S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/30/2017 - 21:14

ప్రస్తుతం జై లవకుశ సినిమాతో బిజీగా వున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిసింది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇటీవల కథా చర్చలు జరిగాయి. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా అయిపోగానే ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి వస్తుందట.

06/30/2017 - 21:12

అనీల్ మల్లెల, మహిమ జంటగా నందు మల్లెల దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, డే డ్రీమ్స్ పతాకాలపై ప్రదీప్ చంద్ర, మోహన్ అండె సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘రెండు రెళ్లు ఆరు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల రాజవౌళి విడుదల చేశారు.

06/30/2017 - 21:11

సంచలన దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీతనంతోపాటు కొత్తదనాన్ని కలిగివుంటాయి. ముఖ్యంగా తన సినిమాలకు ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపేందుకు ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిస్తున్న రోబో 2.0 సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలోనే ఆడియో జరుపుకోనుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ (లాస్‌ఏంజెల్స్)లో భారీ ఎయిర్ బెలూన్లను ఎగరవేసి సంచలనం రేపాడు.

06/30/2017 - 21:09

పూజాగాంధి, రవిశంకర్, రఘు ముఖర్జి, సంజన ముఖ్యపాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన దండుపాళ్యం-2 చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది.

06/30/2017 - 21:08

క్రికెట్ చరిత్రలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్ కథానాయకుడిగా రూపొందించిన చిత్రం ‘టీమ్ 5’. బైక్ రేసర్‌గా నటించిన ఆయన సరికొత్తగా ఈ చిత్రంలో కన్పించనున్నారని దర్శకుడు సురేష్ గోవింద్ తెలియజేస్తున్నారు. తమిళ, హిందీ, మలయాళ, తెలుగు భాషల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 14న విడుదలకు సిద్ధమైంది.

06/30/2017 - 21:06

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని, నివేదా థామస్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ‘నిన్నుకోరి’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు రాజవౌళి సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొరటాల శివ, హను రాఘవపూడి, డి.సురేష్‌బాబు, జెమిని కిరణ్, ఎన్.వి.ప్రసాద్, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు.

06/30/2017 - 21:04

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం పాతబస్తీలో జరుగుతోంది. భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ జర్నలిస్టుగా నటిస్తోంది.

06/30/2017 - 21:02

గ్లామర్ భామగా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శృతిహాసన్ టాప్ హీరోయిన్ రేసులో ఉంది. అయితే బాలీవుడ్‌పై ఈమె ఎక్కువ ఆశలు పెట్టుకోవడంతో సౌత్‌లో పెద్దగా సినిమాలు చేయడానికి సుముఖత వ్యక్తంచేయడం లేదు. ఇటీవలే ఆమె హిందీలో నటించిన ‘బెహెన్ హోగీ తేరి’ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో శృతి ఆశలు నీరుగారిపోయాయి. సౌత్‌లో అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకాడని ఈమెకు అవకాశాలకు కొదువలేదు.

06/29/2017 - 20:59

స్పైడర్‌మాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు లేడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు స్పైడర్‌మాన్ మాత్రమే హీరోగా గుర్తొస్తాడు. ప్రస్తుతం హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషలలో స్పైడర్‌మాన్ సీరీస్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్‌మాన్ హోమ్ కమింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం జూలై 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో స్పైడర్‌మాన్ సందడి చేశాడు.

06/29/2017 - 20:57

కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ తరువాత ఆ రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకి ఈమధ్య కెరీర్‌కు బ్రేక్ పడింది. వెంట వెంట వస్తున్న పరాజయాలతో సతమతం అవుతున్న నరేష్, తన పరాజయాలకు బ్రేక్ వేయాలని ‘మేడమీద అబ్బాయి’గా వస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూ...

Pages