S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేర్చుకుందాం
శ్రీరమ సీత కాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జనంబుగాగ విరజానుడి గౌతమిగా వికుంఠము
న్నారయ భద్రశైల శిఖరాఘముకాగ, వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు, దశరధీ, కరుణాపయోనిధీ!
పండిత రక్షకుండ ఖిల పాప విమోజనుడబ్జ సంభవా
ఖండల పూజితుండు దశకంఠ విబంఠన చండ కాండ కో
దండ కళా ప్రవీణుడగు తావక కీర్తి వధూటికిత్తు బూ
దండలు గాగ నా కవిత, దాశరథీ! కరుణాపయోనిధీ!
అజునకు తండ్రివయ్యు, సనకాదులకుం బరతత్త్వమయ్యు, స
ద్విజయుని కోటికెల్ల గులదేవత వయ్యు, దినేశ వంశ భూ
భుజాలకు మటివయ్యు, బరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరా
డ్థ్వజ మిముబ్రస్తుతించెదను, దాశరథీ! కరుణాపయోనిధీ!
పరమ దయానిధే! పతిత పావన నామ హరే యటంచు సు
స్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాద ధూళి నా
శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట, దాశరథీ! కరుణాపయోనిధీ!
ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుకనిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీ నామస్మరణ గల్గునొ గల్గదొ నాటికిపుడే
తప్పక జేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!
దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తార దవానలార్చికి సుధార సవృష్టి దురంత దుర్మతా
చార భయంకరాటవికి చండ కఠోర కుఠార ధార నీ
తారక నామమెన్ను కొన దాశరథీ! కరుణాపయోనిధీ!
తరణి కులేశ నా నుడుల తప్పులు కల్గిన నీదు నామ స
ద్విర చితమైన కావ్యము పవిత్రము గాదె? వియన్నదీ జలం
బరగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్త్వముం
దరమె గణింపనెవ్వరికి? దాశరధీ! కరుణాపయోనిధీ!
గురుతరమైన కావ్యరస గుంభ కబ్బురమంది ముష్కరుల్
సరసుల మాడికి సంతసిల జాలుదురోటు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్య భూ
ధరమున జారునే శిలలు? దాశరథీ కరుణాపయోనిధీ!
శ్రీ రఘువంశతోయధికి శీతమయూఖాడవైన నీ పవి
త్రోరు పదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరిత వాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనారు, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!
దురితలతాల విత్ర, ఖర దూషణ కాననవీతి హోత్ర, భూ
భరణ కళా విచిత్ర, భవబంధ విమోచనసూత్ర, చారు వి
స్ఫుర దరవింద నేత్ర, ఘనపుణ్య చరిత్ర, వినీల భూరికం
ధర సమగాత్ర, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!