S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/14/2018 - 17:35

విశాఖపట్నం: నీట్ విద్యార్థిని అమృత ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్ల గమ్మలక్ష్మీపురంనకుచెందిన అమృత ద్వారకానగర్‌లోని గ్రావిటీ ఐఐటీ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటుంది. నాలుగు రోజులు క్రితమే చేరింది. విద్యార్థులు ఎవ్వరితో మాట్లాడకుండా వౌనంగా ఉంటుంది. ఈ ఉదయం విద్యార్థినులంతా కోచింగ్‌కు వెళ్లగా అమృతి గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని చనిపోయింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

07/14/2018 - 17:34

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ను రామాంతపూర్‌లో గృహ నిర్బంధం చేశారు. స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా ఆయన ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. దీంతో పోలీసులు ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఆయనను గృహ నిర్బంధం చేశారు.

07/14/2018 - 17:33

విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే సీఏం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..రూ.13వేల కోట్లతో మట్టి తవ్వడం విడ్డూరంగా ఉందని, ఆ నిధులతో ప్రాజెక్టునే నిర్మించుకోవచ్చని అన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రానికి ఏమీ చేశారో చెప్పనున్నారని అన్నారు.

07/14/2018 - 12:46

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనాన్ని తొమ్మిది రోజుల పాటు నిలిపివేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల వరకు భక్తుల రాకను నిలిపివేయనున్నారు. తిరుమలలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాసంప్రోక్షణ జరపాలన్నా ఆగమ పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

07/14/2018 - 12:44

విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు శనివారం నాలుగు గేట్లు ఎత్తివేసి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో 14 వేల క్యూసెక్కులు. తూర్పు డెల్టాకు 8వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.

07/14/2018 - 12:39

తిరుమల: తిరుమల శ్రీవారికి ఓ ప్రవాస భారతీయుడు భూరీ విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు శనివారం ఉదయం స్వామిని దర్శించుకుని శ్రీవేంకటేశ్వర స్వామికి చెందిన వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఏపీ పరిశ్రమల శాఖకు చెందిన అమరనాథ్ రెడ్డి సమక్షంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో ఈ చెక్కును అందజేశారు.

07/14/2018 - 12:37

హైదరాబాద్: సీనియర్ నటుడు వినోద్ (59) కన్నుమూసారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. శనివారం తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మృతిచెందారు. దాదాపు 300 సినిమాల్లో నటించిన ఆయన విలన్, క్యారక్టర్ నటుడిగా మెప్పించారు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, మిర్చి తదితర సినిమాల్లో నటించారు.

07/14/2018 - 12:34

హైదరాబాద్: అలనాటి మధుర గాయని కె.రాణి (75) కన్నుమూశారు. దేవదాస్ చిత్రంలోని ‘‘అంతా భ్రాంతియేనా..జీవితాన వెలుగింతేనా అనే పాటతో తెలుగు చిత్రసీమలో ప్రసిద్ధిపొందిన రాణి దాదాపు 500 పాటల వరకు పాడారు. శ్రీలంక జాతీయ గీతం సైతం ఆమె పాడారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో ఆమె పాటలు పాడారు.

07/14/2018 - 03:20

అమరావతి, జూలై 13: రాష్టవ్య్రాప్తంగా వనం-మనం కార్యక్రమాన్ని ప్రభుత్వం మహోద్యమంగా చేపట్టనుంది. కృష్ణాజిల్లా నూజివీడులో ఈనెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున కోటి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

07/14/2018 - 01:35

రాజమహేంద్రవరం, జూలై 13: గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 29.70 అడుగుల మట్టంలో వరద ఉద్ధృతి నిలకడగా సాగుతోంది. దీనితో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహ ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతూ కొనసాగుతోంది. కాటన్ బ్యారేజి నాలుగు ఆర్మ్‌లలో వున్న మొత్తం 175 గేట్లను శుక్రవారం 0.70 మీటర్లకు ఎత్తి వేసి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు.

Pages