S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేర్చుకుందాం
ఊరక వచ్చు బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగ గల్గువానికి ప్రయాసము నొందిన దేవదానవుల్
వారటులుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గె గాదె శృం
గారపు బ్రోవు లక్ష్మియును గౌస్త్భురత్నము రెండు భాస్కరా!
ఉరు కరుణాయుతుండు సమయోచితమాత్మ దలంచి యుగ్ర వా
క్పరుషత చూపినన్ ఫలము గల్గుట తథ్యము గాదె యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
ఈ జగమందు దా మనుజుడెంత మహాత్ముడె యైన దైన మా
తేజము తప్ప జూచునెడి అమ్మరి కోల్పడు నెట్ల నన్మహా
రాజకుమారుడైన రఘురాముడు కాల్నడ గాయ లాకులున్
భోజనమై తగన్వినికి బోయి చరింపడె మున్ను భాస్కరా!
ఈక్షితి నర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం
రక్షకుడైన సత్ప్రభుని రాకల గోరుదురెందు చంద్రికా
పేక్ష జెలంగి చంద్రుడుదయించు విధంబునకై చకోరపుం
బక్షులు చూడవే యెదుర సారముదంబును బూని భాస్కరా!
ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ యొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే
కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ బదారు వనె్నలుం
గారములోనైన వెలిగారము గూడక యున్న భాస్కరా!
ఆదరమింత లేక నరుడాత్మ బలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదు పేర్మికి గీడగు మూలమెట్ల మ
ర్యాద హిరణ్య పూర్వ కశిపున్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదునకెగ్గు చసి ప్రళయంబును బొందడె మున్నుభాస్కరా!
అవని విభుండు నేరుపరీయై చరియించిన గొల్చువార లె
ట్లన గుణులైన నేమి పనులన్నియు జేకుఱు వారి చేతనే
ప్రవిమల నీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధిదాటి సురారుల ద్రుంచి భాస్కరా!
అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొకడిష్టుడై తనున్
వలచి యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలుడొక్క కొణి దెండటుకుల్ దనకిచ్చినన్ మహా
ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము లాతని కీడె భాస్కరా!
అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించినంతలో
మన మెరియంగ నపుడవమానము కీడు ధరిత్రియందునే
యనువుననైన, దప్పవు యధార్థము తా నది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా!
అతిగుణ హీన లోభికి బదార్థము గల్గిన లేక యుండినన్
మితముగగాని కల్మిగలమీదటనైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద నేఱులు నిండి పారినన్
గతుకగ జూచు గుక్క తనకట్ట వీడ మీఱక యెందు భాస్కరా!