S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 02:10

హైదరాబాద్, జనవరి 21: సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం నగరంలోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

01/22/2016 - 02:09

హైదరాబాద్, జనవరి 21: టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఒక కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం గాంధీ భవన్ టిక్కెట్లు రాని ఆశావహుల ధర్నాలతో దద్ధరిల్లింది. సైదాబాద్ సమీపంలోని కుర్మగుడా డివిజన్‌కు చెందిన సీనియర్ కార్యకర్త కిషోర్ తన కుమార్తె టిక్కెట్ కోసం ప్రయత్నించారు. నామినేషన్ల గడువు ముగిసేలోగా బి-్ఫరం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు.

01/22/2016 - 02:09

హైదరాబాద్, జనవరి 21: సెంట్రల్ యూనివర్సిటీ ఎబివిపికి అడ్డాగా మారిందని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు విమర్శించారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఎబివిపిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన ఆరోపించారు. సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరానికి ఎబివిపి తప్ప అన్ని విద్యార్థి సంఘాలు వెళ్లి మద్దతు ప్రకటించాయని ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

01/22/2016 - 02:08

విశాఖపట్నం, జనవరి 21: తీర ప్రాంత భద్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సమీక్షించనున్నారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఏడవ తేదీ వరకూ విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐదవ తేదీ సాయంత్రానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మోదీ విశాఖకు చేరుకోనున్నారు.

01/22/2016 - 02:08

ఖానాపురం హవేలి, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ది ముమ్మాటికి రాజకీయ హత్యేనని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు పేర్కొన్నారు. గురువారం ఖమ్మంలో ఎస్‌ఎఫ్‌ఐ, కెవిపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ రోహిత్ ఉదంతం విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల పట్ల ఉన్న వివక్షతను తెలియ చేస్తుందన్నారు.

01/22/2016 - 02:08

భద్రాచలం, జనవరి 21: భద్రాచలం పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోరు రసకందాయంలో పడింది. గతంలో ఏకగ్రీవానికి మొగ్గు చూపిన సభ్యులు ఇప్పుడు ఎన్నికకు పట్టుబట్టడంతో నువ్వా- నేనా అన్నట్లు పోరు సాగనుంది. అధ్యక్ష పోరులో ఆశావాహులు పోటీ పడుతుండటంతో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యే నాటికి సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య 1100 వరకు చేరుకుంది. గతంలో ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగేది.

01/22/2016 - 02:08

న్యూఢిల్లీ, జనవరి 21: తెలంగాణకు సంబంధించిన పలు పథకాలను రానున్న రైల్వే బడ్జెట్‌లో చేర్చాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఆనంద్ భాస్కర్ గురువారం సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. స్టేషన్ ఘనపుర్-సూర్యాపేట్ రైల్వే లైను నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలన్నారు.

01/22/2016 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 21: విజయవాడ-విశాఖపట్నం నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర పౌన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరారు. అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం రైల్ భవన్‌లో సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

01/22/2016 - 02:07

ఖమ్మం(కల్చరల్), జనవరి 21: హస్త కళలు దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక టిటిడిసి భవన్‌లో కళాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్త, చేనేత కళా ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిధిగా జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల్లో మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు.

01/22/2016 - 02:07

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌యుసి)లో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎబివిపి హెచ్‌సియు విభాగం డిమాండ్ చేసింది. అతని ఆత్మహత్యపై చాలా అనుమానాలున్నాయన్నారు. యూనివర్శిటీలోని టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్ల కాల్‌డేటాపైనా సిబిఐతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.

Pages