S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/24/2017 - 23:08

రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. సుకుమార్ కూడా టీజర్‌తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ స్టైల్‌లో టీజర్ ఉండబోతోందట. అయితే ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో తెలుసా.. వచ్చే సంక్రాంతికేనట.

12/24/2017 - 20:28

దశాబ్దకాలం పాటు దక్షిణాదిలో గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త్రిషకు ఈమధ్య కెరీర్ బాగా వెనుకబడిపోయింది. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామకు భిన్నమైన సినిమాలు చేసే అవకాశం వచ్చింది కానీ కమర్షియల్ విజయాలు అందనంద దూరంలో ఆగిపోయాయి. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ సినిమాలు కూడా విడుదల విషయంలో ఇంకా ఆలస్యం అవుతూనే వుంది.

12/23/2017 - 19:42

గ్రౌండ్‌లో క్రికెట్ ఆడే బ్యాట్స్‌మెన్ ప్రతి బాల్‌ను సిక్స్ కొట్టాలనే అనుకుంటాడు.. అలాంటి ప్రయత్నాలు చేస్తాడు.. కానీ అన్ని బాల్స్ సిక్స్ కాలేవు సరికదా.. సింగిల్స్ రావడమూ కష్టమే.. అచ్చంగా ప్రతి సినిమా విషయంలో అందరూ అలానే అనుకుంటారు. కానీ విడుదలైన ప్రతి సినిమా సక్సెస్ కాలేదు. కొన్ని బౌండరీలు దాటితే మరికొన్ని సింగిల్స్ రావొచ్చు లేదా అవుట్ అవొచ్చు. చూస్తుండగానే మరో ఏడాది గడిచిపోయింది.

12/22/2017 - 19:54

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం కోసం తను ఓ పాటను పాడారు. తాజాగా ఈ పాటను రికార్డింగ్ చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తిసురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

12/22/2017 - 19:53

టాలీవుడ్ చందమామ కాజల్‌కు ఈమధ్య సినిమాలు కాస్త తగ్గినా కూడా ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం దక్షిణాదిలో ఏ సినిమా చేయడంలేదు. ఈమధ్య వరుసగా పరాజయాలు అందుకున్న ఈ గ్లామర్ భామకు కొత్త అవకాశాలు కరువయ్యాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాజల్‌కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.

12/22/2017 - 19:52

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న అల్లరి నరేష్, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మేడమీద అబ్బాయి’ పరాజయంతో మళ్లీ నిరాశనే మిగిల్చాడు. దాంతో సరైన విజయం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్న నరేష్, తనకు కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.

12/22/2017 - 19:50

రాజా ది గ్రేట్‌తో మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకున్న రవితేజ, ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పెద్ద సినిమాలు ఉండడంతో సినిమాను జనవరి 26కు వాయిదా వేశారు.

12/22/2017 - 19:49

ఈ చలనచిత్ర నిర్మాతలు, దర్శకుడు, ప్రధాన నటీనటులు భారత జాతికి ఒక గొప్ప ఆదర్శం, సంప్రదాయం, అద్భుతమైన వినోదం ఈ చిత్రం ద్వారా సమకూర్చగలమని ఉవ్విళ్ళూరారేమో కాని, ఈ చలనచిత్రం భారతీయతకు గొడ్డలిపెట్టు అని ప్రధాన ఇంగ్లీషు దినపత్రికలలో వస్తున్న వాద వివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు, సంవాదాలు నిరూపిస్తున్నాయి.

12/21/2017 - 20:14

‘‘అఖిల్ ‘హలో’ చిత్రం విషయంలో దర్శకుడు విక్రం కుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. తనతోపాటు టీమ్ కూడా ఎంతో కష్టపడి మంచి సినిమా తీశారు. అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలనే కసితో చేసిన సినిమా ఇది. ఫలితం గూర్చి తన ఏ మాత్రం టెన్షన్ లేదు. రేపు అందరికీ నచ్చేస్తుంది’’ అన్నారు నాగార్జున.

12/21/2017 - 20:12

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కొరటాల శివ సినిమా అంటే అటు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి వుందో.. ఆయనతో సినిమా చేసేందుకు టాలీవుడ్‌లో హీరోలు కూడా పోటీ పడుతున్నారు. వరుసగా మూడు సంచలన చిత్రాలు రూపొందించిన కొరటాల, ప్రస్తుతం మహేష్‌తో ‘్భరత్ అను నేను’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Pages