S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/24/2018 - 01:32

న్యూఢిల్లీ: సుప్రసిద్ధ జర్నలిస్టు, ఆంగ్లరచయిత కుల్దీప్ నయ్యర్ కన్నుమూశారు. తుది శ్వాస విడిచే వరకు పత్రికాస్వేచ్ఛ, పౌర హక్కుల కోసం కులదీప్ నయ్యర్ పోరాడారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఇక్కడ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో మరణించారు. వయోభారం సమస్యలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

08/24/2018 - 01:31

న్యూఢిల్లీ: లోక్‌సభ, శాసనసభలకు సంబంధించి జమిలి ఎన్నికలకు అవకాశం లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. 2019లో లోక్‌సభకు, శాసనసభలకు కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించే విషయమై ఇటీవల లా కమిషన్ కసరత్తు చేసిన విషయం విదితమే. న్యాయపరమైన అవరోధాలను తొలగించి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం లేదన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగపరమైన అవరోధాలు ఉన్నాయి.

08/23/2018 - 17:21

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు కార్యకర్తలు చనిపోగా.. ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నారాయణ్ ఘర్‌లో ఉన్న టీఎంసీ కార్యాలయంలో గురువారం ఉదయం ఈ పేలుడు జరిగింది.

08/23/2018 - 17:19

న్యూఢిల్లీ: కేరళకు యూఏఈ అందిస్తానన్న విదేశీ సాయాన్ని కేంద్రం తిరస్కరించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రకారం విదేశీ సాయాన్ని అంగీకరించబోమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. దేశీయ ప్రయత్నాల ద్వారానే కేరళను అభివృద్ధిచేస్తామని తెలిపారు.

08/23/2018 - 17:18

మనాలి: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. వాహనం బోల్తా పడి 11మంది చనిపోయారు. రోహతక్ ప్రాంతంలోని రానినల్లా లోయ వద్ద మనాలి-లేహ్ జాతీయ రహదారిపై వెళుతుండగా గురువారం ఈ ఘటన జరిగింది. ఈ వాహనం మనాలి నుంచి చంబా జిల్లాలోని పంగికి వెళుతుండగా ఓవర్ లోడుతో వెళుతున్నా వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఆ సమయంలో మంచు కూడా కురుస్తుంది.

08/23/2018 - 17:18

గుజరాత్: ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, అదే నా కల అని, అది 2022నాటికి సాకారం కావాలని ప్రధాని మోదీ అన్నారు. ఆయన గురువారంనాడు గుజరాత్‌లోని జుజ్వాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద నిర్మించిన సౌంత ఇళ్లను ఈరోజు లక్ష మంది ఆడపడుచులకు పంపిణీ చేయటం ఆనందంగా ఉందని అన్నారు.

08/23/2018 - 13:36

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈరోజు తన కార్యాలయంలో విధుల్లో చేరారు. మూత్రపిండాల చికిత్స చేయించుకున్న జైట్లీ దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకుని ఈ రోజు విధుల్లో చేరారు. తిరిగి ఆర్థిక, వాణిజ్య శాఖలు తీసుకున్న ఆయన నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయంలో విధుల్లోకి చేరారు.

08/23/2018 - 13:27

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ కులదీప్‌నయ్యర్ కన్నుమూశారు. 1923 ఆగస్టు 14న జన్మించిన ఆయన ఉర్దూ పత్రిక అంజుమ్‌లో జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయి జైలుకు వెళ్లారు. బ్రిటన్ రాయబారిగా పనిచేశారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు.

08/23/2018 - 12:21

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మూకదాడుల వంటి ఘటనలకు బిజెపి అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. బిజెపి అమలుచేసిన జిఎస్‌టి, నోట్ల రద్దు వంటి కార్యక్రమాలతో పలు చిన్నవ్యాపారాలు దెబ్బతిన్నాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని, దీంతో అసహనానికి గురైన యువత ఇటువంటి దాడులను చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

08/23/2018 - 06:39

అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఒక రోజు పర్యటన కోసం గుజరాత్ వస్తారని శ్రీ సోమ్‌నాథ్ ట్రస్టు కార్యదర్శి పీకే లాహిరి బుధవారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. నాలుగు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అన్నారు. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారని, ఆతర్వాత గాంధీనగర్‌లోని శ్రీ సోమ్‌నాథ్ ట్రస్టు కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారని వివరించారు.

Pages