S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/08/2018 - 20:00

అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బీవీఎస్‌ఎన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. చిత్రీకరణ జరుగుతోన్న ప్రాజెక్టును అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా అఖిల్ కొత్త స్టిల్, పోస్టర్‌ను విడుదల చేశారు.

11/08/2018 - 19:58

మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న అంజలి మరో వైవిధ్యమైన పాత్రతో వస్తోంది. ఆ చిత్రమే ‘లిసా’. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘లిసా’ దర్శకుడు రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ సినిమా షూటింగ్ ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. అదీ 3డిలో అయితే మరింత కష్టం. కానీ పిజి ముత్తయ్య ఫ్రేమ్స్‌వల్ల చిత్రం శరవేగంగా పూర్తయ్యింది.

11/08/2018 - 19:57

ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మాస్ హీరో రవితేజ హీరోగా విఐ ఆనంద్ ప్రాజెక్టు ఖరారైంది. నిర్మాత రామ్ తాళ్లూరి భారీగా నిర్మించనున్న ప్రాజెక్టును 13న అధికారికంగా ప్రకటించనున్నారు. రవితేజ, వీఐ ఆనంద్ క్రేజీ కాంబినేషన్‌పై అప్పుడే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. 13న టైటిల్ ప్రకటించి లోగోను లాంచ్ చేయనున్నారు.

11/08/2018 - 19:56

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినీవర్గాల నుంచి అందుతోన్న తాజా సమాచారం ప్రకారం ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఓ ముఖ్య హీరోయిన్ పాత్రను అనుష్క శెట్టి చేయబోతోందట. ఆమె ఎవరో కాదు, బి సరోజాదేవి. ఎన్టీఆర్ సినీ జీవితంగా తెరకెక్కుతున్న ‘కథానాయకుడు’లో బి సరోజాదేవిగా అనుష్క కనిపించబోతోందన్న మాట.

11/08/2018 - 19:54

కన్నడలో వాసు- నాన్ పక్కా కమర్షియల్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్‌వాసన్ ఉగ్గిన తెరకెక్కిస్తున్న రెండో సినిమా మధురవాడ. నరైన్ సమర్పణలో డ్రామా క్వీన్, జస్వంత్ ఆర్ట్స్ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్ కథతో తెలుగు, కన్నడ, తమిళంలో త్రిభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకురానుంది. బీవీ కృష్ణారెడ్డి, ఎం వెంకటేష్ నిర్మాతలు.

11/08/2018 - 19:52

త్రిషాల్ క్రియేషన్స్ బ్యానర్‌పై జి రామ్‌ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం -పల్లెవాసి. గోరంట్ల సాయినాథ్ దర్శకుడు. గీత రచయిత వెనె్నలకంటి కొడుకు రాకేందువౌళి హీరోగా చేస్తుంటే, అతని సరసన కల్కి హీరోయిన్‌గా కనిపించనుంది.

11/08/2018 - 19:51

ఆ మధ్య ఒకింత వెనుకబడిన మిల్కీ బ్యూటీ మళ్లీ బిజీ అయిపోయింది. ఒకదాని వెనుక ఒకటిగా ప్రాజెక్టులకు సైన్ చేసేస్తోంది. ఒక సినిమా షూటింగ్‌లో ఉండగానే, మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది మిల్కీ బ్యూటీ. అభినేత్రి-2, ఎఫ్-2 ప్రాజెక్టులతో బిజీగావున్న తమ్మూ బేబీ, తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్‌కు జోడీగా ‘నెక్స్ట్ ఏంటి’ ప్రాజెక్టు చేస్తోంది.

11/08/2018 - 19:49

రవితేజ -అమర్ అక్బర్ ఆంటోనీతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా, తొలిసారి డబ్బింగ్ సాహసం చేసింది. పాత్ర డిమాండ్ చేయడంతో ఇలియానా పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీను వైట్ల ప్లాన్ చేయడంతో, నాలుగు రోజుల్లోనే డబ్బింగ్ పార్ట్‌ని ఇలియానా పూర్తి చేయడం విశేషం. రవితేజ, ఇలియానా పెయిర్‌కు మంచి క్రేజ్ ఏర్పడటంతో, రీ ఎంట్రీ కోసం రవితేజతో నాలుగోసారి జోడీ కట్టింది ఇలియానా.

11/08/2018 - 19:48

శర్వానంద్, సాయిపల్లవి జంటగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న చిత్రం -పడి పడి లేచే మనసు’. టీజర్‌తో ఇప్పటికే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ఈనెల 12న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మురళీశర్మ, సునీల్‌లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

11/06/2018 - 20:30

క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేసుకుని నిన్నటి వరకూ ఆసక్తిరేపిన హీరో రామ్‌చరణ్ -తాజాగా యాక్షన్ లోడెడ్ ఎక్స్‌ప్రెషన్‌తో ఫస్ట్‌లుక్ విడుదల చేసి మరింత ఆసక్తి రేకెత్తించాడు. రామ్‌చరణ్ -బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం -వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా ముందురోజు ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. నవంబర్ 9న టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Pages