S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

06/07/2017 - 22:32

వారిచరావతారమున వారిధిలో జొరబారి క్రోధ ని
స్తారగుడైన యా నిగమ తస్కర వీర నిశాచ రేంద్రునిన్
జేరివధించి వేదముల చిక్కెడలించి విరించికిన్, మహో
దొరతనిచ్చి తీవెగద, దాశరధీ కరుణాపయోనిధీ

06/06/2017 - 21:18

సూరిజనుల్ దయపరులు, సూనృతవాదులు లుబ్ధమానవుల్
వీర పతివ్రతాంగనలు, విప్రులు, గోవులు, వేదములు, మహీ
భారము దాల్పగా జనులు సావనమైన పరోపరకార స
త్కార మెరుంగ లేరకట దాశరథీ, కరుణాపయోనిధీ

06/04/2017 - 23:00

వాసవ రాజ్యభోగ సుఖవార్థిని తేలు ప్రభుత్వమబ్బినా
యాసకు మేర లేదు కనకాద్రి సమాన ధనమ్ము గూర్చి నం
గాసును వెంటరాదు, కవి కానక చేసిన పుణ్యపాపముల్
వీసర బోవ నీవు, పదివేలకు జాలు భవంబు నొల్ల నీ
దాసుని గాక నేలి కొను దాశరథీ కరుణా పయోనిధీ

06/02/2017 - 21:15

చరణము సోకినట్టి శిల జవ్వని రూపగుటొక్క వింత, సు
స్థిరముగ నీటిపై గిరులు తేలిన దొక్కటి వింత కాని, మీ
స్మరణ దనర్చు మానవులు సద్గతి చెందిన దెంత వింత? రుూ
ధరమ ధరాత్మ జారమణ! దాశరథీ కరుణా పయోనిధీ!

06/01/2017 - 22:30

నీ ససజంబు సాత్త్వికము, నీవిడిపట్టు సుధాపయోధి ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం
హాసన మిద్ధరిత్రి, గొడుగాక సమక్షులు చంద్ర భాస్కరుల్
నీ సమతల్పమాది ఫణి, నీవె సమస్తము, గొల్చునట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణా పయోనిధీ.

06/01/2017 - 01:17

భూపలలొమ, రామ, రఘుపుంగవ రామ, త్రిలోక రాజ్య సం
స్థాపనరాయ,మోక్ష ఫలదాయక రామ, మదీయ పాపముల్
పాపగదయ్య రామ, నిను ప్రస్తుతి చేసేదనయ్య, రామ, సీ
తాపతి రామ, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

06/01/2017 - 00:56

దీక్ష వహించి నా కొలఁది దీనుల నెందరి ఁ గాచితో జగ
ద్రక్షక, తొల్లి యాద్రుపద రాజ తనూజ తలంచి నంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట, నా మొర చిత్తగించి ప్ర
త్యక్షము గావ దేమిటికి? దాశరథీ కరుణాపయోనిధీ!

06/01/2017 - 00:12

నేర్చుకుందాం

దాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుఁడా గుహుఁడు తావక దాస్యమొసంగినావు నేఁ
జేసిన పాపమా? వినుతి సేసిన ఁ గావవు గావుమయ్య, నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ!

05/31/2017 - 05:14

మామక పాతక వ్రజము మాన్ప నగణ్యము చిత్ర గుప్తులే
మేమని వ్రాతురో? శమనుఁడేమి విధించునొ? కాలకింకర
స్తోమమొనర్చుటేమొ? వినఁ జొప్ప డదింతకు మునె్న దీన చిం
తామణి, యెట్లు గాచెదవొ? దాశరథీ కరుణాపయోనిధీ

05/27/2017 - 04:45

పాతకుఁలైన మీ కృపకుఁ బాత్రులు గారె తలంచి చూడఁ ఆ
బ్రాతికి గల్గెఁ బావన, మరాతికి రాజ్యసుఖంబు గల్గె , దు
ర్జాతికి ఁ బుణ్యమబ్బెఁ గపి జాతి మహత్త్వము నొందెఁ గావునన్
దాతవ యెట్టి వారలకు దాశరథీ కరుణాపయోనిధీ

Pages