S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/30/2018 - 22:53

స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై శ్రీమతి స్వప్న సమర్పణలో నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో కె.ఆర్. సహనిర్మాతగా రాజేష్ నిర్మించిన ‘అమ్మమ్మగారిల్లు’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూనిట్ గ్రాండ్ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా నటుడు రావురమేష్ మాట్లాడుతూ- ‘అన్ని పాత్రలు సినిమాలో పండాయి. సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య.

05/30/2018 - 23:07

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. ఈ చిత్రాన్ని జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తొలుత ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నామని ప్రకటించినప్పటికీ, సిజి వర్క్ పెండింగ్ ఉండటంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘బాహుబలి’ చిత్రానికి వర్క్ చేసిన మకుట టీం సాక్ష్యం సీజీ వర్క్ చేస్తోంది. దర్శక నిర్మాతలు అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీపడడంలేదు.

05/30/2018 - 22:50

ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై పెనాక దయాకర్ రెడ్డి నిర్మాణంలో, ప్రదీప్‌రాజ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం దెయ్యం చెప్పిన కథ. ఈ చిత్రం పోస్టర్‌ను దర్శకుడు కోడి రామకృష్ణ ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- దెయ్యం కథ చెప్పడం అనేది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని, దర్శకుడు ప్రదీప్ సినిమాను చక్కగా తెరకెక్కించి ఉంటాడు అని నమ్ముతున్నానని అన్నారు.

05/30/2018 - 23:12

శంకర్‌ని హీరోగా, శ్రీ్ధర్ ఎన్.దర్శకుడిగా పరిచయంచేస్తూ ఆర్.ఆర్.పిక్చర్స్ సంస్థ, ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘శంభోశంకర’ చిత్రం రెండవ లిరికల్ వీడియో పాటను హీరో విశాల్ విడుదలచేసారు. భాస్కరభట్ల రాసిన ఈ పాట గురించి హీరో విశాల్ మాట్లాడుతూ.. ‘నాకు మొట్టమొదటగా ‘శంభో శంకర’ టైటిల్ బాగానచ్చింది. మీ సినిమా టైటిల్ అయితే నిజంగానే అదిరింది.

05/30/2018 - 22:48

21 సంవత్సరాల క్రితం శంకర్ - కమల్‌హాసన్‌ల కలయికలో రూపొందిన ‘్భరతీయుడు’ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘్భరతీయుడు-2’ రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో వున్న ఈ చిత్రం కమల్ ‘బిగ్‌బాస్-2’ పనులు పూర్తవ్వగానే మొదలవుతుందని వినికిడి.

05/29/2018 - 21:00

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. నేడు (మే 30) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి.. చేయబోయే చిత్రాల గురించి చెప్పుకొచ్చారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

05/29/2018 - 20:58

తమిళంలో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న జయం రవి కథానాయకుడిగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిమిరిందు నిల్’. జయం రవి సరసన అమలాపాల్, రాగిణి ద్వివేది కథానాయికలుగా నటించిన చిత్రాన్ని గ్రేహాక్ మీడియా పతాకంపై వీరబ్రహ్మచారి అన్నభీమోజు సమర్పణలో రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పౌరుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

05/29/2018 - 20:56

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజ్‌కిరణ్ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. మాధవి అద్దంకి, రజనీకాంత్.యస్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గీతాంజలి, త్రిపుర చిత్రాల దర్శకుడు రాజ్‌కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక నిర్మాత తేజ ఎన్టీఆర్ చిత్రపటానికి నమస్కరించి చిత్రపటంపై క్లాప్‌తో సినిమాను ప్రారంభించారు.

05/29/2018 - 20:55

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెనే్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్‌ర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. అంతం, గోవిందా గోవిందా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా చేయడం మరో విశేషం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

05/29/2018 - 20:52

గోవా భామ ఇలియానా అంటే ఇప్పటికీ సౌత్‌లో మంచి క్రేజే. దక్షిణాదిలో గ్లామర్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈమె, బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని ఇక్కడ వస్తున్న అవకాశాలను కాదనుకుని వెళ్లింది. కానీ బాలీవుడ్‌లో పరిస్థితి మరోలా వుంది. చేసిన రెండు మూడు చిత్రాలు కెరీర్ పరంగా సక్సెస్ ఇవ్వకపోవడంతో అవకాశాలు తగ్గాయి. గత ఏడాది కాలంగా ఒక్క సినిమా చేతిలో లేక ఖాళీగా వుంది.

Pages