S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 02:18

పెడన, జనవరి 21: త్వరలో రానున్న కృష్ణా పుష్కరాలను నభూతో న భవిష్యతి అన్న రీతిలో అట్టహాసంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. స్థానిక నియోజకవర్గ నేత డా. వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనతావాణిని మంత్రి గురువారం ప్రారంభించారు.

01/22/2016 - 02:18

గుంటూరు, జనవరి 21: సొంత ఆసుపత్రులకు ప్రాధాన్యమిస్తూ విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న 600 మంది ప్రభుత్వ వైద్యులకు మెమోలు జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం గుంటూరులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో జరిగిన మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కామినేని వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.

01/22/2016 - 02:18

మచిలీపట్నం, జనవరి 21: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసింది. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పుల ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. తాజా గణాంకాల ప్రకారం ఓటర్ల జాబితాలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. జిల్లాలో మొత్తం 28లక్షల 76వేల 921 మంది ఓటర్లు నమోదయ్యారు.

01/22/2016 - 02:17

విజయవాడ, జనవరి 21: దేశవ్యాప్తంగా బాల కార్మిక విద్యా పథకం (ఎన్‌సిఎల్‌పి) అమలును సమర్థవంతంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి దిరాజ్ కుమార్ ఆదేశించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎన్‌సిఎల్‌పి అధికారి డి.ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు.

01/22/2016 - 02:16

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సదరన్ డిస్కమ్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా 7 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేయనున్నట్లు డిస్కమ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

01/22/2016 - 02:16

విజయవాడ, జనవరి 21: రాష్టస్థ్రాయి 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంథం చంద్రుడు అధికారులను ఆదేశించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను సబ్ కలెక్టర్ సృజనతో కలిసి ఆయన బుధవారం పర్యవేక్షించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రగతిని తెలిపే విధంగా ఏర్పాటుకానున్న శకటాలను రూపొందించడంలో ప్రభుత్వం ఆమోదించిన డిజైన్లు మాత్రమే అనుమతించాలన్నారు.

01/22/2016 - 02:15

పాయకాపురం, జనవరి 21: సిఆర్‌డిఏ విడుల చేసిన క్యాపిటల్ రీజియన్, కాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌పై అనేక అభ్యంతరాలు ఉన్నాయని అఖిలపక్ష నాయకులు అన్నారు. సిఆర్‌డిఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు కోరుతూ గురువారం ఉదయం అఖిలపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఏ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.

01/22/2016 - 02:15

విజయవాడ, జనవరి 21: రోడ్డు భద్రతపై వాహన చోదకులు, ప్రజల్లో అవగాహన కల్పించి ప్రమాదాలను నివారించేందుకు 27వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఈనెల 22 నుండి వారం రోజులపాటు నిర్వహించనున్నట్టు డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వి.సుందర్ తెలిపారు. 27వ జాతీయ భద్రతా వారోత్సవాల కార్యక్రమంపై డిటిసి వి.సుందర్ నగరంలోని ఆయన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఉదయం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.

01/22/2016 - 02:14

పాతబస్తీ, జనవరి 21: వన్‌టౌన్ పోలీసు స్టేషన్ సిసిఎస్ విభాగం పై నుండి కిందకి దూకిన కేసులో క్షతగాత్రుడు చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా వినోద్ కదంబి దూకిన సంఘటనపై కానిస్టేబుల్ గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కస్టడి నుండి వినోద్ పరారైనట్లుగా నమోదు చేశారు. వినోద్ కదంబి మంగళవారం ఉదయం పోలీసు స్టేషన్ భవనం పై నుండి దూకిన విషయం విదితమే.

01/22/2016 - 02:13

విజయవాడ, జనవరి 21: సాగునీటి సంఘాల, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ప్రతినిధులకు అప్పగించిన విధులు, బాధ్యతలను సేవా దృక్పథంతో నిర్వర్తించి ఆయకట్టు చివరి భూమి వరకు నీరందించి పంటలను కాడేందుకు కృషిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Pages