S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/24/2018 - 02:24

తిరువనంతపురం, ఆగస్టు 23: పశ్చిమ కనుమల రక్షణకు గాడ్గిల్ కమిటీ ఇచ్చిన నివేదిక సిఫార్సులను కనుక ప్రభుత్వం అమలుచేసి ఉంటే వానలు, వరదల వల్ల కేరళకు ఇంత పెనువిపత్తు సంభవించి ఉండేది కాదని ప్రముఖ పర్యావరణ వేత్త పేర్కొన్నారు.

08/24/2018 - 02:21

న్యూఢిల్లీ, ఆగస్టు 23: దేశంలో బౌద్ధ చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తే పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. బౌద్ధారామాలు, చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ ప్రతిపాదించిన బౌద్ధ సర్క్యూట్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురవుతున్న అవరోధాలను అధిగమించాలన్నారు.

08/24/2018 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారతీయ జనతాపార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చేనె 8,9 తేదీల్లో జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, అనుసరించాల్సి వ్యూహంపై సమావేశాల్లో చర్చిస్తారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. నిజానికి ఈనెల 18,19 తేదీల్లోనే జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగాల్సి ఉంది.

08/24/2018 - 02:18

తిరువనంతపురం, ఆగస్టు 23: కేరళ ముఖ్యమంత్రి పీ విజయన్ గురువారం వరద బాధితుల పునరావాస కేంద్రాలను సందర్శించినప్పుడు ప్రజలు ఆక్రందనలు, హాహాకారాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి ఎదుట బాధితులు తమ కష్టాలను ఏకరువుపెట్టారు. ఛెంగన్నూర్, కోజెచెర్రి, అలప్పుజ, ఉత్తర పరావూర్, ఛాలకుడే జిల్లాల్లోని పునరావాస శిబిరాలను ముఖ్యమంత్రి సందర్శించారు. బాధితులను ఆయన ఓదార్చారు.‘మీరు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.

08/24/2018 - 02:17

న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రజల తక్షణ అవసరాల నిమిత్తం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి 190,000 యూరోలు (రూ.1.53 కోట్లు) ఇవ్వనున్నట్టు ఈయూ ప్రకటించింది. కష్టాల్లో ఉన్న కేరళను మానవతా దృక్పధంతో ఆదుకుంటామని 28 దేశాల ఈయూ కూటమి స్పష్టం చేసిం ది.

08/24/2018 - 02:16

జైపూర్, ఆగస్టు 23: దివంగత మాజీ ప్రధాని వాజపేయి హయాంలో చేపట్టిన కార్యక్రమాలు వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాలుగా చేర్చనున్నట్టు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి వాసుదేవ్ దేవ్నానీ వెల్లడించారు. దీనిపై కసరత్తు చేయాలంటూ అజ్మీర్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ఆదేశించినట్టు గురువారం ఇక్కడ తెలిపారు.‘వాజపేయి హయాంలో చేపట్టిన కార్యక్రమాలు పాఠ్యాంశాలుగా చేర్చనున్నాం.

08/24/2018 - 02:15

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ ప్రపంచదేశాల్లో భారత్‌ను తక్కువ చేసి మాట్లాడి అవమానపరిచారని బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత్‌ను విదేశీగడ్డపై అవమానపరిచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించేందుకు భారత్‌ను అవమానపరుస్తూ మాట్లాడడం తగదని బీజేపీ అదికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు.

08/24/2018 - 01:51

న్యూఢిల్లీ, ఆగస్టు 23: తెలంగాణ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిని ఏఐసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నియమించారు. గురువారం కొత్తగా ఎనిమిది మందిని ఏఐసీసీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఉత్తర్వులను జారీ చేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా, మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలికుడిగా వంశీచంద్‌రెడ్డిని ఆ పార్టీ నియమించింది.

08/24/2018 - 01:48

న్యూఢిల్లీ, ఆగస్టు 23: వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు రూ.700కోట్ల ఆర్థికసహాయం అందిస్తామని గల్ఫ్‌దేశం యుఏఈ ప్రభుత్వం చేసిన ప్రకటన వివాదంగామారుతోంది. ఈ తరహా సహాయాన్ని అందుకోవడం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశగా రాజకీయ పార్టీలు, ప్రజలు భావిస్తున్నారు. కాగా 2016లో ప్రకృతి విపత్తు యాజమాన్య అథారిటీ (ఎన్డీఎంఏ) ఒక డాక్యుమెంట్‌ను తయారు చేసింది.

08/24/2018 - 01:41

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి కొన్ని సంస్థలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) చందా కొచ్చర్ భవితవ్యం శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంది.

Pages