S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/29/2018 - 13:51

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దును ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆర్థిక వేత్త కూడా ప్రశంసించలేదని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో జరిగిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ)కార్యక్రమంలో మాట్లాడుతూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.

08/29/2018 - 13:25

న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు హరికృష్ణ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.

08/29/2018 - 06:06

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల శాసనసభలు, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సమావేశానంతరం విలేఖరులకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుంది..

08/29/2018 - 04:54

న్యూఢిల్లీ, ఆగస్టు 28: అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్‌లో తమ పేర్లు లేవని చెబుతున్న పది శాతం మంది విషయంలో శాంపిల్ సర్వే, మళ్లీ తనిఖీల కార్యక్రమం చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవలనే జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధించి ముసాయిదా పౌర రిజిస్టర్‌ను ప్రకటించిన విషయం విదితమే.

08/29/2018 - 04:46

న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లినా టీఆర్‌ఎస్ పార్టీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైపార్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం అధికార ప్రతినిధి హోదాలో జైపాల్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో ముందస్తుగా ఎన్నికలు వస్తున్నయంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుందని పేర్కొన్నారు.

08/29/2018 - 06:08

జకార్తా/ పాలెంబాగ్, ఆగస్టు 28: ఉప ఖండం క్రీడా సంరంభంలో మంగళవారం భారత అథ్లెట్లు వెండి పంట పండించారు. వేటలో వెనకపడకుండా ఒక చేత్తో స్వర్ణాన్ని అందుకున్న భారత్, మిగిలిన క్రీడా విభాగాల్లో ‘వెండి’ వెలుగుల్ని ‘ఆరే’సింది. ఖాయంగా స్వర్ణాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు ఒకింత నిరుత్సాహపర్చినా, అంచనాలేలేని ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రికార్డుల మోత మోగించడం గమనార్హం.

08/28/2018 - 22:45

న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపైనా, గాంధీ కుటుంబంపై మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేటీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

08/28/2018 - 22:43

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వచ్చేనెలలో ఇజ్రాయిల్, కెనడా, యూఎస్ పర్యటన రద్దయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, నీతి ఆయోగ్ సదస్సు నేపథ్యంలో గడ్కరీ పర్యటన వాయిదా పడిందని సంబంధిత కార్యాలయ వర్గాలు తెలిపాయి.

08/29/2018 - 05:32

ముంబయి, ఆగస్టు 28: మహారాష్టల్రోని రెండు ప్రముఖ జలాశయాల బ్యాక్‌వాటర్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రెండు సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్రం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఏజెన్సీ ముందుకు వచ్చింది.

08/28/2018 - 22:38

న్యూఢిల్లీ, ఆగస్టు 28: రాజధాని ఢిల్లీలోన తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్)లో మార్పులపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై సంస్థ డైరెక్టర్ శక్తిసిన్హా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ లేఖ రాయడం వెనకు ఉద్దేశాలను మంగళవారం ఆయన ప్రశ్నించారు.

Pages