S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/26/2018 - 02:05

అన్నాచెల్లెళ్ల బంధానికి, మొక్కకు మానవ మనుగడకూ ఉన్న అనుబంధాన్ని చాటాడు ఒడిశా సైకత చిత్రకారుడు. రక్షా బంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కను బహుమతిగా ఇవ్వాలనే సందేశంతో పూరీ సముద్ర తీరంలో రాఖీని సుందరంగా తీర్చిదిద్దిన దృశ్యం.

08/26/2018 - 01:54

న్యూఢిల్లీ, ఆగస్టు 25: బాలికపై అత్యాచార ఘటన ఢిల్లీ వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనతో రెచ్చిపోయిన ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి దిగారు. పలు కార్లు ధ్వంసం కాగా సుమారు పదిమందికి పైగా పోలీసులు గాయాలపాలయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇరవైమంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

08/26/2018 - 01:52

అహ్మదాబాద్, ఆగస్టు 25: పాటీదార్ నేత, పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న హార్దిక్ పటేల్ ఆమరణ దీక్షను ప్రారంభించారు. శనివారం ఇక్కడ తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. శనివారం ఇక్కడ 3 గంటలకు తన అనుచరుల సమక్షంలో ఆయన దీక్షకు కూర్చున్నారు.

08/26/2018 - 01:52

శ్రీనగర్, ఆగస్టు 25: కాశ్మీర్ హక్కులను పరిరక్షించేందుకు 35ఏ అధికరణను రద్దు చేసే ప్రయత్నం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఈ అధికరణను రద్దు చేసేందుకు ఎటువంటి ప్రయత్నం జరగరాదన్నారు. సుప్రీంకోర్టు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ అధికరణపై నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అధికరణ జోలికి ఎవరూవెళ్లరాదన్నారు. రాజ్యాంగంలో 35ఏ భాగమని చెప్పారు.

08/26/2018 - 03:36

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే, అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చేప్పాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్సీ కుంతియా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యలయంలో ఆయన విలేఖరుతో మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.

08/26/2018 - 01:02

న్యూఢిల్లీ, ఆగస్టు 25: నూతన జోనల్ వ్యవస్థకు సంబంధించిన రాష్టప్రతి ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశాలున్నాయని లోక్‌సభ సభ్యుడు వినోద్ కుమార్ తెలిపారు. ప్రధాని ఈ మేరకు హామీ ఇచ్చారని శనివారం విలేఖరులతో మాట్లాడు తూ అన్నారు. కేసీఆర్ మరోసారి జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్టప్రతి ఉత్తర్వులను సవరించవలసిన ఆవశ్యకతను ప్రధానికి వివరించారని ఆయన తెలిపారు.

08/26/2018 - 01:00

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల అంశం న్యూఢిల్లీ వేదికంగా మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం జరిగిన భేటీలో తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నిర్వాహణ అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

08/26/2018 - 02:03

భువనేశ్వర్: దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శనివారం ఇక్కడ వెల్లడించారు. వైద్య, ఆరోగ్య శాఖలో నిపుణుల కొరత ఉందని, దాన్ని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలు పెంపొదించేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని నడ్డా తెలిపారు.

08/26/2018 - 02:45

న్యూఢిల్లీ, ఆగస్టు 25: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే పనికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలను సమర్థంగా ఎదుర్కోవడానికి పార్టీపరమైన ఏర్పాట్లను ప్రారంభించారు.

08/25/2018 - 03:31

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరం ఏర్పాటు చేసిన ఎన్‌బీపీపీఎల్ ఫ్యాకరీని కేంద్ర ప్రభుత్వం తరలించే యోచనలో ఉందని ఏపీ అభివృద్ధి పోరాట సమితి ఆరోపించింది. అదే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సమితి హెచ్చరించింది. ఢిల్లీలో పోరాట సమితి, విశాలాంధ్ర మహాసభ అధ్వర్యంలో శుక్రవారం ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

Pages