S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/01/2016 - 05:36

సద్గురువు శ్రీదత్తాత్రేయుడు. గురువుల్లోకెల్లా ఉత్తమగురువు విశిష్టగురువు మూర్త్భీవించిన పరమాత్మస్వరూపం. నేటిదాకా వినవచ్చే గురు పరంపర అంతయు దత్తాత్రేయ అంశయే. గురుస్థానములన్నియు దత్త స్థానమలే అని చెప్తుంటారు.

11/30/2016 - 00:21

‘‘కీశు కీశున్రు ఎంగుం అనై చ్చాతన్ కలన్డు’’ - ‘‘కేశవా కేశవా అని భరద్వాజపక్షులు కేశవనామాలను గానం చేసేస్తున్నాయి. అందరూ రండి మనమందరం కలసి భగవంతుని నామాలను జపిద్దాం అని మార్గశిరమాసంలో వచ్చే ధనుర్మాసంలో తిరుప్పావై చదివేవారంతా పిలుస్తుంటారు. భగవంతుడు సర్వాంతర్యామి. అందరి హృదయనివాసుడు. భగవంతుడు లేని చోట లేదు. కాని మానవమాత్రులు భగవంతుణ్ణి కొలవడానికి ఆలయాలను నిర్మించుకున్నారు.

11/27/2016 - 23:55

ఈ ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడింది. ఒక దేశంలో పుట్టి పెరిగినవారంతా ఒక జాతివారు. అయినా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు చెందినవారు జాతీయ భావనచే ప్రభావితులై ఒక దేశ వాసులుగా మెలుగుతున్నారు. జాతీయ సంస్కృతికి మారుపేరయినది.

11/26/2016 - 23:25

హద్దులుమీరి ఇతరులపైబడి దౌర్జన్యములు కొనసాగిస్తున్నప్పుడు, కొంతకాలం ఓపిక, ఓర్పు పట్టటం సజం. సహనం అంతరిస్తే, అవతలివారిపై దాడి తప్పదు. దురాగతాలు, దౌర్జన్యాలు కొంతకాలం వరకే సాగేది. అన్యాయాలు, అవినీతి, అహంకారాలు మితిమీరినప్పుడు యుద్ధం అనివార్యమగును. తగు సమయంలో వారికి బుద్ధి చెప్పకపోతే ధర్మం నాల్గు పాదాలపై నిలబడలేదు.

11/25/2016 - 23:35

‘అఘ’మనగా సంస్కృత భాషలో పాపము అని అర్థము. ‘మర్షణ’ అంటే పోగొట్టుకొనుట. మంత్రాలు పఠిస్తే చేసిన పాపాలు పోవు. కాని పాపం చేయకుండా ఉండటానికి దోహదపడతాయ. ఋగ్వేదములోని దశమ మండలములో అఘమర్షణ సూక్తం వివరించబడినది. సస్వర యుక్తంగా వేద పఠనము చేసే వేద పండితులు ‘అధ అఘమర్షణ సూక్తమ్’ అంటూ ఈ సూక్తాన్ని పఠిస్తారు. కేవలం మూడు మంత్రాలుగల అతి చిన్న సూక్తం ఇది. అయినప్పటికిని సృష్టిరచనను ఎంతో సంక్షిప్తంగా తెలుపుతుంది.

11/25/2016 - 04:37

సమాజం సక్రమంగా నడవడానికి అందులోని మనుష్యులు సజ్జనులుగా ఉండడానికి పెద్దలు పూర్వీకులు కొన్ని నియమాలను ఏర్పరిచారు. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మానవాళికి కల్యాణం జరగాలని కొన్ని ఆచార సంప్రదాయాలు కట్టుబాట్లును ఏర్పరిచారు. ఈ నియమాలను, ఆచార సంప్రదాయాలను గౌరవించి వాటిని ఆచరించినవారికి సుఖసంతోషాలు కలుగుతాయ.

11/23/2016 - 23:01

కౌపీనం పెట్టుకుని లేదా కాషాయం కట్టుకుని కమండలం పట్టుకున్న ప్రతివాడు యోగి కాడు. పైగా సర్వసంగ పరిత్యాగి అసలే కాలేడు. సమస్త సుఖములు రాజభోగములు అందుబాటులో ఉన్నప్పటికి వాటిని త్యజించినవాడు విరాగి కాగలడు ఏమో కాని ఎప్పటికీ యోగి కాలేడు. యోగి తత్వం వంటబట్టించుకొనుట అనుకున్నంత సులభంగాదు.

11/22/2016 - 21:12

త్రేతాయుగానికి సంబంధించిన రామరాజ్యమే నేటికి జనులు ఇష్టప డుతుంటారు. రాక్షసులెందరినో మట్టుపెట్టి అర్జునుడికి గీతను బోధించిన ద్వాపర యుగంలోని కృష్ణుని కన్నా అందరి నోట్లో రామ రామ అనే పదమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ రామ అన్న పదం ధర్మానికి మారుపేరుగా ఉంటుంది. రామరాజ్యము ధర్మరాజ్యం. అక్కడ అవినీతి అధర్మము, అవిద్య అజ్ఞానము ఇలాంటి వాటికి చోటు లేదు. ఆ రాజ్యములోని అందరూ చదువుకున్నవారే. నాగరికత నేర్చినవారే.

11/20/2016 - 21:21

వాక్కుకున్న శక్తి వాడియైన కత్తికి కూడాలేదు. కార్యాన్ని సిద్ధింప చేసుకోవాలన్నా, అపభ్రంశం అయినా మాటతీరుమీదనే ఆధారపడి ఉంటుంది. లియోటాల్ స్టాయ్ చైనా సామెతను ఉదహరిస్తూ ఇలా అంటాడు. ‘‘నీ ఆలోచనలను పరిశీలించుకో అవి మాల ట రూపం దాల్చుతాయి. నీ మాటలను జాగ్రత్తగా చూసుకో అవి కార్యరూపం దాల్చుతాయి. నీవు చేసే కార్యాలు నీస్థాయిని సూచిస్తాయి. నీ కార్యాల పట్ల అవగాహన ఉంచకో అవే అలవాట్లుగా మారుతాయి.

11/20/2016 - 06:20

సహనంతో విజయానికి రాచబాటాలు వేసుకోవచ్చు. ఈ గుణం లేని వ్యక్తికి జీవితంలో ఒడిదొడుకులు తప్పవు. సహనం ఉన్న వ్యక్తికి తాత్కాలికంగా నిరాశ కలిగినా శాశ్వతంగా విజయం సిద్ధిస్తుంది అనడంలో అతిశయం లేదు. అననూల పరిస్థితుల్లో సహనం వహిస్తే కాలం మారుతుంది. ప్రతికూల పరిస్థితులు సానుకూలం అవుతాయ. పట్టుదలతో, సహనంతో ప్రయత్నిస్తే ఏ కార్యాన్నయినా సాధించవచ్చుననేది పెద్దల మాట.

Pages