S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/25/2018 - 22:38

డుంబ్రిగుడ, అక్టోబర్ 25: మండలంలోని కొర్రాయి పంచాయతీ కొట్టిగుడ గ్రామంలో తండ్రి కొడుకులు బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల కారణంగా హత్య చేసిన వీరి మృతదేహాలను నిందితులు దహనం చేసి పరారయ్యారు.

10/25/2018 - 20:55

చేగుంట, అక్టోబర్ 25: వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ వివాహితను బంగారు నగలు దోచుకోని హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌లో చోటు చేసుకుంది. రుక్మాపూర్ గ్రామానికి చెందిన మ్యాకల రఘుపతి భార్య సరిత(20)ని గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ పొలం సమీపంలో అటవిలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఆపై ఆత్యాచార యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

10/25/2018 - 20:53

మెదక్ రూరల్, అక్టోబర్ 25: ప్రమాదవశాత్తు మిషన్ కాకతీయ పనుల్లో తవ్విన గుంతలో మునిగి వ్యక్తి మృతిచెందిన సంఘటన హవేళీఘణాపూర్ మండలం బూర్గుపల్లి శ్రీపతి చెర్వులో గురువారం చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పోతగల్ల పెద్దసాయిలు(44) కాలకృత్యాలకువెళ్లి చెర్వులో తవ్విన గుంతల్లో మునిగి మృతిచెందాడు. మృతునికి తల్లిదండ్రులు పెద్దబాలయ్య, కాశమ్మలున్నారు.

10/25/2018 - 04:44

హైదరాబాద్, అక్టోబర్ 24: తక్కువ డబ్బులకు ఎక్కువ వడ్డీ అంటూ గొలుసుకట్టు పథకంతో వేల కోట్ల రూపాయలు వసూళ్ళు చేసి, తిరిగి డి పాజిట్ దారులకు సొమ్ము చెల్లించకుండా సొంత ఆస్తులు పెంచుకున్నారన్న అభియోగాలపై అరెస్టు అయిన హీరా గోల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

10/25/2018 - 04:22

వరంగల్,అక్టోబర్ 24: మావోయిస్టుల ఆదేశాల మేరకు విధ్వంసం సృష్టించడానికి మావోలకు పేలుడు పదార్దాలు తీసుకువెళ్తున్న ఇద్దరు మావోయిస్టులను పోలీసులు పక్కా సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామ సమీపంలో చాకచక్యంగా పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి ఓఎస్‌డి కె.

10/25/2018 - 04:12

చౌటుప్పల్, అక్టోబర్ 24: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పోలీస్ స్టేషన్‌కు కూతపెట్టు దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా లక్షల రూపాయల విలువ చేసే ప్రమాదకరమైన టపాసులను నిల్వ చేసి వ్యాపారం సాగిస్తున్న దుకాణంపై బుధవారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. దుకాణంలో ఉన్న నిల్వలను తనిఖీ చేసి సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే టపాసులు ఉన్నట్లు గుర్తించారు.

10/25/2018 - 01:48

కూనవరం, అక్టోబర్ 24: కుటుంబ కలహాల నేపథ్యంలో నమోదైన కేసు విచారణ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఒక వ్యక్తి ఆకస్మికంగా కుప్పకూలి మృతిచెందిన ఘటన కూనవరం మండలం పొట్లవారిగూడెంలో బుధవారం కలకలం రేపింది. కేసు పెట్టిన బంధువులు, విచారణ పేరుతో పోలీసుల తీరు కారణంగానే తన తండ్రి మానసిక వ్యథతో మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి కుమారుడు బంధువులు, గ్రామస్థులతో కలిసి మృతదేహంతో రాస్తారోకోకు దిగారు.

10/25/2018 - 01:44

చెన్నై, అక్టోబర్ 24: సవరించిన అమ్మకపుపన్నును నిర్ధారించుకునేందుకు అప్పిలేట్ అథారిటీకి అప్పీలు చేసుకోవాల్సిందిగా చెన్నై హైకోర్టు కార్ల కంపెనీ నిస్సాన్‌ను ఆదేశించింది.

10/25/2018 - 01:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కేంద్రం ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా చట్టవిరుద్ధంగా రాత్రికిరాత్రి తన అధికారాలకు కత్తెర వేసి, సెలలవుపై వెళ్లాలని ఆదేశించడం సహేతుకం కాదని సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వయంప్రతిపత్తి ఉన్న సీబీఐ సంస్థ అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుందని, ఇది అవాంచనీయ పరిణామమని ఆయన కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

10/25/2018 - 01:17

ముంబయి, అక్టోబర్ 24: కోరేగాంవ్ భీమా అల్లర్ల కేసులో పుణే కోర్టు జారీ చేసిన ఆదేశాలను బొంబాయి హైకోర్టు బుధవారం కొట్టివేసింది. కోరేగాంవ్ భీమా గ్రామంలో చోటు చేసుకున్న హింసకు సంబంధించిన కేసులో అరెస్టయిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఇతర సామాజిక కార్యకర్తలకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేయడానికి పోలీసులకు అదనపు సమయం ఇస్తూ పుణే కోర్టు జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది.

Pages