S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/26/2018 - 00:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఎయిర్‌సెల్ మాక్సిస్ మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు. పి చిదంబరం, ఎస్ భాస్కరరామన్‌తో పాటు మరో నాలుగు మాక్సిస్ కంపెనీల ప్రతినిధులను నిందితులుగా చేర్చారు. అభియోగపత్రాన్ని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో దాఖలు చేశారు.

10/26/2018 - 00:11

పొన్నూరు, అక్టోబర్ 25: పొన్నూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్ సెంటర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జడవల్లి మాజీ సర్పంచ్, టీడీపీ నాయకులు పిల్లి సుధాకర్ (59) దుర్మరణం చెందారు. కూరగాయల సెంటర్‌లో నడిచివెళ్తున్న సుధాకర్‌ను టిప్పర్ ఢీకొంది. దీంతో సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్సకై నిడుబ్రోలు ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు.

10/25/2018 - 23:58

చీమకుర్తి, అక్టోబర్ 25 : చీమకుర్తి మండలం రాజుపాలెం -లక్ష్మీపురం ఎస్‌సి కాలనీ వద్ద గుంటలో పడి చేవూరి రమణమ్మ (50) మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురానికి చెందిన రమణమ్మ ఎస్‌సి కాలనీలోని కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందింది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

10/25/2018 - 23:49

నెల్లూరు, అక్టోబర్ 25: నగరంలోని సంతపేట సమీపంలో ఉన్న జయలలిత నగర్‌లో గురువారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో 20 ఇళ్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్న పలువురు పాత మున్సిపల్ కార్యాలయం కింది భాగంలోని జయలలిత నగర్‌లో చిన్న చిన్న పూరిపాకలు, పట్టలతో కప్పిన ఇళ్లలో నివసిస్తున్నారు.

10/25/2018 - 23:38

వరంగల్, అక్టోబర్ 25: ఎన్నికల నేపధ్యంలో వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గురువారం నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో దాదాపు 50వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకునట్లు టాస్క్ఫోర్స్ ఇన్సిస్పెక్టర్ ఎల్. రమేష్ కు మార్ తెలిపారు. అందుకు బాధ్యులైన మల్లేశ్వర్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు.

10/25/2018 - 23:37

మహబూబాబాద్, అక్టోబర్ 25: కురవి మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాదారుపాసుపుస్తకాల వ్యవహారంలో అవినీతి వ్యవహారం యదేచ్చగా కొనసాగుతుందంటూ అనేక అరోపణలు వస్తున్న నేపథ్యంలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ వీఆర్వొ ఏసీబీకి పట్టుపడడం జిల్లాలో సంచలనం సృష్టించింది.

10/25/2018 - 23:26

కరీంనగర్, అక్టోబర్ 25: ఎన్నికల వేళ నగదు తరలింపుపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినా కొందరు భారీ మొత్తంలో నగదు తరలిస్తుండటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా తరలిస్తున్న సొమ్ముకు నిబంధనల మేరకు ఎలాంటి ఆధారాలు చూపకుండా సంబంధిత వ్యక్తులు చేతులెత్తేస్తుండటంతో నిత్యం లక్షలాది రూపాయలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి.

10/25/2018 - 23:16

వేల్పూర్, అక్టోబర్ 25: ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకొని వేల్పూర్ మండలం కుకునూర్ ఎక్స్ రోడ్డు వద్ద తహశీల్దార్ ఆదేశాల మేరకు గురువారం వాహనాలను తనిఖీ చేయగా 8 లక్షలు లభించినట్లు ఆర్‌ఐ జలంధర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల నుంచి డిచ్‌పల్లిలో జరిగే మేకల సంతలో మేకలను కొనుగోలు చేయడానికి డబ్బులను తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన బాధితులు చెప్పారని అన్నారు.

10/25/2018 - 23:03

హిందూపురం టౌన్, అక్టోబర్ 25 : జిల్లాస్థాయి హోదా కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చిన్నారుల మృత్యువు పరంపర కొనసాగుతోంది. బుధవారం చికిత్సల కోసం వచ్చిన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం కూడా మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

10/25/2018 - 22:58

పెద్దాపురం, అక్టోబర్ 25: భార్యపై నిందలు మోపుతుందనే అక్కసుతో తమ్ముడికి పిల్లనిచ్చిన అత్తను దారుణంగా హతమార్చాడో అన్న. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపింది.

Pages