S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 02:23

తిరుమల, జనవరి 21 : కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని 2015వ సంవత్సరంలో 2.45 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా, వారు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 897.55 వందల కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. 2014తో పోలిస్తే గత ఏడాది 20 లక్షల మంది భక్తులు అదనంగా స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 63.29 కోట్ల రూపాయలు అదనంగా లభించింది.

01/22/2016 - 02:22

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో డిఎడ్ విద్యార్థులు భవితవ్యం అయోమయంగా మారింది. డిఎడ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించి నెలలు గడుస్తున్నా నేటి వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తయితేనే రెండో సంవత్సరం తరగతులకు అనుమతిస్తారు. దీంతో 2014లో చేరిన విద్యార్థులు ఇప్పటికీ మొదటి సంవత్సరం తరగతులకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

01/22/2016 - 02:22

గుంటూరు, జనవరి 21: రాజధాని అమరావతి ప్రకటించిన నాటి నుంచి అన్ని విధాలా రాష్ట్రప్రభుత్వానికి సహకరిస్తున్న తుళ్లూరు ప్రజలు తొలిసారిగా మాస్టర్‌ప్లాన్ సదస్సును బహిష్కరించి సంచలనం సృష్టించారు. గురువారం సదస్సును నిర్వహించేందుకు సిఆర్‌డిఎ అధికారులు చేసిన యత్నాన్ని అడ్డుకున్న గ్రామస్థులు రెండు గంటల సేపు రహదారిపై బైఠాయించారు.

01/22/2016 - 02:21

కొత్తపేట, జనవరి 21: ఒక అభిమాని మొక్కును తీర్చేందుకు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గురువారం పటికబెల్లంతో తులాభారం తూగారు. నియోజకవర్గంలోని రావులపాలెంకు చెందిన పచ్చిపులుసు సుబ్బారావు అనే వ్యాపారి 2014 ఎన్నికల్లో జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే శ్రీ షిరిడీ సాయినాథునికి పటికబెల్లంతో తులాభారం వేసి సమర్పిస్తానని మొక్కుకున్నారు.

01/22/2016 - 02:21

అనపర్తి, జనవరి 21: సికింద్రాబాద్ నుండి విశాఖపట్టణం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తడంతో గురువారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో సుమారు 20 నిముషాల పాటు నిలిచిపోయింది. డి-1 బోగి కింద బ్రేకుల వద్ద పొగ రావడంతో రైలును అనపర్తి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. సిబ్బంది చిన్నపాటి మరమ్మతులు చేపట్టిన అనంతరం తిరిగి బయల్దేరింది.

01/22/2016 - 02:20

తిరుపతి, జనవరి 21 : పురాణాలను సరళమైన భాషలో అనువదించి, త్వరితగతిన ముద్రించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి డా. డి సాంబశివరావు ఉద్ఘాటించారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న ప్రముఖ పండితులతో ‘పండిత పరిషత్’ సమావేశం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో గురువారం నిర్వహించారు.

01/22/2016 - 02:20

బుక్కరాయసముద్రం, జనవరి 21: అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుమారు 146 మంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోనున్నారు. ఖైదీల విడుదలపై ఇటీవల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా జైళ్ల అధికారులు జీవిత ఖైదీల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు.

01/22/2016 - 02:19

పామర్రు, జనవరి 21: బ్యాంకులను జాతీయం చేసిన తర్వాతే పేదలు, రైతుల అభ్యున్నతికి నాంది పలికాయని, ఈరోజు జాతీయ బ్యాంకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు, ప్రజలకు అందిస్తున్న సేవల వల్లనే సంక్షేమం దిశగా దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్ర ప్రభుత్వ ‘ఆధార్’ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంవిఎస్ రామిరెడ్డి అన్నారు.

01/22/2016 - 02:19

ఆదోని, జనవరి 21:కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి జెడ్‌పి పాఠశాలలో గురువారం 6వ తరగతి విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగం వికటించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయుల సూచన మేరకు 6వ తరగతి విద్యార్థులు శాంతమూర్తి, సురేష్, శ్రీరాములు బ్యాటరీ సెల్‌లలోప్రయోగం చేసిన అనంతరం జేబులో పెట్టుకున్నారు.

01/22/2016 - 02:19

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జాతీయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్‌ఆర్‌డి) కార్యదర్శి మంజిత్‌కుమార్ చెప్పారు. గురువారం విశాఖలో జరిగిన సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ఆర్థిక కంట్రోలర్ల జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఏడాది రూ.900 కోట్లు మంజూరు చేశామన్నారు.

Pages