S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/26/2018 - 21:58

కృష్ణాదేవిపేట, అక్టోబర్ 26: కుటుంబ సభ్యులతో ఘర్షణపడిన లింగంపేట గ్రామానికి చెందిన వివాహిత అంబటి పంతులమ్మ అలియాస్ చిన్నబుచ్చి(24)) శుక్రవారం మధ్యాహ్నాం పురుగుల మందు తాగి ఆత్మకు పాల్పడింది. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. లింగంపేట గ్రామానికి చెందిన అంబటి చిన్నతల్లి గత కొన్నాళ్ళుగా తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈమె నర్సీపట్నంలో తన అన్నయ్య వర ప్రసాద్ ఫండ్లు దుకాణంలో పని చేస్తుంది.

10/26/2018 - 21:56

ముంచంగిపుట్టు, అక్టోబర్ 26: మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న ఇద్దరు గిరిజన యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. ముంచంగిపుట్టులో వాహనాలు తనిఖీ చేస్తుండగా బూసుపుట్టు పంచాయతీ సంతవీధి గ్రామానికి చెందిన పాంగి నాగేష్, తుడుంరాయి గ్రామానికి చెందిన కిల్లు లచ్చన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10/26/2018 - 21:55

పెదబయలు, అక్టోబర్ 26: సీనియర్ అసిస్టెంట్ చేస్తున్న లైంగిక వేధింపులకు తాళలేక పంచాయతీ మహిళా కార్యదర్శి పోలీసుల సమక్షంలోనే ఆత్మహత్య యత్నానికి పూనుకుంది. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమెను వెనువెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించడంతో ప్రాణాపాయ పరిస్థితి నుంచి బైటపడి కోలుకుంటున్నారు.

10/26/2018 - 21:46

గుంటూరు (అరండల్‌పేట), అక్టోబర్ 26: నగరంలో గతకొంత కాలంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు వ్యక్తులను అర్బన్ సీసీయస్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 3లక్షల 50వేల నగదు, 6 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీసీయస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిసియస్ అడిషనల్ ఎస్పీ శ్రీరాఘవ నిందితుల వివరాలను వెల్లడించారు.

10/26/2018 - 21:43

గుంటూరు, అక్టోబర్ 26: జిల్లాలో అక్రమంగా నకిలీ సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్న కంపెనీలపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శుక్రవారం ఇందులో భాగంగా ఆటోనగర్‌లోని మల్లిఖార్జున ఆయిల్స్ సంస్థపై దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన తయారీకి ఉపయోగించే 1500 బస్తాల వేప విత్తనాల నుండి నూనె తీసిన చక్కలను స్వాధీనం చేసుకున్నారు.

10/26/2018 - 05:50

హైదరాబాద్, అక్టోబర్ 25: ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా గురువారం వేర్వేరు జిల్లాల్లో లక్షలాది రూపాయల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహిస్తుండడంతో పెద్దమొత్తంలో నగదు లభ్యవౌతోంది. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో దాదాపు 21.50 లక్షల రూపాయల నగదు పట్టుకొన్నారు.

10/26/2018 - 04:16

చెన్నై, అక్టోబర్ 25: తమిళనాడు అసెంబ్లీలో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం సబబేనని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న దినకరన్ వర్గం డీలాపడగా, ముఖ్యమంత్రి పళనిస్వామి మద్దతుదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

10/26/2018 - 04:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: సీబీఐ డైరెక్టర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినందున సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం పిల్ దాఖలైంది. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది.

10/26/2018 - 04:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ముజఫర్‌పుర్ అనాథాశ్రమంలో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు హేయమని, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధమైన సంఘటనలని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ ముజఫర్‌పుర్ ఘటనలపై కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. ఈ నివేదికలో అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని కోర్టు పేర్కొంది.

10/26/2018 - 01:34

కులకచర్ల, అక్టోబర్ 25; అనుమతి లేకుండా ఇసుకను తరసలిస్తున్న రెండు లారీలను కులకచర్ల పోలీసులు పట్టుకున్నారు. పాలమూరు జిల్లా కోయిల్‌సాగర్ నుంచి షాద్‌నగర్‌కు తరలిస్తున్న రెండు లారీలను గురువారం పట్టుకుని కేసు నమోదు చేశారు. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరిమీద కేసులు నమోదు చేసింది వెల్లడించలేదు.

Pages