S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

06/30/2017 - 21:21

వారిజ పత్రమందిడిన వారి విధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దనువంటని కుమ్మరి పుర్వు రీతి సం
సారమునన్ మెలంగుచు విచారగ్రుడవై పరమొందుగాదె స
త్కార మెరింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ

06/29/2017 - 22:15

నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి, లోకమకల్మషంబుగా
నీ సుత సేయు పావనము, నిర్మిత కార్య ధురీణ దక్షుడై
నీ సుతుడిచ్చు వాయువులు, నిన్ను భజించిన కల్గకుండునే
దాసుల కోప్సితార్థములు దాశరథీ కరుణాపయోనిధీ

06/28/2017 - 23:31

కాంచన వస్తు సంకలిత కల్మష మగ్ని పుటంబు వెట్టి వా
రించిన రీతి నాత్మ నిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తి యోగదహనార్చి దగుల్పక పాయునే కన
త్కాంచన కుండలాభరణ దాశరథీ! కరుణా పయోనిధీ

06/27/2017 - 21:25

నీ మహనీయతత్త్వ రస నిర్ణయ బోధ కధామృతాబ్ధిలో
దానును గ్రుంకులాడక వృథా తను కష్టము జెంది మానవుం
డీ మహిలోక తీర్థములనెల్ల మునిగిన దుర్వికార హృ
త్తామస పంకముల్ విడునె దాశరధీ కరుణాపయోనిధీ

06/25/2017 - 23:20

భానుడు తూర్పునందు గనుపట్టిన బావక చంద్ర తేజముల్
హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము సేయుచున్న బరదైవ మరీచులడంగకుండునే
దానవ గర్వ నిర్దళన దాశరధీ కరుణాపయోనిధీ!

06/24/2017 - 21:35

చిరతర భక్తి నొక్క తులసీ దళ సమర్పణ సేయువాడు ఖే
చర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సదా భవత్
స్ఫురదరవింద పాదముల బూజలొనర్చిన వారికెల్ల ద
త్పరమరచేత ధాత్రి గద దాశరథీ కరుణా పయోనిధీ

06/23/2017 - 22:39

కరములు నీకు మ్రొక్కులిడ గన్నులు మిమ్ము నె జూడ జిహ్వమీ
స్మరణ దలిర్ప, వీనులు భవత్క్ధలన్ వినుచుండ, నాసమీ
యరు తను బెట్టు పూసరుల కాసగొనం, పరమార్థ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణా పయోనిధీ

06/22/2017 - 22:43

వనకరి చిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికి చిక్కె జిక్కె జిల్వ కనువేదురు జెందెను లేళ్ళు, తావిలో
మనికి నశించె దేటి, తరమా యిరుమూటిని గెల్వ నైదు సా
ధనముల నీవె కావదగు దాశరధీ, కరుణాపయోనిధీ

06/21/2017 - 22:26

హరిపద భక్తి నింద్రియ జయాన్వితుడుత్తము డింద్రయమ్ములన్
మరుగక నిల్పనూదినను మధ్యము డింద్రియ పారవశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ, దుర్మతినైన నన్ను నా
దరమున నెట్ల కాంచెదవొ, దాశరథీ కరుణాపయోనిధీ

06/20/2017 - 21:04

దురితలతా నుసారి భవ దుఃఖ కదంబము రామ నామ భీ
కరతర హేతిచే దెగి వక్తావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాది కీటకో
త్కరము విలీనమై చనదె, దాశరథీ కరుణాపయోనిధీ

Pages