S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/27/2017 - 20:08

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు మొదటి సినిమా ‘అఖిల్’ పరాజయాన్ని అందించినా రెట్టించిన ఉత్సాహంతో కొంత గ్యాప్ తీసుకుని ‘హలో!’ అంటూ పలకరించాడు. ‘మనం’ ఫేం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ విజయపథం వైపు దూసుకెళుతోంది. ఈ సందర్భంగా అఖిల్‌తో ఇంటర్వ్యూ..
‘హలో’ విజయం..

12/27/2017 - 20:06

పవన్ నటించిన 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాంగ్స్ హిట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్‌లో చినబాబు నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా కోటేశ్వర్రావా’ పాటను ఈనెల 31న విడుదల చెయ్యబోతున్నారు.

12/27/2017 - 20:04

రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ, ప్రస్తుతం విక్రమ్ సిరి దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, సీరత్‌కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ చిత్రం చేయనున్నాడు.

12/27/2017 - 20:03

నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘రాజరథం’. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో దగ్గుబాటి రాణా ఆవిష్కరించారు.

12/27/2017 - 20:02

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవితకథతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్‌కుమార్ హీరాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో రణబీర్‌కపూర్ నటిస్తున్నారు. సంజు అనే టైటిల్‌ను నిర్ణయించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఆయన చెల్లెలు ప్రియాదత్ పాత్రలో శీయ నటించనుంది. రవితేజతో ‘నేనింత’ చిత్రం తరువాత శీయ బాలీవుడ్‌కి వెళ్లింది.

12/27/2017 - 20:00

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో డిజిటల్ మరియు థియేటర్ల లీజ్ విధానంపై మార్చి 31లోపు డిజిటల్ రేట్లు తగ్గించకున్నా, థియేటర్ల లీజు విధానం తీసివేయకపోయినా ఆ రోజునుండి రెండు రాష్ట్రాలలో సినిమాలు మరియు థియేటర్లు, షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ మరియు సభ్యులు తెలుగు ఫిలిం ఛాంబర్ తెలియజేసింది.

12/27/2017 - 19:59

స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘జయహో రామానుజా’. ఈ సినిమాకు సంబంధించిన లోగో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ - భగవత్ రామానుజుల చరిత్ర, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన నిర్మాణం, స్వామివారి మహిమలు ఈ చిత్రంలో చూపిస్తున్నామని తెలిపారు.

12/27/2017 - 19:58

ఇలియానా వార్తలు ప్రస్తుతం బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఆమెపైనే ఈ వార్తలు సాగుతున్నాయి. ఇద్దరి వ్యవహారం జోరుగా మారిందని, సెలవులకు ఎక్కడకు పడితే అక్కడకు వెళ్లిపోతున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె క్రిస్మస్ వేడుకల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

12/27/2017 - 19:57

నా కథలన్నీ కుటుంబాలకు సంబంధించిన అంశాలతోనే నిండి వుంటాయి. అలా రాసుకోవడమే నాకు ఇష్టం అంటున్నారు ‘ఎంసిఏ’ దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘ఎంసిఏ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ వేణు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు వస్తున్న ఆదరణకు చాలా ఆనందంగా వుంది. సినిమా గురించి ఏదైతే అనుకున్నామో అదే ఇప్పుడు జరుగుతుంది.

12/26/2017 - 19:37

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఇపుడు అందరి కన్ను పడిందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కోలీవుడ్- బాలీవుడ్ మీడియాలలో ఇపుడు ప్రభాస్ గురించి ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల మధ్యలో ఇపుడు ఒక న్యూస్ హాట్ టాపిక్ అయింది. అదేమిటంటే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రభాస్‌తో ఓ సినిమాను చేయాలని అనుకుంటున్నాడట.

Pages