S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

10/20/2016 - 21:35

శ్రుతుల సిద్ధాంతాలని అనుసరించి సిద్ధులని, శాస్త్ర విహిత క్రమంతో దేవతల్ని, ప్రియవాక్య ధారలచేత చారణులని, గీతగాన పద్ధతులతో కిన్నరుల్ని, విశృంఖల వాగ్వైచిత్రితో ఆకాశ సంచారుల్ని, అధిక భక్తియుక్తులై రాక్షసుల్ని, నమస్కార వాక్కులతో గరుడుల్ని, ఏకాగ్ర చిత్తంతో నాగుల్ని, ప్రతిదివసమున్ను ప్రాతఃకాల ప్రారంభ సమయంలో నిర్వ్యాజము, నిర్హేతుకము, అగాధము, అడ్డమాకలేని, పొద్దులేని భక్తితో ఈ సూర్యుని భావిస్తారు.

10/19/2016 - 23:20

ఓ కువలయాక్షీ! లోపాముద్రా! ప్రతి యుగంలోను ఉప్పొంగి ద్వారకా నగరాన్ని ముంచివేసి ఆ నగరంలోని రత్నరాసుల్ని దొంగిలించుకొని పోయే కారణంగా సముద్రానికి ‘రత్నాకరం’ అనే అన్వర్థి నామం ఒనగూడింది. ద్వారకానగరం పొలిమేరల్లో కాలం చెల్లిపోయి మరణించిన సూక్ష్మక్రిములు, పుర్వులు, సర్పాలు, పక్షులు కటి ప్రదేశాల్లో పసిమి పట్టు పుట్టం కుచ్చెళ్లు తీర్చి కట్టు కొనగల్గుతాయి.

10/18/2016 - 21:47

ఓ సుందరాంగీ! ఆ ఉజ్జయినీ నగరపు నాల్గు తలపొలాల్లో ఎక్కడ కాంచినా ఎడమ చెవులు క్రిందగాను దక్షిణ కర్ణాలు (కుడిచెవులు) మీదుగాను శయనించి దీర్ఘ నిద్ర పొందిన ప్రాణుల శరీరాలు కిందిపోవు. గాజువారి కాంతిని కోల్పోవు. వికారం పొందవు. దుర్గంధం కొట్టవు. వసివాళ్లాడవు. అన్యక్షేత్రాల్లో ఇటువంటి చోద్యాలు కనబోము.

10/16/2016 - 21:14

మరల ప్రయాగకి అరుగుతాడు. మణికర్ణికా తీర్థంలో స్నానమాడుతాడు. మరల మణికర్ణికా తీర్థంలో మునుగుతాడు. కింకరులవుతూన్న ఇంద్రాది బృందారకుల కిరీట ఖచిత నూత్న రత్న రుచిధారల ఆశే్లషంవల్ల శబల వర్ణం కలవి అవుతున్న పాదపద్ముడు అయిన శంకరుడు ప్రాణులకు ప్రణవ మంత్రరాజాన్ని కుడి చెవిలో కాశీకాక్షేత్రమందు ఉపదేశిస్తాడు.

10/15/2016 - 21:39

ఆతర్వాత తీర్థయాత్రా పరాయణుడు అయి, ఇల్లు బయల్వెడలి, రెండు మూడు పయనాలు చేసి మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు నీడను బడలికను తీర్చుకోవడం కొరకు విశ్రమించి, పిమ్మట అంతరంగంలో ఈ కరణి పరి పరివిధాలుగా విత్కరించాడు.

10/18/2016 - 21:48

సాధ్వీ! శ్రీశైలమందలి శిఖరేశ్వర శిఖరాన్ని దర్శిస్తే మోక్షం చేరువ అవుతుంది. శ్రీశైలం కన్నా కేదారక్షేత్రం శీఘ్రంగా కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రయాగక్షేత్రం- త్రివేణీ సంగమస్థలి- ఆ కేదారంకన్నా అతి శీఘ్రంగా ముక్తిని ఒసగుతుంది. ఆ ప్రయాగ క్షేత్రం కంటే అతివేగంగా కాశీక్షేత్రం అపవర్గాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అఖిల తీర్థ సేవనమూ కాశీక్షేత్ర ప్రాప్తికరాలే! ఈ విషయంలో ఇసుమంతయినా సందేహానికి తావులేదు.

10/13/2016 - 21:03

అవంతి లేక ఉజ్జయిని, అయోధ్య, ఉత్తర మధుర అయిన శ్రీకృష్ణజన్మస్థలం, మీనాక్షీ సుందరేశ్వరుల నివాస స్థానం అయిన పాండ్యరాజులు దక్షిణ మధుర, ద్వారక, అంతర్వాహిని అయిన సరస్వతీ నది, కృష్ణా తరంగిణి పుట్టిన సహ్య పర్వతం, గంగా సాగర సంగమస్థలం, కాంచీపురం, గోదావరి పుట్టిన నాసికా త్య్రంబకం, సప్తగోదావరం అని ప్రసిద్ధి పొందిన దక్షారామం, కాలంజర తీర్థం, నరనారాయణులు తపస్సు ఒనర్చిన బదరికాశ్రమం అనబడే ప్రభాసతీర్థం, మహాలయ తీర

10/13/2016 - 04:30

అపుడు స్నేహ పురస్సరంగాను, గౌరవ పూర్వకంగాను, అనురాగ సహితంగాను, అభిప్రాయ గర్భితంగాను, విలాస సహితంగాను, ఉపాలంభంతోను, కలశసూనుడు లోపాముద్రతో ఈ గతి వాక్క్రుచ్చాడు.

10/09/2016 - 22:31

నివృత్త్యాదులయిన దివ్య స్థలాల చేతా, రససిద్ధి, రసాయన సిద్ధి, మూలికా సిద్ధి, పాదుకా సిద్ధి ఆర్తులైన సిద్ధిక్షేత్రములచేతా, సంశోభితం అయి ఆ పర్వతం దివ్యామృత నిర్మల శ్రీ సయంభూజ్యోతిర్లింగ మూర్తి అయిన మల్లికార్జున శ్రీమన్మహాదేవుడికి నిజ నివాసం.

10/08/2016 - 21:53

ధ్రువవు అయి వుంటావు. ఇహజన్మల్లోను, జన్మాంతరాల్లోను విహితాలైన వ్రతదానాదులచేత సంచితాలైన పాపాలు తొలగింపబడటంవల్ల అస్తమించిన రజస్తమో గుణ శరీరులైన వారు ఉత్తములు. నిర్మల సత్వ గుణులయిన నీ తత్త్వాన్ని చింతిస్తారు. భోగ, మోక్ష స్వరూప కర్మఫలాన్ని పరమేశ్వరుడు ప్రాణులకే ఒసగేవేళ నన్ను ముందుపెట్టుకొని కాని ఇవ్వలేడు.

Pages