S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

02/18/2017 - 23:35

ఖలునిన్ సజ్జనుగాగ, మూర్ఖజను సంఖ్యావంతునింగాగ, దా
యల సన్మిత్రులగా, నగోచరము ప్రత్యక్షంబుగా, బ్రాణ హృ
త్కలనంబైన మహావిషం బమృతముంగా జేయు సత్కర్మము
జ్జ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్యా వాంఛితార్థాప్తికిన్

02/17/2017 - 21:04

లలితనికేతన ప్రియ విలాసవతీ ధవళాత పత్రస
ద్ద్విలసిత వైభవంబనుభవింపబడున్ సుకృతాను వృత్తిచే
జెలువగు పుణ్యకర్మము నశించిన నంగజ సంగరత్రుట
త్కలిత గుణోరు వౌక్తిక నికాయములట్లు దొలంగు సంపదల్

02/16/2017 - 21:27

నలువకులాలు భంగి నలిన ప్రభవాండమునందు దేనిచే
నిలిచె, దశావతార వన నిష్ఠితుడయ్యె మురురి దేనిచే
బెలుచ కపాల హస్తుడయి భిక్షకుడయ్యె బురాశి దేనిచే
నల రవి దేనిచే తిరుగు, నా ఘనకర్మము వంద్యమే కదా!

02/15/2017 - 20:47

శిథిలత లేని భక్తి నతి సేయుదు వేల్పుల కాసుపర్వులున్
విధివశ్వర్తు, లావిధియు విశ్రుత కర్మ ఫల ప్రదాత, య
య్యధిక ఫలంబు కర్మవశ, మట్లగుటం బనియేమి వారిచే
విధి కధికంబు కకర్మమని వేమఱు మ్రొక్కి భజించు కర్మమున్

02/14/2017 - 21:16

సలిలము జొచ్చినం, గనక శైలము జేరిన, వైరి వీరులం
గెలిచిన, రాజసేవ తిలకించిన, వేదములభ్యించినం
గళల లెఱంగెఱింగిన, ఖగత్వము దాల్చిన, గర్మ నిఘ్నతా
కలన నభావ్యమన పనిగాదు వినాశము లేదు భావికిన్

02/12/2017 - 21:12

రమ్యరూపంబు విద్యయు రాజసేవ
కులము శీలంబు జాలవు ఫలమొసంగ
బూర్వ పుణ్య సంచిత భాగ్యములు ఫలించు
గాలమున బనసాది వృక్షముల కరణి

భావము: పురుషునికి అందమైన రూపం కానీ, చదువు కానీ, రాజుసేవ కానీ, మంచి నడవడి కానీ ఫలితాన్ని ఇవ్వవు. అతడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంవల్ల సమకూర్చుకున్న భాగ్యమే పనసాది వృక్షాలవలె కాలం వచ్చినపుడు ఫలితాన్ని ఇస్తుంది. కనుక తప్పక పుణ్యకర్మలనాచరించాలి.

02/11/2017 - 21:25

చెలువౌ రత్నఘటంబునం దతడు సుశ్రీ ఖండంబులం
దిలపిణ్యాకము వండె, నారుగల కర్థిన్ సప్తపర్ణావృతుల్
నిలిపెన్, జిల్లెడు దూదికై పుడమి దునె్నన్ బైడి నాగేళ్ళ, ని
మ్ముల గర్మక్షితి బుట్టి యెవ్వడు దపంబుల్ సేయ డప్రాజ్ఞితన్

02/10/2017 - 21:25

ఎవ్వనికి నిజ్జగంబున నెంత ఫలము
దైవకృతమగునది వొందు దప్పకతని
గారణము గాదు పెనుబ్రాపు ఘనునిజేరు
చాతకము వాతబడు నల్పజలకణములు

02/09/2017 - 23:00

శతభిషగాఢ్యుడున్ సతత శంభువతంసమునయ్యు, నోషధీ
తతులకు నాథుడయ్యును, సుధారససేవధియయ్యు, దారకా
పతి తన రాజయక్ష్మ భవబాధల బాపగా నోపడక్కటా!
హతవిధి కృత్యమెవ్వనికికైన జగంబున దాటవచ్చునే

02/08/2017 - 23:19

ఫణులు గజములు బక్షులు బట్టువడుట
రవి సుధాకరులకు నైన రాహుబాధ
బుద్ధిమంతుల లేమియు బొసగజూచి
విధి బలాఢ్యుడటంచు భావింతు మద్దిని

Pages