S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/29/2017 - 20:54

శ్రావ్యా ఫిలింస్ పతాకంపై చేతన్ మద్దినేని హీరోగా పి.సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్.రామ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. సినిమా ప్రచారంలో భాగంగా కథానాయకుడు ప్రచార చిత్రాన్ని హీరో నాని విడుదల చేశారు.

06/29/2017 - 20:51

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు, సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో సుధీర్ కుమార్ పూదోట (జాన్) రూపొందిస్తున్న చిత్రం ‘ఓటర్’ (హీరో ఆఫ్ ది నేషన్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఐర్లాండ్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేశారు. మరో పాటను ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరించనున్నారు.

06/29/2017 - 20:50

గుడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ పతాకంపై సాయిరోనక్, శ్రావ్య, శిరీష వంక ప్రధాన తారాగణంగా ఏనుగుబల దర్శకత్వంలో సుమిత్‌సింగ్ రూపొందిస్తున్న చిత్రం ‘మసక్కలి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చాయి.

06/29/2017 - 20:48

బాలీవుడ్‌లో సంచలనం రేపిన బిగ్‌బాస్ టీవీ షో ఇప్పుడు తెలుగులోకి రానుంది. ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ, హందీ భాషల్లో సూపర్‌హిట్ అయిన ఈ షోను తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. తమిళంలో కమల్‌హాసన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ షో హౌస్‌లో ఎవరు పాల్గొంటారనే విషయం అందరిలో ఆసక్తి రేపుతోంది. తెలుగు షోలో ఎవరు పాల్గొంటారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు కానీ..

06/29/2017 - 20:48

తరుణిక ఆర్ట్స్ పతాకంపై నాజర్, జీవ, ప్రియ, బాలు ప్రధాన తారాగణంగా అజయ్ రూపొందించిన చిత్రం ‘కదిలే బొమ్మల కథ’. శశిధర్.బి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. కాగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సినీ విశేషాలను చిత్ర యూనిట్ తెలిపింది.

06/29/2017 - 20:46

‘కూలీ నెం.1’ చిత్రంతో తెరంగేట్రం చేసి ఆ తరువాత పలు చిత్రాలతో అగ్రస్థాయికి ఎదిగి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా హవా సృష్టించిన టబు, తన మనసులో మాట బయటపెట్టింది. ఇప్పటివరకూ పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఏంటి? అని అడిగితే ఓ హీరో అని చెప్పింది. అతనెవరో కాదు బాలీవుడ్ నటుడు, కాజోల్ భర్త అజయ్ దేవ్‌గన్. ఇదేంటి చెప్మా అనుకుంటున్నారా? అదేంకాదు- అజయ్‌దేవ్‌గన్‌తో చిన్ననాటినుంచి ఆమెకు పరిచయం ఉన్నదట.

06/29/2017 - 20:44

తెలుగులో పలు చిత్రాల్లో నటించి ‘హాట్ గర్ల్’గా ఇమేజ్ తెచ్చుకుంది షెర్లిన్ చోప్రా. బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు ఏవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. కామసూత్ర సినిమాలో న్యూడ్‌గా నటించినా ఆ సినిమా విడుదల కాకుండా ఈమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. దాంతోపాటు పాపులర్ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజీ ఛాన్స్ కొట్టేసిన షెర్లిన్ దానికోసం న్యూడ్‌గా ఫొటోలకు పోజులిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

06/28/2017 - 21:16

డీజే చిత్రంతో కథానాయికా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే మరో చిత్రంలో నటిస్తోంది. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

06/28/2017 - 21:15

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందించనున్నారు. విక్రమ్ మల్హోత్రా తెలుగు, హిందీ భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ- తన జీవిత కథపై సినిమా రూపొందుతుండడం ఆనందాన్నిస్తోందని, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుందని అన్నారు.

06/28/2017 - 21:15

సాయిధరమ్ తేజ్, మెహరీన్ ఫీర్జాదా జంటగా అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై రవి బి.వి.ఎస్ దర్శకత్వంలో కృష్ణ రూపొందించిన చిత్రం ‘జవాన్’. టాకీపార్ట్ పూర్తిచేసుకుని షూటింగ్ చివరి షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్, టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు.

Pages