S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు

03/20/2016 - 00:53

గూడూరు, మార్చి 19: గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ధ్వజారోహణం, చిన్న శేషవాహనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ, రాత్రికి పెద్ద శేషవాహనం కార్యక్రమాలను నిర్వహించారు. ధ్వజారోహణం సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

03/20/2016 - 00:53

చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

03/20/2016 - 00:53

నెల్లూరు టౌన్, మార్చి 19: రైతులు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ ఎం జానకి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న జిల్లా పరిషత్ సభా మందిరంలో ఉద్యాన రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

03/20/2016 - 00:52

వెంకటగిరి, మార్చి 19: నేషనల్ స్పేస్ సొసైటీ అమెరికా వారు వరల్డ్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ 2016 ఫలితాల్లో వెంకటగిరి శ్రీ చైతన్య విద్యార్థులు ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల ఎజిఎం హనుమంతరావు తెలిపారు. శనివారం స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో నాసాకు ఎంపికైన 9 మంది విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు.

03/20/2016 - 00:51

నెల్లూరు, మార్చి 19: డెల్టా ప్రాంత రైతాంగానికి రెండవ పంట కోసం సాగునీటి విడుదలకు ఉద్దేశించి ఆదివారం నిర్వహించాల్సిన సాగునీటి సలహా మండలి సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈనెల 23న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

03/20/2016 - 00:51

ఆత్మకూరు, మార్చి 19: తనపై మద్యం వ్యాపారులు దాడికి పాల్పడుతుంటే కళ్లారా చూస్తున్న ఇద్దరు ఆత్మకూరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రేక్షకపాత్ర వహించారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఆవేదన చెందుతున్నారు. తన పరిస్థితే ఇలాగైతే, ఇక సామాన్య ప్రజానీకంపై ఎవరైనా దాడులకు పాల్పడినా రక్షించాల్సిన పోలీస్‌శాఖ చేతులెత్తేయడమేనా అంటూ వాపోతున్నారు.

03/20/2016 - 00:50

నెల్లూరుసిటీ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఉద్యమం ద్వారా దేశ రాజధానిలో ప్రభావితం చేసినట్లు డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తెలిపారు.

03/20/2016 - 00:49

చేజర్ల, మార్చి 19: చేజర్ల మండలానికి ఒక ఇసుక రీచ్ కేటాయించాలని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఒక పర్యాయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మరో మారు చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. శనివారం చేజర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలసి హాజరయ్యారు.

03/20/2016 - 00:49

బిట్రగుంట, మార్చి 19:ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం బిలకూట క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాలోని పలు గ్రామాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా విచ్చేశారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి కొండ మెట్లకు, ఔవరబోది వృక్షం (అత్తిచెట్టు)కు పసుపుకుంకమ రాసి పూజలు చేశారు.

03/20/2016 - 00:48

నెల్లూరు: పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 35,536 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 532 మంది గత ఏడాది పరీక్షల్లో ఫెయిలైనవారు కాగా, 445 మంది ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. మిగతావారంతా రెగ్యులర్‌గా పరీక్షలకు హాజరవుతున్నవారే. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.

Pages