S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2018 - 04:16

బెంగళూరు, మే 18: కర్నాటక రాజకీయం ఎలాంటి మలుపుతిరగబోతోంది? ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేకపోయినా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేసిన బీఎస్ యెడ్యూరప్ప భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

05/19/2018 - 04:14

న్యూఢిల్లీ, మే 18: సుప్రీంకోర్టు తీర్పు కర్నాటక గవర్నర్ ‘రాజ్యాంగానికి విరుద్ధంగా’ వ్యవహరిస్తున్నారన్న సత్యాన్ని బహిర్గతం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ ముందు నుంచీ గవర్నర్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్నదన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.

05/19/2018 - 04:12

న్యూఢిల్లీ, మే 18: కేంద్రం నిధుల కేటాయింపు, పంపకం, ఇతర విషయాల్లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని, ఇందులో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల వివక్ష ఎంతమాత్రం లేదని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. నిధులు, ఇతర కేటాయింపుల్లో ఉత్తర రాష్ట్రాలకు ఒక విధంగా, దక్షిణ రాష్ట్రాలకు ఒకవిధంగా చేస్తూ వివక్ష చూపిస్తున్నారని వచ్చిన ఆరోపణలను కమిషన్ ఖండించింది.

05/19/2018 - 04:11

న్యూఢిల్లీ, మే 18: న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం అవలంబిస్తోందని బీజేపీ దుయ్యబట్టింది.

05/19/2018 - 04:11

ముంబయి, మే 18: అనైతిక విధానాలతో అధికారం చేజిక్కించుకోవడం బీజేపీ కొత్త పాలసీ అని శివసేన తీవ్రంగా ఆరోపించింది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రూల్‌ను ఎలా అవలంబిస్తోందని ప్రశ్నించారు.

05/19/2018 - 04:10

న్యూఢిల్లీ, మే 18: కర్నాటక అసెంబ్లీలో శనివారం జరిగే బలపరీక్షలో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి అధికారం చేపట్టడం ఖాయమని కేంద్ర మంత్రి, కర్నాటక బీజేపీ పోలింగ్ ఇన్‌చార్జి జావడేకర్ ధీమా వ్యక్తం చేశారు.

05/19/2018 - 04:10

న్యూఢిల్లీ, మే 18: కర్నాటక అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షకు సుప్రీం కోర్టు ఆదేశించటం చారిత్రాత్మకమని జెడీ(ఎస్), సీపీఐ నేతలు వ్యాఖ్యానించారు. నేడు జరగబోయే బలపరీక్షలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించే అవకాశం లేదని జోస్యం చెప్పారు. జేడీ(ఎస్)నేత దానిష్ అలీ మీడియాతో మాట్లాడుతూ 24 గంటల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్ప, నేటితో దిగిపోతారని జోస్యం చెప్పారు.

05/19/2018 - 04:09

బెంగళూరు, మే 18: కర్నాటక రాజకీయం రసకందాయంలో పడింది. యెడూరప్ప ప్రభుత్వ బలపరీక్ష శనివారమే నిర్వహించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వాగతించారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మకం అన్న ఆయన ‘మా ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు. మా సంఖ్య చెక్కుచెదరదు. కచ్చితంగా బలపరీక్షలో యెడ్యూరప్పను ఓడిస్తాం’అని శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ‘బీజేపీకి గెలుచుకుంది 104 సీట్లే.

05/19/2018 - 04:08

న్యూఢిల్లీ, మే 18: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవంటూ ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ దుస్థితినుంచి గ్రామీణ భారతానికి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రైవేటు రంగం ఉదారంగా తనవంతు సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, తొలి ప్రమోషన్ పొందేవరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం తప్పనిసరి చేయాలన్నారు.

05/19/2018 - 04:08

వాషింగ్టన్, మే 18: అమెరికా దేశ ప్రధాన గూఢచార వ్యవస్థ అయిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సిఐఏ)కు మొట్టమొదటిసారిగా ఒక మహిళను డైరెక్టర్‌గా నియమించారు. 70 ఏళ్ల సిఐఏ చరిత్రలో ఒక మహిళను నియమించడం ఇదే ప్రథమం. యుఎస్ సెనెట్‌లో గురువారం జరిగిన ఓటింగ్‌లో 54-45తో జినాహాస్పెల్ (61) నియామకానికి మద్దతు లభించింది.

Pages