S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/24/2018 - 01:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: రాజస్తాన్‌లో ఆరావళి పర్వతాల్లో 31 కొండలు అదృశ్యం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తక్షణమే 48 గంటల్లోగా కొండల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో 115.34 హెక్టార్ల పరిధిలో అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కోర్టు పేర్కొంది.

10/24/2018 - 01:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ కేంద్ర కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ కుమార్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడురోజుల పోలీసుకస్టడీకి ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కూడా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే.

10/24/2018 - 01:31

రామన్నపేట, అక్టోబర్ 23: మండలంలోని శోభనాద్రిపురం గ్రామానికి చెందిన లోడె సురేష్ (28) స్వైన్‌ప్లూతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. నెల రోజులక్రితం తన స్నేహితునితో కలిసి గాంధీ ఆసుపత్రికి వెళ్లిన సురేష్ తదనంతరం జలుబు, దగ్గుసోకి అనారోగ్యానికి గురయ్యాడు. రోజురోజుకు అనారోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు.

10/24/2018 - 01:16

తూప్రాన్, అక్టోబర్ 23: భార్య కాపురానికి రావడంలేదని కోపంతో కన్న కూతురిని హత్య చేసిన సంఘటనలో తండ్రిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ సీఐ లింగేశ్వర్‌రావు పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరించారు. చిత్తూరు జిల్లా ముల్కాల చెరువు మండలం బోరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డికి 15 సంవత్సరాల క్రితం పున్యవతితో వివాహం జరిగింది.

10/24/2018 - 01:11

హైదరాబాద్: యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల్లో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమ రవాణాలపై ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అక్కడ బాలికలపై జరిగిన అత్యాచారాలపై మెడికల్ బృందాలు పరీక్షలు జరపాలని

10/24/2018 - 00:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దీపావళి సందర్భంగా బాణాసంచాపై ఆంక్షలను విధిస్తూ హరిత దీపావళి సాధన, కాలుష్య నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణాసంచాను కాల్చాలని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ ఏకె సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

10/24/2018 - 00:05

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గత ఆగస్టు 2వ తేదీతో గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని గ్రామ మాజీ సర్పంచ్‌లు హైకోర్టును ఆశ్రయించారు.

10/23/2018 - 23:32

సుండుపల్లె, అక్టోబర్ 23: రెండు వేర్వేరు ప్రదేశాలలో జరిగిన దాడుల్లో 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనపరచుకొని పది మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసినట్లు ఫారెస్టు శాఖాధికారులు తెలిపారు.

10/23/2018 - 22:32

గుత్తి, అక్టోబర్ 23 : మండల కేంద్రంలోని ఓ కట్టెల డిపో సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లచ్చానుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గాదిలింగప్ప (30) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు లింగప్ప ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు.

10/23/2018 - 05:20

కరీంనగర్, అక్టోబర్ 22: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నియమావళిని ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీల్లో కరీంనగర్ బస్టాండ్‌లో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీ చేస్తుండగా రూ.18,24,700 పట్టుబడ్డాయి.

Pages