S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 01:48

రాజ్యం పిక్చర్స్ సంస్థ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘నర్తనశాల’ (1963) గుర్తుండే ఉంటుంది. అఖండ విజయం సాధించిన ఆ చిత్రంలో పాత్రలన్నీ ఒక ఎత్తు, ఎన్టీఆర్ ధరించిన బృహన్నల పాత్ర మరో ఎత్తు. పాత్ర పోషణలో ఎన్టీఆర్ తీసుకొన్న శ్రద్ధ, ఏకాగ్రత గురించి ఆ రోజుల్లో పరిశ్రమ వర్గాలు ప్రత్యేకంగా చెప్పుకునేవి.

01/22/2016 - 01:46

న్యూఢిల్లీ/అమృత్‌సర్, జనవరి 21: పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కేసుకు సంబంధించి పంజాబ్ పోలీస్ ఎస్‌పి సల్వీందర్ సింగ్ నివాసాల్లో ఎన్‌ఐఏ గురువారం సోదాలు జరిపింది. ఐదుచోట్ల జరిపిన ఈ సోదాల్లో సల్వీందర్‌సింగ్, ఆయన స్నేహితులు, వంటమనిషి నివాసాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది.

01/22/2016 - 01:45

వాషింగ్టన్, జనవరి 21: భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోందనే విషయం మరోసారి ధ్రువపడింది. లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి), అఫ్గాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థలు ఐఎస్‌ఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయని ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉన్నత స్థాయి కమాండర్ తాజాగా బయటపెట్టాడు.

01/22/2016 - 01:45

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా రామాపురానికి -సినీ కళా చరిత్రలో ప్రత్యేక పేజీని కల్పించిన నటుడు అక్కినేని. పున్నమ్మ కడుపున పుట్టి పుణ్యమూర్తిగా ఎదిగిన వ్యక్తి. చదువుకునే స్థోమతులేని ఇంట పుట్టాడు. కానీ -తననే పదిమందీ చదువుకునే స్థాయికి ఎదిగాడు. నాటక రంగానికి ఆకర్షితుడై -బాల్యంలోనే స్ర్తిపాత్రలతో అలరించిన అక్కినేనికి -1941లో ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్ర దొరికింది.

01/22/2016 - 01:51

చార్‌సద్దా, జనవరి 21: పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో బుధవారం మిలిటెంట్లు 21 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన తర్వాత గురువారం దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించారు. నలుగురు సాయుధ మిలిటెంట్లు ఖైబర్-్ఫక్తూన్‌క్వా రాష్ట్రంలోని చార్‌సద్దాలో ఉన్న బచాఖాన్ యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఒక ప్రొఫెసర్ సహా 20 మంది మృతి చెందడం తెలిసిందే.

01/22/2016 - 01:44

న్యూఢిల్లీ, జనవరి 21: అత్యహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్మృతీ ఇరానీ మూడు అబద్దాలు చెప్పారని అన్నారు.

01/22/2016 - 01:52

వాషింగ్టన్, జనవరి 21: ఒకవేళ భారత్ గనుక తమపై దాడి చేస్తే దాన్ని నిరోధించడానికి వీలుగా పాకిస్తాన్ 110 నుంచి 130 దాకా అణ్వస్త్రాలను మోహరించి ఉందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఒక నివేదిక పేర్కొంది.

01/22/2016 - 01:43

కోల్‌కతా, జనవరి 21: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఇటీవల జరిగిన హింసాకాండపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, రాష్ట్రంలో ‘మా- మాటి-మనుష్’ (తల్లి, మట్టి, ప్రజలు)కు భద్రతే లేదన్నారు. ఈ మఃడింటికి రక్షణ కల్పిస్తామన్న నినాదంతోనే తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

01/22/2016 - 01:42

బీజింగ్, జనవరి 21: వాయువ్య చైనా ప్రాంతంలో తీవ్ర భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.4గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు చాలా ప్రాంతాల్లో డజన్లకొద్దీ భవనాలు బీటలు వారాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగినట్లు సమాచారం అందలేదు. చైనా ప్రభుత్వ అధికార వార్తాసంస్థ జిన్‌హువా కథనం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.13కు భూమి కంపించింది.

01/22/2016 - 01:42

న్యూఢిల్లీ, జనవరి 21: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ ఉత్పత్తి వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో మొదలవుతుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు.

Pages