S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/31/2018 - 21:43

కింగ్ నాగార్జున, నానిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుతున్నారు. ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో సాగుతున్న ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్ పాత్రలో కన్పిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక నాని డాక్టర్ పాత్రలో కన్పిస్తాడట.

05/31/2018 - 21:41

దశాబ్దాల కాలంగా తెలుగు తెరపై తిరుగులేని హీరోగా, సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఘట్టమనేని కృష్ణ పుట్టినరోజు సందర్భంగా (31-05-2018) ఆయన తనయుడు మరో సూపర్‌స్టార్ మహేష్‌బాబు తండ్రికి పుట్టినరోజు శుభకాంక్షలు తెలుపుతూ- నా గురువు, నా బలం, నా స్ఫూర్తి మీరే. మీ కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. హ్యాపీబర్త్‌డే నాన్న అంటూ ట్విట్టర్‌లో కృష్ణతో వున్న ఫొటోను పోస్ట్ చేశాడు.

05/31/2018 - 21:39

సుధీర్‌బాబు, అతిథిరావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘సమ్మోహనం’ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. గురువారం ఆయన జన్మదినం సందర్భంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ- ట్రైలర్ చాలా బాగుంది. శివలెంక కృష్ణప్రసాద్ తీసిన ఆదిత్య 369 చాలా గొప్ప సినిమా.

05/31/2018 - 21:36

సాయిధరమ్‌తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. ఈనెల 29న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ- 35 సంవత్సరాలుగా ఈ బ్యానర్‌లో ఎన్నో సినిమాలు తీశాను. నేను సాధారణ ప్రేక్షకుడిని.

05/31/2018 - 21:32

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ భామ దిశా పటాని పెట్టుకున్న ఆశలన్నీ అడియాలయ్యాయి. లోఫర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్‌లోనే సీరియస్‌గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు.

05/31/2018 - 21:29

లక్ష్మిప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత లలితకుమారి మాట్లాడుతూ- చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది.

05/31/2018 - 21:26

ఎ.ఎ.ఎ మూవీస్ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘దుర్మార్గుడు’. సునీత్ జంపా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. అనంతరం చిత్ర నిర్మాత మాట్లాడుతూ- అడగ్గానే పోస్టర్ లాంచ్‌కు విచ్చేసిన శ్రీకాంత్‌కి నా కృతజ్ఞతలు. ఒక మంచి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో దుర్మార్గుడు చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

05/31/2018 - 21:25

అనేకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ అమైరా దస్తూర్ ఆ సినిమాతోనే దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత గ్లామర్ పాత్రల్లో రాణిస్తోంది. ప్రస్తుతం ఈమె రాజ్ తరుణ్ సరసన రాజుగాడు చిత్రంలో నటిస్తోంది. సంజన దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా అమైరా చెప్పిన విశేషాలు..

05/30/2018 - 23:09

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇన్నాళ్లు అన్ని సినిమాల్లోనూ దాదాపు ఒకే లుక్‌తో కనబడ్డ సంగతి అందరికీ తెలుసు. అయితే ఆయన 25వ సినిమాలో మాత్రం కొత్తగా కనిపించనున్నారు. గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నట్టే ఆయన రఫ్ లుక్ ట్రై చేస్తున్నారు. దీనికోసం జుట్టు, గడ్డం రెండూ కొద్దిగా పెంచుతున్నారు.

05/30/2018 - 23:06

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరెక్కుతున్న సైరా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. తాజాగా హైదరాబాద్‌లోని రంగస్థలం సెట్స్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలోని కీలక షెడ్యూల్‌ని జూన్ 5నుండి ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లోనే సినిమాకు సంబంధించిన పలు ముఖ్యమైన సన్నివేశాలు తీస్తారట. యాక్షన్ సన్నివేశాలతోపాటు కథలో కీలకంగా నడిచే సీన్స్ కూడా తీయనున్నారట.

Pages