S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

05/27/2017 - 04:23

సలలిత రామనామ జపసారమెరుంగను గాశికాపురీ
నిలయుఁడఁగాను మీ చరణ నీరజ రేణు మహాప్రభావముం
దెలియ నహల్యఁగాను , జగతీ వర, నీదగు సత్యవాక్యముం
దలఁపఁగ రావణాసురుని తమ్ముఁడఁ గాను, భవద్విలాసమున్
తలఁచి నుతింప నాతరమె? దాశరథీ కరుణాపయోనిధీ!

05/25/2017 - 08:48

పరుల ధనంబు జూచి, పరభామల జూచి హరింప గోరుమ
ద్గురుతరమానసంబనెడి దొంగనుబట్టి నిరూఢదాస్య వి
స్ఫురిత వివేక పావముల జుట్టి, భవచ్చరణంబనే మరు
త్తరువున గట్టివేయగదె దాశరథీ కరుణాపయోనిధీ

05/23/2017 - 23:05

చేసితి ఘోర కృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవముల జేరి భజించిన వారి పొందు నే
జేసిన నేరముల్ దలచి చిక్కులు బెట్టకుమయ్య, యయ్య నీ
దాసుడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

05/22/2017 - 21:12

పరధనముల్ హరించి, పరభామలనంటి, పరాన్నమబ్బినన్
మురిపము కాని, మీదనుగు మోసమెరుగందు మానసంబు, దు
స్తరమిది, కాలకింకర గదాహతి పాల్పడనీక, మమ్ము నే
తరి దరిజేర్చి కాచెదవో? దశరథీ కరుణాపయోనిధీ

05/22/2017 - 01:00

నేనొనరించు పాపములనేకములైనను, నాదు జిహ్వకున్
బానకమయ్యె మీ పరమపావన నామము దొంటిచిల్క ‘రా
మా, నను గావు’మన్న తుదిమాటకు సద్గతి జెందె గావునన్
దాని ధరింప గోరెదను దాశరథీ కరుణాపయోనిధీ

05/19/2017 - 23:05

అగణితజన్మకర్మదురితాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడ నీదలేక, జగతీధవ నీపదభక్తి నావచే
దగిలి తరింప గోరితి బదంపడి నాదుభయంబు మాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ కరుణాపయోనిధీ.

05/19/2017 - 05:13

పాపములొందువేళ రణపన్నగభూతభయజ్వరాదులం
దాపదనొందువేళ, భరతాగ్రజ,మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవు దమ్ముడిరు ప్రక్కియలం జని తద్విపత్తి సం
తాపముమాని; కాతురట దాశరథీ కరుణాపయోనిధీ.

05/17/2017 - 22:45

జనవర, మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా
నినదవినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు,ని
న్ననయము నమ్మికొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
దననుత, మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ.

05/12/2017 - 21:13

విన్న పమాలకించు రఘువీర, వహిప్రతిలోకమంచు నా
కన్న దురాత్ముఁడుం బరమ కారుణి కోత్తమ, వేల్పులందు నీ
కన్న మహాత్ముఁడుం బతితకల్మష దూరుఁడు లేఁడు నాకు వి
ద్వన్ను త నీవె నాకు గతి! దాశరథీ కరుణాపయోనిధీ

05/11/2017 - 21:37

ఘోరకృతాంతవీరభట కోటికి గుండెదిగుల్, దరిద్ర తా
కారపిశాచ సంహరణ కార్యవినోది, నికుంఠ మందిర
ద్వారక నాటభేది నిజదాసజనావళి కెల్ల ప్రొద్దు నీ
తారక నామమెన్ను కొన దాశరథీ కరుణాపయోనిధీ

Pages