S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

05/10/2017 - 21:18

జల నిధి లో దూటి, కులశైలముమీటి, ధరిత్రిఁగొమ్ము నం
దల వడమాటి, రక్కసుని యంగము గీటి, బలీంద్రునిన్ రసా
తమున మాటి, పార్థివ కదంబము గూల్చిన మేటి రామా, నా
తలఁపున నాటి రాఁ గదవె దాశరథీ కరుణాపయోనిధీ

05/09/2017 - 23:50

హలకులిశాంకుశధ్వజ శరాసన శంఖ రథాంగకల్పకో
జ్జ్వల జల జాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
కలిత పదాంబుజ ద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా
తలఁపున ఁ జేర్చి కావఁగదె దాశరథీ కరుణాపయోనిధీ!

05/07/2017 - 09:21

చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి మీనిమలమే చక రూప సుధారసంబు నా
మక్కువ పళ్లెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ

05/06/2017 - 08:35

అండజవాహ, నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్
కొండల వంటి వైన వెసఁగూలి నశింపక యునె్న సంతతా
ఖండల వైభవోన్నతులు గల్గక మానునె ? మోక్షలక్ష్మికై
దండ యొసంగకునె్న తుద, దాశరథీ కరుణాపయోనిధీ

05/05/2017 - 06:51

చక్కెర అప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోనికిన్
జొక్కపు జుంటితేనియకుఁ జొక్కిలు చుంగ నలేరు గాక నేఁ
డక్కట! రామ నామ మధురామృతమానుట కంటె సౌఖ్యమా
తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ!

05/04/2017 - 06:05

రామ హరే కకుత్థ్స కుల రామ హరే రఘురామ రామ శ్రీ
రామ హరే యటంచు మది రంజిల భేకగళంబు లీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామని వాసులౌదురఁట దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథరామా! హరే, కాకుత్థ్స రామా, రఘురామా, శ్రీరామా, హరే అనేవి నీపేర్లు ఈ నామములను మానవులు కప్పగొంతువలె మాటి మాటికి తలంచువారు ఇంక జన్మములు ఎత్తే అవస్థను దాటి పరమ పదమందు నివసిస్తారట

05/02/2017 - 21:14

* ‘రా’ కలుషంబులెల్ల బయబంబడ ఁద్రోచిన ‘మా’ కవాటమై
దీకొని బ్రోచు నిక్కమది ధీయుతులైనఁ దదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ

04/30/2017 - 20:40

* రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణ కల్పవల్లికా
రాముఁడు, షడ్వికారజయరాముఁడు సాధు జనావనవ్రతో
ద్దాముఁడు, రాముడే పరమదైవము మాకని మీయడుంగుఁగె
దామరలే భజించెదను, దాశరథీ కరుణాపయోనిధీ

04/28/2017 - 21:10

కొంజక తర్క వాదమను గుద్దలిచే ఁ బరతత్త్వ భూస్థలిన్
రంజిలఁ దవ్వి కన్గొన నిరామనిధానము , నేఁడు భక్తి సి
ద్దాంజనమందు హస్తగతమయ్యె ‘్భళీ’ యనఁగా మదీయ హృ
త్కంజమునన్ వసింపు మిఁక దాశరథీ కరుణాపయోనిధీ

04/27/2017 - 02:59

కంటి నదీతటంబు బొడగంటిని భద్రానగాధివా సమున్
గంటి నిలా తనూజ మరు కార్ముక మార్గణ శంఖ చక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి, కృతార్థుడనైతి, నో జగ
త్కంటక దైత్య నిర్దళన! దాశరథీ కరుణాపయోనిధీ!

Pages