S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/30/2017 - 20:17

టాలీవుడ్..దాదాపు హాలీవుడ్ స్థాయికి చేరుకుంటుంది. అక్కడ అరవై ఏళ్లకు కూడా హీరోయిన్లుగా నటిస్తారు. హిందీలో కూడా వుంది. తెలుగులో మాత్రం పెళ్లయిందంటే కెరీర్ అయిపోయిందనే అంటారు. ఈ మైండ్‌సెట్ మారాలి అంటారు నటి భూమిక. నాని కథానాయకుడిగా రూపొందించిన ఎంసిఏ చిత్రంలో నటి భూమిక వదినగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భూమిక పలు విశేషాలు తెలిపారు.

12/30/2017 - 20:16

నాకు ప్రేమ కథలు, కుటుంబకథలంటే చాలా ఇష్టం. అలాగని అలాంటి పాత్రలే అన్నీ చేయలేం. బన్నీ వేదంలో చేసిన కేబుల్ రాజు పాత్ర, రుద్రమదేవిలో చేసిన గోన గన్నారెడ్డి పాత్రలు చూసినపుడు మనం కూడా ఏవైనా కొత్త ప్రయోగాలు చేయకూడదా అనిపిస్తుందని అల్లు శిరీష్ తెలిపారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో సీరత్‌కపూర్, సురభి, శిరీష్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ఒక్క క్షణం విడుదలైన సంగతి తెలిసిందే.

12/28/2017 - 20:21

ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై అల్లాణి శ్రీ్ధర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నేనే సరోజ’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం చింతపల్లి గూడలో చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరుపుతున్నారు.

12/28/2017 - 20:19

సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రం ప్రారంభం అయింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. అతిదిరావు హైదరీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘సమ్మోహనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

12/28/2017 - 20:19

శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చుక్కపల్లి ప్రసాద్, సుధాకర్ చెరుకూరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జనవరి 3వ వారం నుండి ప్రారంభం కానుంది.

12/28/2017 - 20:17

మహేష్ ఎన్నింటి, స్నేహాసింగ్, అనికా అబ్బాస్ ప్రధాన తారాగణంగా రూపొందించిన లఘు చిత్రం ‘ప్రేమతో ప్రేమ్’. సరికొత్త ప్రేమకథతో రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా రూపొందించారు. ఈ సందర్భంగా నిర్మాత జె.సి. క్రియేషన్స్ మాట్లాడుతూ- ఇప్పటివరకు వెండితెరపై ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు మిత్రుల కథలు చూశాం. కానీ ఈ చిత్రంలో ఇద్దరు శత్రువులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు.

12/28/2017 - 20:15

బాలకృష్ణ, నయనతార జంటగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘జై సింహా’ చిత్రం ఆర్‌ఎఫ్‌సిలో జరిగిన షూటింగ్‌తో పూర్తయింది. గుమ్మడి కాయ కొట్టి చిత్రం షూటింగ్‌ని ముగించినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు నిర్మాత సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

12/28/2017 - 20:13

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఆయనకు ‘మా’ సభ్యులు శుభాకాంక్షలు అందజేశారు. కార్యక్రమంలో శివాజీరాజా, సురేష్, వి.బెనర్జి, హేమ, కొండేటి తదితరులు పాల్గొన్నారు.

12/28/2017 - 20:11

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుండి తాజాగా విడుదలైన ‘ఎంసీఏ’ వరకు ఎనిమిది వరుస విజయవంతమైన చిత్రాలతో మెప్పిస్తున్న యువ నటుడు నాని హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్ బోయినపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహసు గారపటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

12/28/2017 - 20:10

హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా టర్న్ అయి నిలదొక్కుకున్న నటుడు సునీల్. మళ్లీ కమెడియన్‌గా నటించడానికి సిద్ధమవుతున్నారు. మంచి స్క్రిప్ట్‌లు వస్తే హీరోగా కంటిన్యూ అవుతానని అంటున్న సునీల్, తాజాగా నటించిన ‘2 కంట్రీస్’ నేడు విడుదల అవుతోంది. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి సునీల్ చెప్పిన విశేషాలు- ‘‘2 కంట్రీస్ మలయాళంలో ఆల్రెడీ హిట్ చిత్రం.

Pages