S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/19/2019 - 23:12

లక్నో/న్యూఢిల్లీ, జూలై 19: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో భూ వివాదంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. భూ వివాదంలో పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కనీసం 27 మంది గాయపడ్డారు.

07/19/2019 - 23:02

మహబూబ్‌నగర్ టౌన్, జూలై 19: ఈనెల 13న కిడ్నాప్‌నకు గురైన చిన్నారి కేసు మిస్టరీని ఛేదించినట్టు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని వల్లబ్‌నగర్ ఎర్రగుంట ప్రాంతంలో పొట్టొళ్ల చిట్టి, యాదయ్య దంపతులకు చెందిన పసిపాపను గాఢనిద్రలో ఉండగా కొందరు కిడ్నాప్ చేశారు.

07/19/2019 - 23:02

నకిరేకల్, జూలై 19: ఇద్దరు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన చేశారు. నకిరేకల్‌లోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కమర్ కుమారుడు కుమేజ్‌ను తరగతి గణిత ఉపాధ్యాయుడు అప్పారావు రూలకర్రతో కొట్టడంతో తలపై స్వల్పగాయాలయ్యాయి.

07/19/2019 - 22:33

ఒంగోలు, టంగుటూరు, జూలై 19: ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం టంగుటూరు మండలం పొందూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మక్కపాలెంలో శుక్రవారం తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తల మధ్య కొడవళ్లు, రాళ్లతో దాడులు జరిగాయి. ఈ దాడిలో టీడీపీకి చెందిన ఉప్పుటూరి సుబ్బారాయుడుకు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

07/19/2019 - 22:29

గోపాలపురం, జూలై 19: కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్త, అత్తను కత్తితో నరికి హత్యచేసిన కిరాతకుడి ఉదంతమిది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని రాంపాలెం గ్రామానికి చెందిన కుమ్మరి కాంతారావు దొండపూడి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మిని పదేళ్ల కిత్రం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు.

07/19/2019 - 22:24

గుంటూరు (లీగల్), జూలై 19: అమరావతిలో హైకోర్టు ఏర్పాటైన అనంతరం రాష్ట్ర హైకోర్టు తొలి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనకంటి శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం నుండి 1992లో న్యాయ విద్యను పూర్తి చేశారు.

07/19/2019 - 22:23

తిరుపతి, జూలై 19: తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో హరిణి వద్ద శుక్రవారం మరోమారు చిరుత పులి సంచరించింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళుతున్న వ్యక్తి చిరుతపులి రోడ్డు దాటడాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. దీంతో వాహనాన్ని వేగంగా నడిపాడు. భీతిల్లిన చిరుత వాహన చోదకులపై దాడి చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.

07/19/2019 - 21:38

న్యూఢిల్లీ, జూలై 19: అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చి వేసిన ఘటనపై విచారణను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. ఈ ఘటనలో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిల ప్రమేయంపైనా తీర్పును వెలువరించాలని పేర్కొంది.

07/19/2019 - 21:34

న్యూఢిల్లీ, జూలై 19: జాతీయ పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సీ)లో పలువురి పేర్లు తప్పుగా నమోదు కావడం, మరికొందరి పేర్లు లేకపోవడం వల్ల తుది జాబితా తయారీకి వీలుగా ప్రస్తుతం ఉన్న జూలై 31 గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరాయి. ఇదే సందర్భంలో ‘్భరత్‌ను ప్రపంచంలోని నిరాశ్రయుల రాజధాని’గా మార్చలేమని కేంద్రం వ్యాఖ్యానించింది.

07/19/2019 - 04:28

గిద్దలూరు, జూలై 18: ‘ మేము ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీఖాతాలో నగదు జమచేస్తాం.. ఎటిఎం కార్డు, సివివి నెంబర్లు చెప్పండి, ఆపై మీ ఫోన్‌కు ఓటిపి వస్తుంది దీనిని చెబితే మీ ఖాతాలో నగదు జమ అవుతుందని ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేశాడు. వివరాలన్నీ చెప్పాక ఆన్‌లైన్‌లో లక్షా 88వేల రూపాయల మేర కాజేసిన ఉదంతం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది.

Pages