S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 02:07

కొత్తగూడెం, జనవరి 21: సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మాణం చివరి దశకు వచ్చిన సింగరేణి థర్మల్ పవర్‌ప్రాజెక్టులోని మొదటి, రెండవ యూనిట్‌లకు చెందిన పనులను శరవేగంతో పూర్తిచేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష మేరకు 1200 మెగావాట్ల సింగరేణి విద్యుత్‌ను ఏప్రిల్ మాసం వరకు తెలంగాణ రాష్ట్రానికి అందించాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ సింగరేణ

01/22/2016 - 02:06

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్శిటీలో ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని, రిజర్వేషన్లతో కాదని గుర్తు చేశారు.

01/22/2016 - 02:06

ఖమ్మం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాల కేటాయింపుల్లో రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక టిటిడిసి భవనంలో స్వయం ఉపాధి యూనిట్ల కేటాయింపు, దళితులకు భూ కొనుగోలు పథకం, తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

01/22/2016 - 02:05

హైదరాబాద్, జనవరి 21: గనుల తవ్వకం, కార్యకలాపాలను శాటిలైట్ ఇమేజరీ ద్వారా పర్యవేక్షించేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మధ్య గురువారం ఇక్కడ అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టుకు సుదూర్ దృష్టి అని నామకరణం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా డ్రైవ్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి సుభాశ్ చంద్ర తెలిపారు.

01/22/2016 - 02:05

విజయవాడ (క్రైం), జనవరి 21: ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులపై రెండో రోజు ఏసిబి దాడులు కొనసాగాయి. విజయవాడలోని రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను తెరచిన అధికారులు నివ్వెరపోయారు. గుట్టలు, గుట్టలుగా బంగారు, వెండి నగలతోపాటు ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సీజ్ చేసిన బంగారం, వెండి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉంటుందని అధికారుల ప్రాథమిక అంచనా.

01/22/2016 - 07:58

చిలమత్తూరు, జనవరి 21: అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి గురువారం ఉదయం సైబీరియన్ కొంగలు చేరుకున్నాయి. వాస్తవానికి ఇవి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో వెనుదిరుగుతాయి. అయితే గ్రామంలోని చెరువులో నీళ్లు లేకపోవడంత గత రెండేళ్లుగా రాలేదు. ఈసారి ఆలస్యంగానైనా కొంగలు వచ్చాయని సంబరపడుతున్నారు.

01/22/2016 - 01:59

ప్రేమకు మరణం లేదు. దానికి ఎల్లలు లేవు. కులమతాలు అసలే లేవు అంటూ అలలపై నాట్యమాడే అందమైన ప్రేమికుల అనుభూతులను చక్కనైనా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించిన సీతాకోక చిలక సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ప్రతి పాట ఓ ఆణిముత్యమే. ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందంటే ఆ పాటల స్థాయి ఎలాంటిదో అర్థం అవుతుంది. వేటూరి కలం నుండి జాలువారిన పాటలన్నీ అమృతపు సోనలే.

01/22/2016 - 01:56

1950వ దశకంలో తెలుగు సినిమా పాటల చరిత్రలో అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాలు ప్రేరణగా వచ్చిన ప్రగతి గీతాల రచన ప్రారంభమైంది. తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ నిషేధాజ్ఞలకు గురైన రైతుబిడ్డ విప్లవాత్మకమే అయినా అందులో ఉపయోగించిన పాటల్లో ఎక్కువగా బసవరాజు అప్పారావు రాసిన భావగీతాలే ఉన్నాయి. సామ్యవాద సిద్ధాంతాల ఛాయలుగల పాటలూ వచ్చాయి. అందులో ఒకటి కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దాన’.

01/22/2016 - 01:54

అష్టాచెమ్మా చిత్రంతో పరిచయమై అనేక సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దర్శకుడు కావాలన్న లక్ష్యంతో వచ్చినందుకు -‘ఊహలు గుసగుసలాడే’ రూపొందించి హిట్ అందుకున్నాడు. మీలో నటుడున్నాడా? దర్శకుడున్నాడా? అన్న ప్రశ్నకు మాత్రం -ఇద్దరూ ఉన్నారంటున్నాడు.
అవసరాలతో ఈవారం చిట్‌చాట్..

01/22/2016 - 01:50

తెలుగు, తమిళ భాషల్లో టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న కాజల్ రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తోందని వినిపిస్తున్న పుకార్. ఈ పుకారో నిజమో గానీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తనకున్న క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ ద్విభాషా చిత్రాలను రూపొందిస్తున్నారని, అందుకే రెండు భాషలకు కలిపి ఈ విధంగా తాను డిమాండ్ చేస్తుండడంలో తప్పేంలేదంటోంది కాజల్.

Pages