S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/21/2019 - 01:55

జీడిమెట్ల, జూలై 20: గాజులరామారం డివిజన్ బాలయ్యనగర్ బస్తీలో ప్లాట్ విషయంలో వివాదం చోటుచేసుకుంది. బస్తీలో నర్సింహ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ తనదని టీఆర్‌ఎస్‌కు చెందిన ఫెరోజ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లాడు. బాధితులకు, ఫెరోజ్‌కు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురు దూషించుకోగా మహిళల పై కొట్టేందుకు ఫెరోజ్ ప్రయత్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

07/21/2019 - 01:55

సనత్‌నగర్, జూలై 20: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రయాణిస్తున్న వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రూ.1335 జరిమానా విధించారు. శనివారం ఓ బుల్లెట్ వాహనంపై వర్మ మరో ఇద్దరితో కలిసి ప్రయాణం చేశారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వర్మ వాహనానికి చలానా విధించారు.

07/21/2019 - 01:46

మహేశ్వరం, జూలై 20: తుక్కుగూడ మున్సిపాలిటిలో ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. మున్సిపాలిటీలో ఉన్న 15 వార్డుల విభజన సక్రమంగా లేదని వార్డుల విభజన పూర్తిగా ఆశాస్ర్తియంగా జరిగిందని మున్సిపాలిటీకి చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో పూర్తి విచారణ చేసే వరకు ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోర్టు శనివారం స్టే విధించింది.

07/21/2019 - 04:56

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ఎన్నికల కమిషన్‌కు న్యాయపరమైన సమస్యలు ఎదురౌతున్నాయి. ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని, వార్డుల పునర్విభజన కార్యక్రమం సజావుగా జరగలేదని మండిపడింది.

07/20/2019 - 00:38

ఉప్పల్, జూలై 19: రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం చెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పరిధిలోని రుస్తపురం గ్రామానికి చెందిన సవిరెడ్డి శివారెడ్డి(60) వ్యవసాయ రైతు. అతడు బోడుప్పల్ ఆకృతి టౌన్‌షిప్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు వచ్చాడు.

07/20/2019 - 00:15

న్యూఢిల్లీ, జూలై 19: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండ పోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులు దాఖలు చేసిన పటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొండ పోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం చెల్లింపుల్లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తు పలువురు నిర్వాసితులు సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

07/20/2019 - 00:14

న్యూఢిల్లీ, జూలై 19: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు తాత్కాలిక ఊరట లభించింది. గవర్నర్ కోటాలో నియమితులైన తనపై అనర్హత వేటు వేసే అవకాశం లేదంటూ రాములు నాయక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు ముందు రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా టీఆర్‌ఎస్ అప్పట్లో కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న కె.

07/19/2019 - 23:54

పాడేరు, జూలై 19: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా సిబ్బందిపై పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ క్రమ శిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విశాఖ ఏజెన్సీలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 17 మంది వైద్య సిబ్బందికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసారు.

07/19/2019 - 23:49

రేణిగుంట, జూలై 19: విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వెళుతున్న ప్రైవేట్ వోల్వో బస్సు శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్టు కూడలి వద్ద బోల్తా పడింది. ఈ సంఘటనలో బస్సులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేట్ వోల్వో బస్సు ఉదయం ఆరుగంటల ప్రాంతంలో రేణిగుంట ఆర్టీఓ చెక్‌పోస్టు మీదుగా వెళుతోంది.

07/19/2019 - 23:18

న్యూఢిల్లీ, జూలై 19: ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల అటవీ అధికారులపై దాఖలు చేసిన అట్రాసిటీ కేసుల ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు ‘స్టే’ విధించింది. ఈ కేసులపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అమికస్ క్యూరీ ఏడీఎస్ రావు సుమోటోగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

Pages