్వ దృశ్యం. ఈ పౌరాణిక ఇతిహాసం విన్నా, చదివినా ఒడలు పులకించిపోతుంది.

12/03/2016 - 20:57

అనంతమయుడు, అర్థనారీశ్వరుడు, యావత్ జగతికి శక్తి ముక్తి ప్రదాయకుడు అయిన శివుడి లీలల్ని జ్ఞానులైనా, ఆధ్యాత్మిక విజ్ఞానఖనులైనా, చక్రవర్తులైనా, రారాజులు, రాజులు అయినా శంకరుని లీలా విశేష పరీక్షలకు బద్ధులే.

12/02/2016 - 21:21

మనిషి స్థాయి ఏమిటో అతని మాటలవలన ఎరుగగలరు. అధికముగా మాట్లాడిన వదరుబోతని, మాట్లాడనిచో ముంగి అని అందురు. జ్ఞానులు మితభాషిణులు, మూర్ఖులు అతి ప్రసంగము చేయుదురు.

12/01/2016 - 21:14

ధర్మమనే ఆయుధం చేతిలో పట్టుకుని ఎంతటి కీకారణ్యంలో అయనా నడువవచ్చు. క్రూరమృగాలను సైతం మచ్చిక చేసుకోవచ్చు. కనుకనే హిరణ్యకశ్యపాది రాక్షసులు ఎంతటి ప్రమాదకరమైన వరాలను కోరినా ధర్మాన్ని పునఃస్థాపించడానికి భగవంతుడు అతి సులభ ప్రయత్నమే చేస్తాడు.

Pages