S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/27/2017 - 20:56

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న 61వ చిత్రం ‘అదిరింది’. అట్లీ దర్శకత్వంలో తెనే్నండాళ్ స్టూడియోస్ పతాకంపై మురళీ రామస్వామి, హేమా రుక్మిణి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి విడుదల చేస్తున్నారు.

06/27/2017 - 20:54

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం రాజమండ్రిలో మరో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇదివరకే మొదటి షెడ్యూల్ జరుపుకున్న ఈ చిత్రం అదే ప్రాంతంలో రెండో షెడ్యూల్‌ను నిన్నటితో ముగించేసింది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుపుతారట. ఇప్పటికే 40 శాతంపైగా షూటింగ్ జరిగిందని, షూటింగ్ పట్ల యూనిట్ సభ్యులు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

06/27/2017 - 20:53

నవీన్ హీరోగా కృష్ణప్రసాద్ దర్శకత్వంలో ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘డేర్’. ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘అన్ని రకాల కమర్షియల్ విలువలతో తెరకెక్కిన చిత్రమిది. పాటలు, కామెడీ హైలెట్‌గా నిలుస్తాయి.

06/27/2017 - 20:51

పృథ్వీ పొట్లూరి, సౌమ్యాశెట్టి జంటగా జో దర్శకత్వంలో పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృధ్వీ పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘యువర్స్ లవ్వింగ్లీ’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తుమ్మల భాస్కరరావు, అచ్యుతవల్లి దంపతులు ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.

06/27/2017 - 20:50

ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి శిష్యుడు టి.డి.ప్రసాద్‌వర్మ దర్శకుడిగా పరిచయం అవుతూ వెంకటసాయి ప్రియాన్సి క్రియేషన్స్ పతాకంపై జి.వెంకటేష్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం మంగళవారం ఫిలింనగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి చిత్ర దర్శకుడు ప్రసాద్ వర్మకు స్క్రిప్ట్ అందించారు.

06/27/2017 - 20:49

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ సమర్పణలో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మాధవి అద్దంకి నిర్మించిన చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’.

06/27/2017 - 20:47

బాలీవుడ్ గ్లామర్ భామ దీపికా పదుకొనెకు ఇప్పుడు ఎంత క్రేజ్ వుందో అందరికీ తెలిసిందే. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్న ఈమె, బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా తన హవా చాటుకుంటోంది. ఇప్పటికే హాలీవుడ్‌లో సినిమాలు చేసిన దీపికను ఓ రెస్టారెంట్ నవ్వించిందట. రెస్టారెంట్ నవ్వించడమేంటని ఆశ్చర్యపోకండి! ఆ వివరాల్లోకి వెళితే, ఆమధ్య ఆమె ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైలోని ఓ ప్రాంతానికి వెళ్లిందట.

06/27/2017 - 20:46

రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ సాగర్ దర్శకత్వంలో గంగాధర్, రేణుక, యశ్వంత్, లిఖిత, చక్రి, హరీశ్ ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఆకలి పోరాటం’. ఈ చిత్రంలోని పాటలు రాజమండ్రిలో విడుదలయ్యాయి.

06/27/2017 - 20:44

గ్లామర్ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ అనసూయకు అటు టీవీ కార్యక్రమాలతోపాటు ఇటు సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అనసూయ అంటే అందరికీ అదో క్రేజ్. టెలివిజన్ రంగంలో యాంకర్లకు గ్లామర్ సోకులద్దిన అనసూయ గత ఏడాది నటించిన సినిమాలు విజయం సాధించడంతో ఈమెకు అవకాశాలు పెరిగాయి. దాంతోపాటు ‘విన్నర్’లో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది.

06/25/2017 - 21:47

ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం చిత్రంతో జోరుమీదున్నాడు అల్లు అర్జున్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమా తరువాత రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాపేరు సూర్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొననున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

Pages