S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/15/2018 - 05:41

మహబూబ్‌నగర్, నవంబర్ 14: వచ్చే రోజులు కాంగ్రెస్‌వి అని రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ కుటుంబం శని డిసెంబర్‌లో వదులుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ద్వజమెత్తారు. బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్‌షోను నిర్వహించారు.

11/15/2018 - 04:57

ధర్మపురి, నవంబర్ 14: దశాబ్దాలుగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న జాతీయ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆవిర్భవించిన తెరాసను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ముసుగులో ఒక్కటైనాయని, విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వాటి ఆటలను సాగనీయరని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

11/15/2018 - 04:58

* ప్రజలకు దూరమైన బీజేపీ, వైసీపీ, జనసేన * ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

11/15/2018 - 01:41

కర్నూలు, నవంబర్ 14: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏన్‌డీఏలో చీలికపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మిగతా పార్టీల నేతలతో రానున్న రోజుల్లో చర్చలు జరుపనున్నట్లు సమాచారం.

11/15/2018 - 05:02

విశాఖ(జగదాంబ), నవంబర్ 14: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టీకల్, థియరీ పరీక్షల షెడ్యుల్‌ను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలో విడుదల చేశారు. ఇంటర్‌బోర్డు ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావుమాట్లాడారు.

11/15/2018 - 05:03

పెదపూడి, నవంబర్ 14: ఓటు అనే ఆయుధంతో రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రజలు సహకరించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన వద్ద వేల కోట్లు లేవని, ఆడపడుచులు, అన్నదమ్ముల ప్రేమ, జనసైనికుల అండ ఉందన్నారు. ప్రజలు ఓటు వేయడానికి ఉపయోగించే వేలుతోనే వేల కోట్ల అవినీతిపరులను ఓడించాలన్నారు.

11/15/2018 - 06:51

పులివెందుల: కడప జిల్లా పులివెందుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం దాడులు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో కడప ఏసీబీ డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఉదయం నుంచి సోదాలు జరిపారు. సబ్ రిజిస్ట్రార్ బాలాజీని ఈ సందర్భంగా విచారించారు.

11/15/2018 - 01:24

* ధరను చెప్పలేం.. పార్లమెంటుకే వెల్లడించ లేదు: అటార్నీ జనరల్
* ఈ విమానాల ధరల గురించి మేమూ చర్చించం: సుప్రీం

11/15/2018 - 01:23

హైదరాబాద్, నవంబర్ 14: కాంగ్రెస్ సారధ్యంలోని కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ గందరగోళంగా మారడంతో ఈ వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తనకు సానుకూలంగా మలుచుకోవడానికి పావులు కదుపుతోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు వేర్వేరుగా తమ అభ్యర్థులను ప్రకటించుకోవడంతో అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. ఈ అసమ్మతి, విభేదాలతో తమ విజయవకాశాలను మరింత మెరుగుపరుస్తాయన్న ధీమా అధికార పార్టీలోకలిగింది.

11/15/2018 - 05:05

గజ్వేల్, నవంబర్ 14: గజ్వేల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గురువారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డికి అందజేశారు. మొదటి నామినేషన్ పత్రాలను కేసీఆర్ మధ్యాహ్నం 2.33 గంటలకు అందజేయగా, 2వ సెట్‌ను 2.35 గంటలకు రిటర్నింగ్ అధికారికి అందించారు.

Pages