S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/22/2016 - 21:09

నిరాడంబరంగా, నిర్మలంగా, నిశ్చలమైన మనసుతో చేసే ఒకానొక పవిత్ర కార్యమే నిజమైన భక్తి. భక్తి అంటే బాహ్యాడంబరాల ప్రదర్శన అనే భావన కలియుగంలో ప్రబలుతోంది. ఇంటిలో చేసే చిన్న వ్రతం అయినా పండగ అయినా సరే నిండు మనసుతో, నిస్వార్థంతో, నిరాడంబరంగా చేసుకోవాలి.

12/22/2016 - 08:46

‘‘ఈ సమయంలో భూలోకంలో మంచి గుణాలున్న వారెవరు? పరాక్రమం దండిగా ఉన్నవారెవరు? ధర్మం తెలిసిన వారెవరు? కృతజ్ఞతా భావంతో వ్యవహరించువారెవరు? సత్యమే పలికేవారెవరు? దృఢ సంకల్పం ఉన్నవారెవరు? అంటూ 32 శుభలక్షణ సమన్వితుడు ఎక్కడైనా ఉన్నాడా ’’ అని వాల్మీకి నారదుణ్ణి అడిగి మరీ శ్రీరాముని చరిత్రను రచించాడు. ఇన్ని మంచిలక్షణాలు ఉంటేనే మానవత్వం పరిమళిస్తుందని అంటారు. మానవత్వం లేకపోతే మనిషిగా లెక్కింపబడడు కదా.

12/20/2016 - 21:26

వాలముద్రిప్పు నేలబడి వక్త్రము గుక్షియు జూపు గ్రిందటం
గాలిడు ద్రవ్వు బిండదుని కట్టెదుటన్ శునకంబు భద్ర శుం
డాలము శాలితండుల గుడంబుల చాటువచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్య గుణ యుక్తిగ జూచు మహోన్నత స్థితిన్

12/20/2016 - 21:22

జీవితంలో ఏదో ఒక ఘనకార్యం సాధించాలని ప్రతివారికీ కోరిక వుంటుంది. తమ శక్తినంతటినీ ఉపయోగించి ప్రయత్నాలు అన్నీ చేస్తారు. విజయం చేతికి అందుతున్నట్లే కానవస్తూ చేయి జారిపోతూ వుంటుంది. అలా చాలాసార్లు జరగవచ్చు. కానీ ఏ మాత్రం నిరాశ చెందకుండా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. అలా సహనంతో ప్రయత్నం కొనసాగితే విజయం తథ్యం అవుతుంది. ఈ విషయాన్ని నిర్థారించే గాధి కథను గుర్తుచేసుకొందాం.

12/18/2016 - 21:23

సృష్టిలో అత్యంత వేగవంతమయినది మనస్సు. క్షణకాలములో ముల్లోకాలను చుట్టిరాగలదు. చిత్రాతి చిత్రమైన మనస్సు చేసే చేష్టలు అంతా ఇంతా కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఏకకాలంలో ప్రదర్శించగల శక్తి కలది. సమస్త కార్యకలాపాలకు నిలయం. నాందీ ప్రస్తావనకు వేదిక. కార్యోన్ముఖులకు తొలి సోపానం. అంతఃకరణ చతుష్టయములలో మొదటిది. బుద్ధి, అహంకార, చిత్తాలకు ప్రేరణ కలిగించునది.

12/18/2016 - 00:28

మనిషి పుట్టగానే అనురాగబంధంతో పెనువేసుకొంటాడు. తల్లి అనురాగ బంధం తో ఆశిశువును కట్టిపడేస్తుంది. ఆ శిశువు పెరిగి పెద్దయ్యేకొద్దీ ఎన్నో రకాల బంధాలల్లో నో చిక్కుకుంటాడు. ఆ బంధాల వల్లే అతను కీర్తిమంతుడుగానో అపకీర్తి మంతుడుగానో కూడా చలామణి అవుతుంటాడు. బంధం స్వార్థాన్ని నేర్పిస్తే అతడు కుసంస్కారిగా స్వార్థపరుడుగా అనురాగబంధాల్లో చిక్కువిడదీయలేని బంధీ అవుతాడు.

12/16/2016 - 21:18

కష్టకాలంలో మనలను ఆదుకునేవాడు స్నేహితుడు. కల్లాకపటము, స్వార్థములేని మైత్రీబంధం ఒక దివ్యానుభవం. కష్టనష్టాల్లో కూడా ఉండి, చెడుదారిలోనడిచేవానిని కూడా మంచిదారిలోకి మళ్లించగలిగే స్నేహమే స్నేహమని పెద్దలంటారు.

12/15/2016 - 21:16

మార్గశిరమాసంలో తిరుప్పావై పాడని మహిళలు అరుదుగా ఉంటారు. నాడు శ్రీవ్రతాన్ని ఆచరించి ఆండాళ్ తల్లి శ్రీరంగణ్ణి మెప్పించి తన పతిగా చేసుకొన్నట్టుగానే ప్రతి కన్యారత్నమూ తనకు పాండురంగని వంటి నాథుడు కావాలని శ్రీవ్రతాన్ని ఆచరిం చటం ఆనవాయతిగా వస్తోంది.

12/15/2016 - 06:29

భారతీయ సంస్కృతికి సమత్వం, మానవత్వం మూలబలాలు. సంప్రదాయం, కలిసి జీవించటం, సహనం, భిన్నత్వంలో ఏకత్వం వంటి మంచి లక్షణాలు మన సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్నాయి. మనిషి సంఘజీవి కనుక సాటివారితో సహజీవనం నెరపటానికీ, మనుగడని సుఖమయం చేసుకోవడానికీ- మానవీయ విలువల పాటింపు అనూచానంగా వస్తున్నది. పరుల మేలు కోరటం, సంఘ శ్రేయస్సుకు అందరితో కలిసి నడవటం పరమ ధర్మపథంగా చెప్పబడింది.

12/13/2016 - 21:25

కాకి తన గూటిలోని కోకిల గుడ్లను తన గుడ్లుగా పొదిగి పిల్లల్ని చేసి, రెక్కలు వచ్చేదాకా కాపాడుతుంది. ఒక వృక్షం లేలేత తీగెకు తండ్రిలా ఊతమిచ్చి తన గుండెలమీద అల్లుకునే అవకాశాన్నిచ్చి, విస్తరించే సౌకర్యాన్ని కలిగిస్తుంది. చీమలు కష్టపడి నిర్మించుకున్న పుట్టను సర్పానికికి అప్పగించి పక్కకు తప్పకుంటాయి. అదే జీవుల జీవన సౌందర్యం.

Pages