S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

10/27/2016 - 03:04

దీపావళి పండుగ అటు దేవతలకు, ఇటు పితృదేవతలకు విశేషించి మానవులకు భగవద్భక్తులకూ ఆనందాన్ని కల్గించి సదాశయజ్యోతులు నింపి, ‘ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ’ అనే మన సనాతన భారతీయ సిద్ధాంతాన్ని కార్యరూపంలో నిరూపించే పండుగ దీపావళి.కేవలం టపాసులు కాల్చడం దీపాలు వెలిగించడం అనేది ఒక కార్య క్రమంగా కాక భక్తితో అంతరార్థాన్ని తెలుసుకొని చేస్తే ఆ పండుగలోని పరమార్ధం తెలుస్తుంది.

10/25/2016 - 21:02

పలకడానికి సరళమైంది. చూడడానికి సుందరసుమనోహరమైనది. ముచ్చట్లు చెప్పడానికి మధురమైంది. కీర్తించడానికి బ్రహ్మానందమైనది. వినడానికి శ్రవణపేయమైనది. న్రేతానందాన్ని హృదయానందం కలిగించే లక్షణాలున్న దానిని ఎవరు వదులుకుంటారు. కావాలని ఎవరు కోరుకోరు? అటువంటి మహామహిమాన్విత లీలామానస చోరుడు శ్రీకృష్ణుడు. దేవకీదేవి ముద్దుల తనయుడు.

10/24/2016 - 00:14

శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకాసురుని వధించిన శుభ సమయమున పురుడు పోసుకున్న నరకచతుర్దశి, దీపావళి పండుగలు యుగాల కతీతంగా నేటికీ ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల ప్రజలచే అత్యంత వైభవోపేతంగా జరుపబడుతుండడం ఆమోదయోగ్యం, ఆనందదాయకం. దీపావళి పండుగ సందర్భంగా ఇంటిల్లిపాదీ కొత్తబట్టలు ధరించి పోటాపోటీగా టపాకాయలు పేల్చడం సర్వసాధారణంగా పరిగణించబడే పండుగ నాటి విశేషం.

10/23/2016 - 01:41

పిల్లలు తెలియక తప్పు చేసినా, అబద్ధాలు ఆడినా వారిని తల్లిదండ్రులు సమర్థించకూడదు. ఒక తప్పు చేస్తే మందలించాలి, మళ్లీ అలాంటి తప్పు చేస్తే శిక్షించాలి, దండించాలి. పిల్లలకు పసిప్రాయంలోనే నైతిక విలువల గురించి చెప్పాలి. సత్యమే మాట్లాడమని, అబద్ధం చెప్తే అనర్థాలు జరుగుతాయని, మంచి పనులు చేయాలని బోధించాలి. ఇది తల్లి తండ్రుల బాధ్యత.

10/22/2016 - 01:01

హరిహరసుతుడుగా పేరెన్నిక గన్న స్వామి అయ్యప్ప. కార్తికమాసారంభంలో అయ్యప్ప స్వామి దీక్ష ఆరంభవౌతుంది. స్వామి బ్రహ్మచర్యాదీక్షవ్రతుడు. స్వామి భక్తులంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ మండలం రోజులు దీక్ష వహించి నేలమీద పడుకుంటూ స్వామిని మూడు వేళలా అర్చిస్తూ సదా అయ్యప్పనామాన్ని అనుసంధానిస్తూ పరులలలో పరమాత్మను చూస్తూ కాలాన్ని గడుపుతారు. ఇట్లాంటి వారంతా స్వామికి అనురూపులే.

10/20/2016 - 21:34

దేవాలయం, గుడి,ఇవన్నీ దేవుడు కొలువుండే స్థలాలు. వాటిని పవిత్రంగా భావిస్తాం. ఈ దేవాలయాలను మనం రోజు దర్శించాలని శ స్త్రాలు చెబుతున్నా పవిత్రమైన రోజుల్లో నైనా మనం వాటిని దర్శించుతాం. దేహమే దేవాలయం అన్నవారు కూడా లేకపోలేదు. దేహాన్ని దేవాలయంగా చూసుకొనేవారు కేవలం సత్యధర్మాలనే వారి ఆధారంగా చేసుకొంటారు. ఇతురులెవ్వరికీ అన్యాయం చేయరు.

10/19/2016 - 23:01

భగవానుడు సృష్టించిన ఈ సృష్టి మహోన్నత మైనదే కాదు మహాత్కృష్టమైనది కూడా. అందునా మానవ జన్మ ఇంకా మహత్తరమైనది. సమస్త జంతు జాలముతోపాటు మానవ మనుగడకు ఈ ప్రకృతి యే వరప్రసాదము. సృష్ట్యాదినుండి ఈ ప్రకృతి యే మనలను సంరక్షిస్తూ రక్షిస్తుంది. మానవుడు ఆధునిక సమాజములో నూరేళ్లు నవ్వుతూ గడపాలంటే పరి పూర్ణ ఆరోగ్యం ఉండాలి. సర్వకాల సర్వావస్థలలోను ప్రకృతి మాతయే సమస్త జంతు జాలమునకు మార్గదర్శి.

10/18/2016 - 21:19

భగవంతుడు ప్రేమ స్వరూపుడు. నిర్హేతుక జాయమాన కరుణాసముద్రుడని భక్తులు వర్ణిస్తారు. భగవంతుని ప్రేమ అనంతం. అపారం. అతని ప్రేమకు ఎక్కువ తక్కువ భేదాలుగాని స్వపర భేదాలు గానీ లేవు. తనను ద్వేషించే వారినీ తనను ఆరాధించేవారినీ సమానంగానేప్రేమిస్తాడు.

10/18/2016 - 21:46

మంచి మాటే మనిషికి ఆభరణం. ఉత్తమ వ్యక్తిత్వాన్ని రూపొందించుకొనేందుకు మంచిమాట తీరు మాత్రమే దోహదం చేస్తుంది. ప్రతివారు పెద్దలను గౌరవించాలి. మర్యాదగా చూడాలి. గురువులు, కుటుంబం, సమాజం మెచ్చుకొనే విధంగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడడం ఓ అలంకారం లాంటిది. అంచేతనే వాక్కును భూషణమని అంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి నిదానంగా మాట్లాడాలి.

10/15/2016 - 21:18

‘‘మును పుట్టను పుట్టిన ముని కృతమున
మూడున్నరధ్యాయముల జూచుకో’’

Pages