S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/17/2016 - 02:16

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్‌రెడ్డి, త్రినాధ్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. సుద్దాల అశోక్ తేజ ప్లాటినమ్ డిస్క్‌లను చిత్ర బృందానికి అందజేశారు.

03/17/2016 - 02:15

రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకింగ్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, లవ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు.

03/17/2016 - 02:14

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నాయకి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది.

03/17/2016 - 02:13

12 ఫ్లాపుల తరువాత ‘ఇష్క్’ సినిమాతో నితిన్‌కు విక్రమ్‌కుమార్ బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపును కంటిన్యూ చేసిన సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే’. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా నితిన్‌కు హీరోగా మంచి మైలేజ్‌నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు విజయ్‌కుమార్ కొండా వెలుగులోకొచ్చాడు.

03/17/2016 - 02:09

టాలీవుడ్ హీరో రానాకు ఇప్పుడు అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రం తరువాత రానా రేంజ్ బాగా పెరిగింది. ఇప్పటికే అన్ని భాషల్లో పలు అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ సమాచారం. తాజాగా తమిళంలో రానాకు ఓ క్రేజీ అవకాశం దక్కింది. ధనుష్ కథానాయకుడిగా నటించే ఓ చిత్రంలో ఆయన విలన్‌గా నటించడానికి ఓకె చెప్పాడు.

03/17/2016 - 02:08

‘బాహుబలి’.. దర్శక ధీరుడు రాజవౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్ దేశ వ్యాప్తంగా ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చివర్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న సస్పెన్స్‌ను అలాగే దాచిపెట్టిన రాజవౌళి, ఆ సస్పెన్స్ కోసం బాహుబలికి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ వచ్చేవరకూ ఎదురుచూడమని చెప్పారు.

03/15/2016 - 23:48

నిజానికి ‘ఊపిరి’ సినిమా చేయడానికి సంవత్సరం పట్టింది. అలాగే ‘బాహుబలి’ సినిమా కూడా ఇంకెంత టైమ్ పడుతుందో తెలియదు. ఒకేసారి పది సినిమాల్లో నటించాలని కోరిక నాకు లేదు. నాకు నచ్చిన కథలతో నచ్చిన పాత్రలుంటే చేస్తా.

03/15/2016 - 23:17

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో సంచలనం సృష్టించిన హెబాపటేల్ తాజా గా మరో చిత్రంలో నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే నేను నా బాయ్ ఫ్రెండ్స్ బండి భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు.

03/15/2016 - 22:57

చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం గురించి ఇన్నాళ్లు కథాకథనాలు అనేకం వినిపించాయి. కొంతమంది ఆ సినిమా వస్తుందా రాదా అన్న మీమాంసలో కూడా వుండిపోయారు. ఎట్టకేలకు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రానికి రీమేక్‌గా చిరంజీవి 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరా అని అభిమానులు ఎదురుచూశారు. ఆ వార్త కూడా తెలిసిపోయింది.

03/15/2016 - 22:25

హ్యాట్రిక్ విజయంతో జోరుమీదున్న రాజ్‌తరుణ్‌కు ఇప్పుడు చేతినిండా అవకాశాలున్నాయి. ఇప్పటికే మంచువిష్ణుతో కలిసి నటిస్తున్న సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఈ చిత్రానికి ‘వీడు అదో టైపు.. వాడు మరోటైపు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. దీంతోపాటు సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Pages